News
News
X

Guppedanta Manasu March 14th: రిషి మనసుకి రంగులతో ట్రీట్మెంట్ ఇచ్చిన వసు, గుప్పెడంతమనసులో త్వరలో మరో కొత్త క్యారెక్టర్!

Guppedantha Manasu March 14th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 
Share:

వీళ్లంతా ఎక్కడకు వెళ్లారు..కనీసం చెప్పలేదని దేవయాని ఫైర్ అవుతుంది. ఫణీంద్ర కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో రిషి, వసు, జగతి, మహేంద్ర, ధరణి అంతా వస్తారు. ఎక్కడికి వెళ్లారు ఏంటిది అని విరుచుకుపడుతుంది...ఇంతలో వసుధార హ్యాపీ హోలీ అని దగ్గరకు వెళుతుంది..ఆగు ఆగు అని అంటుంది దేవయాని. ఇంతలో రిషి కూడా హ్యాపీ హోలీ అంటాడు. ఏంటి వసుని తిడదాం అనుకుంటే రిషి ఇలా బుక్ చేశాడనుకుంటుంది దేవయాని. 
ఫణీంద్ర: నన్ను మీ వదినను కూడా పిలిస్తే వచ్చేవారం కదా
దేవయాని: ఎక్కడో బస్తీలో ఆడివస్తే..సంబరపడతారేంటి
ఫణీంద్ర: పండుగ ఎక్కడైనా పండుగే కదా దేవయాని
రిషి: ఆటపాటలు అవన్నీ ఎంత బావున్నాయో 
దేవయాని: అవి కూడా ఉన్నాయా
ధరణి: అవును అత్తయ్యగారు ఆ డప్పులు మెడలో వేసుకుని స్టెప్పులేస్తే చాలాబావుంది
మండిపడిన దేవయాని..రిషి నీకు రంగులు పడవు..నిన్ను పెంచిన నాకు తెలుసు వెళ్లి ఫ్రెష్ అవ్వు అంటూ పంపించేస్తుంది. ఒకరి తర్వాత ఒకరు జాగ్రత్తగా అక్కడి నుంచి జారుకుంటారు. పైకి వెళ్లిన రిషి.. వసు వచ్చేదాక ఎదురుచూస్తూ ఉంటాడు. 

Also Read: ప్రేమరంగుల్లో మునిగితేలుతున్న రిషిధార- కొడుకుని చూసి మురిసిన జగతి, రగిలిపోతున్న దేవయాని

రిషి:‘వసుధార ఈ రంగులు కడిగి పోతాయి ఏమో కానీ.. ఈ ఆనందం చాలా రోజులు ఉండిపోతుంది’ 
వసు:‘అవును సార్.. నాకు అదే అనిపించింది. థాంక్యూ సార్’ 
రిషి:‘వసుధారా థాంక్స్ నేను చెప్పాలి’ 
దేవయాని చాటుగా వింటూ ఉంటుంది.
రిషి:‘ఈ రోజు ఇంత సంతోషంగా ముగిసినందుకు నువ్వే కారణం.. డాడ్‌తో కలిసి హోలీ సంబరాలు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి’
వసు: ‘మీ ఆనందమే నా ఆనందం సార్.. ప్రపంచంలో రంగులకి చాలా శక్తి ఉంది సార్.. అవి మనసుకి ట్రీట్మెంట్ చేస్తాయి. అయినా అన్ని రంగుల్లో మీ కళ్లల్లో మెరుపు.. పెదవుల మీద చిరునవ్వు.. ఇవే గొప్ప సంతోషాన్ని ఇచ్చాయి
ఇద్దరి మాటలూ చాటుగా వింటున్న దేవయాని...రగిలిపోతూ ఉంటుంది..గోడపక్కనున్న దేవయానిని రిషి చూస్తాడు...
దేవయాని: దొరికిపోయాను అనుకున్న దేవయాని...‘హా రిషీ.. అది.. ఇలా వెళ్తున్నాను.. కాళ్లకు చీర తట్టుకుంది అందుకే ఆగాను అంటూ కవర్ చేస్తుంది
వసుకి  మాత్రం అర్థమవుతుంది

Also Read: మార్చి 14 రాశిఫలాలు, ఈ రాశివారు అహాన్ని అదుపులో ఉంచుకోవాలి లేదంటే ఊహించనివి చాలా జరుగుతాయి!

జగతీ, మహేంద్రలు కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ల మాటలు కూడా దేవయాని చాటుగా వింటుంది. ‘వసు రిషీ చాలా రోజులు తర్వాత సంతోషంగా ఉన్నారు జగతీ.. మనకి అది చాలు’ అంటాడు మహేంద్ర. ఈ ఇంట్లో నేనుతప్ప అందరూ సంతోషంగా ఉన్నారు అనుకుంటుూ వెళ్లిపోతుంది దేవయాని. వసు రిషీలు.. కాఫీని కప్పు, సాసర్‌లో పోసుకుని షేర్ చేసుకుని తాగుతూ ఉంటారు.ఇంతలో రిషి చేతికి హోలీ రంగులు సరిగా వదల్లేదని వసు.. ఆయిల్, కాటన్ తీసుకుని.. క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో దేవయాని రావడంతో..‘హా పెద్దమ్మా.. రంగుల్ని క్లీన్ చేస్తోంది’ అంటాడు. 
దేవయాని: నన్ను కూడా పిలిచి ఉంటే బావుండేది నీ సంతోషాన్ని చూసి ఉండేదాన్ని. ‘అయినా ఆ మురికి వాడలో చేసుకునేకంటే ఇక్కడే చేసుకోవచ్చు కదా.. అందరం ఇక్కడే ఉండేవాళ్లం’ 
రిషి: ‘కరెక్టే కదా వసుధార.. నాకెందుకు ఈ ఐడియా రాలేదు’
దేవయాని: ‘ఏం వసుధారా.. నువ్వైనా రిషికి చెప్పాలి కదా? నాన్నా సంతోషాలు సంబరాలు ఇవన్నీ కలిసి జరుపుకుంటేనే కదా ఆనందం ఉంటుంది’
రిషి: ‘తప్పు చేశాం వసుధార.. చాలా పెద్ద తప్పు చేశాం..’
దేవయాని:‘నాన్నా రిషి నువ్వేం తప్పు చెయ్యలేదు.. వసుధారా పాపం నన్ను మరిచిపోయింది’ ‘కదా వసుధారా’
వసు: ‘నన్ను రిషి సార్ ముందు ఇరికిస్తోంది ఈమె’ అని మనసులో అనుకుంటుంది
దేవయాని:‘సరేలే నాన్నా మీరు సంతోషంగా ఉన్నారు అది చాలు నాకు’
రిషి: ‘వసుధారా చూశావా.. పెద్దమ్మ పెద్ద మనసు.. తనని దూరం పెట్టినా తను బాధపడరు. సరే గుర్తు పెట్టుకో.. ఇకపై ఏ సెలబ్రేషన్ జరిగినా పెద్దమ్మా నా పక్కనే ఉండాల్సిందే.. ఈ విషయం బాగా గుర్తు పెట్టుకో’
వసు: ‘హా ఓకే సార్’
దేవయాని: ‘గుర్తు పెట్టుకో వసుధార’.‘రిషి నా చేతుల్లోంచి ఎప్పటికీ జారిపోనివ్వను’ అంటూ మనసులో ఫిక్స్ అవుతుంది దేవయాని.

అంతా కలిసి తింటూ ఉంటారు. వసు రిషి, జగతీ మహేంద్ర, దేవయాని, ఫణేంద్ర మూడు జంటలు తింటుంటే.. ధరణీ వడ్డిస్తుంది. మహేంద్ర ఫోన్ తీసి.. ‘మనం జంటలు బాగున్నాయి కదా.. ఓ ఫొటో తీసుకుందామా?’ అంటాడు.
వసు: ‘మరి ధరణీ మేడమ్? తన భర్త కూడా ఉండి ఉంటే ఫ్యామిలీ ఫొటో బాగుండేది కదా? మేడమ్(దేవయాని) తన గురించి కూడా ఆలోచించండి.. అవును తన పేరేంటీ మేడమ్..’
జగతి:‘సైలేంద్ర భూషణ్’
దేవయాని:‘వసుధారా ఇవన్నీ నీకు అవసరమా’
వసు: ‘లేదు మేడమ్.. నాకేం అవసరం లేదు.. మీకు కూడా మీ అబ్బాయి ఇక్కడికి రావాలనే ఉంటుంది కదా? ఏం అంటారు?’
దేవయాని: ఈ వసుధార‘హద్దులు దాటుతోంది ..పగ్గాలు వేయాల్సిందే’
రిషి: ‘అవును పెద్దమ్మా అన్నయ్యని ఇక్కడికి రప్పిద్దాం’ 
మహంద్ర:‘తను కూడా వస్తే బాగుంటుంది’
జగతి: ‘అక్కా సైలేంద్రని పిలిపించొచ్చు కదా?’
‘పెద్దమ్మా సైలేంద్ర అన్నయ్యా’ అంటూ రిషి మాట పూర్తి కాకుండానే.. ‘రిషీ సైలేంద్ర రాడు.. ఇప్పట్లో రాకపోవచ్చు.. తనకు ఏదో అగ్రిమెంట్ ఉన్నట్లుంది’ అంటుంది దేవయాని.
ధరణి: ‘నాకు తెలిసి అత్తయ్యగారు..తను రాకుండా ఆపుతున్నారు’ అనుకుంటుంది 
రిషి: ‘అయితే అన్నయ్యకు రావడం లేటు అవుతుంది అంటే.. వదిననే అక్కడికి పంపించొచ్చు కదా?’ 
మహేంద్ర: ‘గుడ్ ఐడియా’
దేవయాని: ‘అన్నంత ఈజీ కాదు మహేంద్రా.. అక్కడికి వెళ్లడానికి చాలా తతంగం ఉంటుంది కదా?’
వసు: ‘మేడమ్ అదంతా ఒకప్పుడు.. ఇప్పుడు ప్రోసెస్ చాలా ఈజీ అయిపోయింది’
దేవయాని: మరింతగా రగిలిపోతూ..‘ధరణీ.. కూరల్లో కొంచెం ఉప్పు కారాలు తగ్గించు.. ఆరోగ్యాలకు మంచిది కాదు.. చేసే పనుల మీద చేసే వంటల మీద శ్రద్ధపెట్టు’
ధరణి బాధని ఆపుకుని వంటగదిలోకి వెళ్లి ఏడుస్తుంది.. అక్కడున్నవారందరకీ ధరణి బాధ అర్థం అవుతుంది. 

Published at : 14 Mar 2023 09:06 AM (IST) Tags: Guppedanta Manasu Serial Guppedanta Manasu Serial Today Episode Guppedanta Manasu Serial Written Update Guppedanta Manasu Serial March 14th Episode

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu March 31st: చంటిపిల్లల ఫోటో చూసి మురిసిన జానకి- ప్రెగ్నెన్సీ గురించి మల్లికని అడిగిన జ్ఞానంబ

Janaki Kalaganaledu March 31st: చంటిపిల్లల ఫోటో చూసి మురిసిన జానకి- ప్రెగ్నెన్సీ గురించి మల్లికని అడిగిన జ్ఞానంబ

Gruhalakshmi March 31st: ఒక్కటైన దివ్య, విక్రమ్- కూతురి ప్రేమ విషయం తులసి ముందు బయటపెట్టేసిన లాస్య

Gruhalakshmi March 31st: ఒక్కటైన దివ్య, విక్రమ్- కూతురి ప్రేమ విషయం తులసి ముందు బయటపెట్టేసిన లాస్య

Guppedanta Manasu March 31st: రిషిధార రొమాంటిక్ మూమెంట్స్, కొడుకు రుణం తీర్చుకుంటానన్న జగతి!

Guppedanta Manasu March 31st: రిషిధార రొమాంటిక్ మూమెంట్స్, కొడుకు రుణం తీర్చుకుంటానన్న జగతి!

Brahmamudi March 31st: కనకాన్ని కలిసేందుకు గుడికి వెళ్తున్న స్వప్న- అపర్ణ మీద విరుచుకుపడిన ఇంద్రాదేవి

Brahmamudi March 31st: కనకాన్ని కలిసేందుకు గుడికి వెళ్తున్న స్వప్న-  అపర్ణ మీద విరుచుకుపడిన ఇంద్రాదేవి

Ennenno Janmalabandham March 31st: గుండెల్ని పిండేసే సీన్, ఖైలాష్ పంపిన ఫోటోస్ చూసేసిన యష్- వేద తన తప్పులేదని నిరూపించుకుంటుందా?

Ennenno Janmalabandham March 31st: గుండెల్ని పిండేసే సీన్, ఖైలాష్ పంపిన ఫోటోస్ చూసేసిన యష్-  వేద తన తప్పులేదని నిరూపించుకుంటుందా?

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి