Guppedanta Manasu May 12th: నిశ్చితార్థం వద్దన్న వసు - ఆవేశంతో ఊగిపోయిన రిషి , శైలేంద్ర నెక్ట్స్ స్టెప్ ఏంటి!
Guppedantha Manasu May 12th Update: శైలేంద్ర భూషణ్ ఎంట్రీతో గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
గుప్పెడంతమనసు మే 12 ఎపిసోడ్
కాలేజీ బాధ్యతలు తనకు దక్కాలని ఎండీ సీట్లో తాను కూర్చోవాలని కుట్రలు పన్నుతున్న శైలేంద్ర..రిషి-వసు వెళుతున్న కారుకి యాక్సిడెంట్ చేయించేందుకు ప్లాన్ చేస్తాడు. చివరి నిమషంలో దాన్నుంచి బయటపడతారు. ఆ విషయంపై జగతి దగ్గరకు మరోసారి వెళ్లి హెచ్చరిస్తాడు శైలేంద్ర. కాలేజీ ఎండీ సీటు దక్కకపోతే రిషిని చంపేస్తానని బెదిరిస్తాడు. ఇదంతా బయటినుంచి వింటుంది వసుధార. పెట్టుడు ముహూర్తంతో నిశ్చితార్థం ప్లాన్ చేసిన శైలేంద్ర...ఆ తంతు పూర్తవ్వగానే వాళ్లిద్దర్నీ ఎక్కడికైనా పంపించేయమని జగతికి చెబుతాడు. ఆ మాట విన్న వసుధార రిషి దగ్గరకు వచ్చి ఏమీ చెప్పలేక మానలేక బాధపడుతుంది.
వసు: ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది
రిషి: కష్టం వస్తే బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కష్టం తీరదు..మనం ఒక్కటయ్యే క్షణం ఎప్పుడొస్తుందా అని చూస్తున్నా
వసు: సార్ మీరు ఏమీ అనుకోవద్దు ఎంగేజ్ మెంట్ ఆపుదాం..ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి..సిట్యుయేషన్ బాగాలేదు
ఏం మాట్లాడుతున్నావ్ వసుధార అని ఫైర్ అవుతాడు రిషి...వసు షాక్ అవుతుంది... ఏం జరిగిందో పూర్తిగా తెలియాలంటే ఈ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ లో చూడాలి...
గడిచిన ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
రిషి-వసు షాపింగ్ కి వెళ్లిన తర్వాత..జగతీ పైన బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ టెన్షన్‌గా ఆలోచిస్తూ ఉంటుంది. ‘పిన్నీ ఏంటి టెన్షన్ పడుతున్నారు? భయపడుతున్నారా?’ అంటూ ఎంట్రీ ఇస్తాడు శైలేంద్ర. ‘శైలేంద్రా నిజం చెప్పు.. వాళ్లకి నిశ్చితార్థం ఏర్పాటు చేయడంలో నీ దురుద్దేశం ఏంటీ?’ అంటుంది జగతి. ‘అందులో ఏం లేదు పిన్నీ.. నీకు వాళ్లు కలవాలనేది కోరిక.. నేను అది నేరవేస్తున్నా.. నాకు రిషి గాడి ఎమ్‌డీ సీట్ కొట్టెయ్యాలని కోరిక.. అది నువ్వు తీర్చేవా ఏంటీ? సాయానికి సాయం అంతే’ అంటాడు శైలేంద్ర నవ్వుతూ. ‘శైలేంద్రా అది మాత్రం జరగదు.. కాలేజ్ నీకు దక్కడం అసాధ్యం’ అంటుంది జగతి కోపంగా. ‘సరేలే పిన్నీ మనం అలా వాళ్లతో పాటు షాపింగ్‌కి వెళ్దాం పదండి.. పైగా అక్కడ వాళ్లకు ఏం జరుగుతుందో ఏంటో? అసలేం చెప్పలేం.. సరే నేను కారు దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను. మీరు వస్తారు లెండి’ అనేసి శైలేంద్ర వెళ్లిపోతాడు. ‘నిజంగానే రిషికి ఏదైనా అపాయం తలపెడుతున్నాడా?’ అని భయపడుతూ జగతీ వెంటనే అక్కడి నుంచి శైలేంద్రతో వెళుతుంది. కారు ఓ దగ్గర ఆపి లారీ డ్రైవర్ కి కాల్ చేసి..అప్పుడే అటుగా వస్తున్న రిషిధార కారుని గుద్దేయమని చెబుతాడు. జగతి భయంతో కళ్లు మూసుకుంటుంది .. ఆఖరి నిముషంలో ఆ యాక్సిడెంట్ నుంచి బయటపడతారు రిషి, వసు. జగతి వెంటనే భయంతో కారు దిగి వాళ్ల దగ్గరకు పరిగెడుతుంది. శైలేంద్ర కూడా జగతి వెనుకే వెళ్లి..దొంగ ప్రేమ నటిస్తాడు. జగతి కోపంగా చూస్తూ రిషివాళ్లతో వెళ్లిపోతుంది.
Also Read: శైలేంద్ర నిజస్వరూపం తెలుసుకున్న వసు, జగతి కళ్లముందే రిషికి భారీ యాక్సిడెంట్
ఇంట్లో కూడా ఎప్పటిలా దేవయాని-శైలేంద్ర నటిస్తారు. మిగిలినవారంతా టెన్షన్ పడతారు.
దేవయాని: నాన్నా ఇలా అయితే ఎలా? ప్రతిసారి ఏదొక ప్రమాదం’ నువ్వు ఒంటరిగా వెళ్లకు.. అవసరం అయితే నన్ను పిలువు నేనొస్తాను.. నిన్ను జాగ్రత్తగా తిరిగి తీసుకొస్తాను
శైలేంద్ర: ‘చూడు రిషి పిన్నీ ఎలా వణికిపోతుందో?’ అంటాడు.
రిషి: ‘మేడమ్ నాకేం కాలేదు.. మీరేం టెన్షన్ పడకండి. వాడేదో తాగి నడిపాడు అంతే’అంటూ చాలా కూల్‌గా సర్దిచెబుతాడు రిషి. అయినా జగతి కళ్లల్లో నీళ్లు ఆగవు.
దేవయాని ‘వెంటనే దిష్టి తియ్యాలి.. నా రిషికి’ అంటూ ధరణీతో ఎర్ర నీళ్లు తెప్పిస్తుంది. రిషికి మాత్రమే దిష్టి తీయబోతుంటే.. ఆగు దేవయానీ.. వసుధారకు కూడా కలిపి తియ్.. అంటూ వసుని రిషి పక్కనే నిలబడమంటాడు. దేవయానికి నచ్చకపోయినా వసుతో పాటు రిషికి దిష్టి తీస్తుంది దేవయాని. ఇక ఎవరి రూమ్స్‌లోకి వాళ్లు వెళ్లిపోతాడు. జగతీ మాత్రం జరిగింది తలుచుకుని.. ‘ఇది చిన్న ప్రమాదం కాదు.. ఏ మాత్రం అటు ఇటు అయినా రిషి, వసుల ప్రాణాలే పోయేవి.. మై గాడ్’అనుకుంటుంది తల పట్టుకుంటూ.
Also Read: మే 12 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు చేసే తప్పులకు భవిష్యత్ లో భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది
మొత్తం వినేసిన వసు
ఇంతలో శైలేంద్ర.. జగతీ దగ్గరకు వస్తాడు. ‘పిన్నీ ఈ మధ్య నీకు ఆలోచనలే సగం పనైపోయినట్లు ఉంది పిన్నీ’అంటూ నవ్వుతాడు. ‘శైలేంద్రా ఎందుకు నా కొడుకు జీవితంలో ఆడుకుంటున్నాడు.. వాడు ఏం అన్యాయం చేశాడు నీకు?’ అంటుంది జగతీ ఆవేదనగా. ‘ఊరుకోండి పిన్నీ.. ఎప్పుడూ రొటీన్ డైలాగ్ చెబుతారు.. బోర్ కొట్టడం లేదా? అయినా నేను మాత్రం ఏం అన్యాయం చేశాను.. జెస్ట్ యాక్సిడెంట్ మిస్ చేయించాను.. అంతే కదా.. నిజంగా అన్యాయం చేయాలి అనుకుంటే.. మిస్ చేయడం కాదు గుద్ది పడేమనేవాడ్ని’ అంటాడు శైలేంద్ర. ఆ మొత్తం మాటల్ని వసు వినేస్తుంది గుమ్మం బయట నుంచి. షాక్ అవుతుంది...దీనికి కొనసాగింపే పైన ప్రోమో...