Guppedanta Manasu July 20th : ఈగోమాస్టర్ ని ఆలోచనలో పడేసిన వసు, కత్తి పోటుకి ఇంచు దూరంలో రిషి!
Guppedantha Manasu July 20th: కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర-దేవయాని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. రిషి బతికే ఉన్నాడని తెలిసి మళ్లీ కుట్రకు తెరతీశాడు శైలేంద్ర
గుప్పెడంతమనసు జూలై 20 ఎపిసోడ్ (Guppedanta Manasu July 20th Written Update)
జగతి-మహేంద్ర ఊరు బయలుదేరుతారు...
జగతి- పదవి,పరపతి కోసం సొంతవాళ్లని చంపేసుకోవాలనుకుంటున్నఈ రోజుల్లో ఏ సంబంధం లేని రిషి, వసుధారని మీ ఇంట్లో పెట్టుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా రిషిని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు థ్యాంక్స్ ఏంజెల్ అంటుంది
ఏంజెల్: రిషి నా ఫ్రెండ్ నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు..అయినా మీరెందుకు అంత ఏమోషన్ అవుతున్నారు
జగతి ఏమీ మాట్లాడలేక ఆగిపోతుంది..వసుధార కవర్ చేస్తుంది..
ఏంజెల్: రిషిని జాగ్రత్తగా చూసుకుంటాను
జగతి: వసుధార మేడం మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు తీసుకోండి..రిషి సార్ ని కూడా ఒప్పించండి..
మహేంద్ర; దీని గురించి ఆలోచించండి మేడం
వసుధార: సరే సార్ తప్పకుండా...మీరు అనుకున్నది జరగుతుంది
వెళ్లొస్తాం అని చెప్పేసి జగతి ఇల్లంతా చూస్తుంటుంది...
గమనించిన విశ్వనాథం..రిషి కోసమా తను బయటకు వెళ్లాడు వచ్చాక చెప్పి వెళుదురుగాని కూర్చోండి అని అంటాడు..జగతి సరే అంటుంది కానీ మహేంద్ర మాత్రం బలవంతంగా బయలుదేరుస్తాడు... జగతి అయిష్టంగా బయలుదేరుతుంది ఇంతలో రిషి ఎదురుపడతాడు... జగతి సంతోషిస్తుంది..
వెళ్లొస్తాం సార్ అని జగతి..సీయూ అగైన్ రిషి అనేసి వెళ్లిపోతారు..బయటకు వెళ్లాక కూడా వెనక్కు తిరిగి కొడుకును చూసుకుంటూ వెళతారు.
Also Read: డీబీఎస్‌టీ కాలేజీలోకి ఈగోమాస్టర్ రీఎంట్రీ - రిషిపై అటాక్ చేయించేందుకు శైలేంద్ర ప్లాన్!
మనం ఎప్పటి నుంచో ఈ కాలేజీలో పనిచేస్తున్నాం కానీ మనకు ఎప్పుడూ ఎలాంటి గౌరవం ఇవ్వలేదు. రిషి సార్, వసుధార మేడం వచ్చారో లేదో వాళ్లకి సన్మానాలు చేస్తున్నారు. చైర్మెన్ ఇంట్లో తిష్టవేశారు కదా..ఇద్దరి మధ్యా ఏదో ఉందని ఇద్దరు లెక్చరర్లు తప్పుగా మాట్లాడుకుంటారు. ఇదంతా వీన్న పాండ్యన్ వాళ్లపై ఫైర్ అవుతాడు.. ఇంకోసారి చీప్ గా చిల్లరగా మాట్లాడితే పాత పాండ్యన్ ని చూస్తారని హెచ్చరిస్తాడు. పాఠాలు చెప్పే పొజిషన్లో ఉండి స్టూడెంట్స్ తో పాఠాలు చెప్పుకోవద్దు.. వాళ్ల జీవితాలు స్టూడెంట్స్ కోసం అంకితం చేశారు అలాంటి వారిగురించి తప్పుగా మాట్లాడితే కాసేపు ఓల్డ్ క్యారెక్టర్ లోకి వెళతానని వార్నింగ్ ఇస్తాడు...
రిషి ఓ దగ్గర..వసు మరో దగ్గర కూర్చుకుని జరిగినవన్నీ గుర్తుచేసుకుంటారు. వసుధార తన చేతికున్న ఉంగరం చూసి రిషితో మంచి జ్ఞాపకాలను కళ్లముందుకు తెచ్చుకుంటుంది. ఎదురుగా ఉన్న పేపర్ పై లవ్ సింబల్ వేసి VR అని చెక్కుతుంటుంది
రిషి: తాము ఇంటినుంచి వచ్చేసినప్పటి నుంచీ జరిగినవి తలుచుకుంటాడు. అసలేం జరుగుతోంది, ఎందుకిలా అవుతోంది, నేను దూరంగా ఉండాలని ప్రయత్నించినా మళ్లీ నా జీవితంలోకి ఎందుకొస్తున్నారు..మీరు రావడం చిరాగ్గా ఉన్నా మిమ్మల్ని చూశాక మనసు తేలికగా, ప్రశాంతంగా ఉంది. కానీవాళ్లు నా దగ్గరకు రావడం అశాంతిగానూ ఉంది . వాళ్లు చేసిన పని నేను లైఫ్ లో మర్చిపోలేను. నా గుండెకు గాయంచేశారు అది మానదు . నన్ను కావాలనే కాలేజీ బాధ్యతల నుంచి తప్పించారు ఎందుకో మీకు తెలియాలి. కారణాలు తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. మీకు దూరంగా ఇన్ని రోజులు ఉన్నాను, ఇలాగే ఉండాలనుకుంటున్నాను.. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ చేయను, డీబీఎస్టీ కాలేజీకి సంబంధించిన ప్రాజెక్ట్ చేయను అనుకుంటాడు..
ఇంతలో గాలి వేసి వసు దగ్గరున్న పేపర్లు ఎగిరిపోతాయి...VR అని రాసిన పేపర్ రిషి ముందు పడుతుంది. అది చించేద్దామని రిషి అనుకునేలోగా వెళ్లి తీసుకుంటుంది వసుధార..
వసు: అన్ని చోట్లా అధికారాలు చెల్లవు, మీ అధికారం చూపించి రిజైన్ లెటర్ చించినట్టు దీన్ని చించలేరు. మీరు అక్కడే ఉండమంటే ఒప్పుకున్నాను కానీ ఇది ప్రేమ, నా ప్రాణం, నా మనసుకి గాయం అయితే నేను ఒప్పుకోను సార్
రిషి: మనసుకి గాయాలు చేసేమీరు మనసుకి గాయం అయితే ఒప్పుకోపోవడమా..ఎంత స్వార్థం
వసు: అది స్వార్థం అని మీరనుకుంటున్నారు ప్రేమ అని నేను అనుకుంటున్నాను. మీకు కొన్ని విషయాలు అర్థం అయ్యేసరికి ఆలస్యం అవుతుంది కానీ తెలుస్తుంది. మీకు నిజం తెలిసిన రోజున మొదట వసుధార గురించే ఆలోచిస్తారు
రిషి: అంత నమ్మకం ఏంటి
వసు: మీ మనసుకి ద్వేషం కమ్ముకుంది కానీ నా మనసుకి తెలుసు ఆ ద్వేషం ప్రేమగా మారుతుంది. నావల్ల తప్పు జరిగిందని తెలిసే మౌనంగా ఉన్నాను..ఆ తప్పును కావాలనే అజ్ఞానంతో చేసేంత మూర్ఖులం కాదు.. అవసరం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో చేసే తప్పులు కొన్ని ఉంటాయి. ఎందుకు చేయాల్సి వచ్చిందో మీకు చెప్పొచ్చు కానీ నేను చెప్పను..ఎందకంటే మీరే అంటారు కదా మీ అంతట మీరు తెలుసుకోవడంలోనే సంతోషం ఉంటుందని.. అందుకే అది మీరే తెలుసుకోండి..ఏనాటికైనా మేం చేసిన తప్పు వెనుకున్న కారణాలుమీరు తెలుసుకుంటారు ఆ రోజు మీ పొగరు...అని ఆగిపోయి..ఎందుకలా చేయాల్సి వచ్చిందో మీకే అర్థమవుతుంది అనేసి వెళ్లిపోతుంది..
రిషి: పొగరు..దేనికీ తగ్గదు..అయినా నాకు అన్నీ అనవసరం మీరు చేసిన మోసమే నా గుండెల్లో మెదులుతోంది మిమ్మల్ని క్షమించను అనుకుంటాడు...
Also Read: జూలై 20 రాశిఫలాలు, ఈ రాశివారు తడబాటు లేకుండా నిర్ణయాలు తీసుకోగలుగుతారు
రిషి ఇంటికి రౌడీని తీసుకొచ్చి చూపిస్తాడు శైలేంద్ర. ఈ సారి మిస్సవకూడదని హెచ్చరించి పంపిస్తాడు. ఆ విలన్ ముసుగు వేసుకుని రిషిని చంపేందుకుబయలుదేరుతాడు. నువ్వు ఎలా బతుకుతావో నేనుచూస్తాను అనుకుంటాడు శైలేంద్ర.... లోపల రిషి సోఫాలో కూర్చుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉంటాడు. ఈ లోగా ఆ విలన్ నెమ్మదిగా మెట్లపైనుంచి కిందకు దిగుతాడు కత్తి పట్టుకుని....
ఎపిసోడ్ ముగిసింది....