(Source: ECI/ABP News/ABP Majha)
Guppedanta Manasu July 21st : నిజానికి చేరువలో రిషి -ఆవేదనలో వసు, మహేంద్ర ముందు ఓపెన్ అయిపోయిన శైలేంద్ర!
Guppedantha Manasu July 21st: కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర-దేవయాని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. రిషి బతికే ఉన్నాడని తెలిసి మళ్లీ కుట్రకు తెరతీశాడు శైలేంద్ర
గుప్పెడంతమనసు జూలై 21 ఎపిసోడ్ (Guppedanta Manasu July 21st Written Update)
రిషిని చంపించేందుకు శైలేంద్ర ఓ రౌడని పంపిస్తాడు. వాడు పొడవబోయేలోగా వసుధార వచ్చి కాపాడుతుంది. వాడిని పట్టుకునేందుకు వెంటపడతారు కానీ తప్పించుకుని వెళ్లిపోతాడు. కాసేపు రిషి-వసు క్షేమసమాచారాలు పదే పదే అడుగుతుంటారు. ఆ తర్వాత రూమ్ కి వెళ్లిన వసుధారకి ఇన్నాళ్లు జరగని అటాక్ మహేంద్ర సార్ - జగతి మేడం వచ్చి వెళ్లిన తర్వాత జరిగింది ఎందుకు? అంటే రిషి సార్ ఇక్కడున్న విషయం శైలేంద్రకి తెలిసిందా అని టెన్షన్ పడుతుంది. వెంటనే మహేంద్రకి కాల్ చేసి మీరు ఇక్కడికి వచ్చిన విషయం ఎవరికైనా తెలుసా అని అడుగుతుంది. రిషిపై అటాక్ జరిగిన విషయం చెబుతుంది. ప్రాజెక్ట్ మాకు అప్పగించిన విషయం ఎవ్వరికీ చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తుంది. మహేంద్ర సరే అంటాడు. వసుధార ఫోన్ కట్ చేయగానే ఎవరితో మాట్లాడారని సీరియస్ గా అడుగుతాడు
Also Read: ఈగోమాస్టర్ ని ఆలోచనలో పడేసిన వసు, కత్తి పోటుకి ఇంచు దూరంలో రిషి!
రిషి: ఇక్కడ జరిగిన విషయాలు అక్కడ చెప్పి వాళ్లని రప్పించాలి అనుకుంటున్నారా. మీ మాటలకి, మీ కన్నీళ్లకు నేను ప్రభావితం కాలేను. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు, తీసుకున్నాను కూడా నమ్మించి మోసం చేసిన మీరు నన్ను ఒప్పించడానికి ట్రై చేయవద్దు.. అనేసి వెళ్లిపోతుంటాడు
వసు: ఆగండి సార్..మీరు మాట్లాడే ఒక్కో మాటా ఎంత కఠినంగా ఉందోతెలుసా. నమ్మించి మోసం చేశారని ఎలా అంటారు
రిషి: దాన్ని మోసం అనకపోతే ఏమంటారు
వసు: మేం చెప్పినా మీరు నమ్మరు. స్వతహాగా తెలుసుకుంటేనే నమ్ముతారు లేదంటే నిజాన్ని కప్పిపుచ్చుకునేందుకే చెప్పాం అనుకుంటారు. మా మాటలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి అనుకుంటే అప్పుడే అన్నీ చెప్పేవారం. అయినా ఓ తల్లి కొడకుని మోసం చేయాలి అనుకుంటుందా
రిషి: మీరే చూశారుగా. నన్ను నా మనసుని మార్చింది.
వసు: మీరు మమ్మల్ని ఇష్టపడ్డారు. నమ్మారు. మేం చెప్పింది కరెక్ట్ అని నమ్మారు. కానీ కొన్ని విషయాల్లో నిజం చెప్పినా నమ్మరు. మీరు తెలుసుకుంటారు అనుకున్నా అంత సమయం లేదు
రిషి: నా క్షేమం కోసం నాపై నిందవేయాలా
వసు: అది కాల నిర్ణయం..అదంతే.
రిషి:నింద మోపినా భరిస్తాడని ఆ నిర్ణయం తీసుకున్నారా
వసు: అర్థం చేసుకుంటారు అనుకున్నాం...కానీ మమ్మల్ని దూరం పెడతారు అనుకోలేదు. అప్పుడు నేను మీ పక్కనుండగానే చాలా అటాక్స్ జరిగాయి. ప్రతీసారీ జగతి మేడం ఎంత ఏడ్చారో మీకు తెలిసా..మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించిన మీ పొగరు అమ్మా అని పిలుపు నోచుకోకుండా మీరే ప్రాణం అని బతుకుతున్న మీ అమ్మ మీరు క్షేమంగా ఉండాలనే...దోషిగా నిలబెట్టాం. మా మనసు చంపుకుని అలా చేశాం. మీకన్నా మేం రెట్టింపు బాధ అనుభవిస్తున్నాం.
రిషి: నాకు లైఫ్ పై ఆసక్తి పోయింది. నాకు ఇంట్రెస్ట్ లేని పనుల్లో నన్ను ఇరికించవద్దు..నాకు ఈ ఒక్క సాయం చేయండి..
అనేసి వెళ్లిపోతుంది
వసు: ఈ రోజు మీరు కోపంతో అలా మాట్లాడినా మీ ఆశయం, సంస్కారం మిమ్మల్ని మిషన్ ఎడ్యుకేషన్ వైపు నడిపిస్తుంది అనుకుంటుంది..
Also Read: డీబీఎస్‌టీ కాలేజీలోకి ఈగోమాస్టర్ రీఎంట్రీ - రిషిపై అటాక్ చేయించేందుకు శైలేంద్ర ప్లాన్!
ఆతర్వాత శైలేంద్రకి కాల్ చేస్తుంది దేవయాని. రిషి తప్పించుకున్నాడని తెలిసి ఆగ్రహంతో రగిలిపోతుంది. వాడు ఎన్నిసార్లు ఊపిరి పోసుకున్నా నేను వాడిని అంతం చేసి తీరుతానంటాడు. రిషి లేకపోతోనే నువ్వు DBST కాలేజీ ఎండీ సీట్లో కూర్చోగలవు తను తిరిగొస్తే నీ జీవితమే వేస్ట్ అని కాల్ కట్ చేస్తుంది. అప్పుడే వచ్చిన ఫణీంద్రని చూసి షాక్ అవుతుంది. ఫణీంద్ర ఏమీ వినలేదని కన్ఫామ్ చేసుకున్నాడ ఏదో కవర్ చేస్తుంది దేవయాని. హమ్మయ్య అనుకుంటుంది..
జగతిని పిలిచిన మహేంద్ర..వసుధార కాల్ చేసిన విషయం, రిషిపై అటాక్ జరిగిన విషయం చెబుతాడు. అదివిని జగతి షాక్ అవుతుంది. రిషికి ఏమైందో అని టెన్షన్ పడుతుంది. రిషి బాగానే ఉన్నాడని తెలుసుకుని ఊపిరిపీల్చుకుంటుంది. రిషి ఎక్కడున్నాడో శైలేంద్ర తెలుసుకున్నాడా తనే ఈ అటాక్ చేయించాడా అని మహేంద్ర అంటాడు... ఆ మాట విని శైలేంద్ర ఎంట్రీ ఇస్తాడు...