అన్వేషించండి

జూలై 20 రాశిఫలాలు, ఈ రాశివారు తడబాటు లేకుండా నిర్ణయాలు తీసుకోగలుగుతారు

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ జూలై 20 గురువారం రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today July 20, 2023

మేష రాశి
ఈ రోజు మీరు తలపెట్టే పని పూర్తికాదు. ఈ రాశివారు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు, వ్యాపారులు చాలా కష్టపడితే కానీ మంచి ఫలితం అందుకోలేరు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. పిల్లల ప్రవర్తన మెరుగుపడేలా మీరు కొన్ని సూచనలు చేయాలి వారిని కనిపెట్టుకుంటూ ఉండాలి.

వృషభ రాశి
ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో పోటీ వాతావరణం ఉంటుంంది. కుటుంబ సభ్యుల కోసం చేసే ఖర్చులు పెరుగుతాయి. అహంకారంతో మిత్రులతో విభేదాలు పెట్టుకుంటారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయం కాదు. 

మిథున రాశి
ఈ రాశివారిపై జ్ఞానోదయం పొందిన వారి ప్రభావం ఉంటుంది. వ్యాపారంలో ఆదాయంపెరుగుతుంది. సోదరులకు బహుమతులు ఇస్తారు. విక్రయాలకు సంబంధించి తమ లక్ష్యాన్ని ముందుగానే పూర్తిచేస్తారు. భార్యభర్తలు ఈరోజు ప్రశాంతంగా ఉంటారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.

Also Read: ఈ 3 రాశుల్లో జన్మించినవారి జాతకంలో రాజయోగం, అపారమైన సంపద పొందుతారు!

కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశివారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు చేసినా మాట పడే అవకాశం ఉంది. ఇతరులు మిమ్మల్ని నిందించడానికి అస్సలు వెనుకాడరు. స్నేహితులు, కుటుంబ పెద్దల నుంచి సహకారం అందుతుంది. విద్యార్థులు ఇతర విషయాలపై ఆసక్తి ప్రదర్సించడం మానుకోవాలి. 

సింహ రాశి
సింహ రాశి వారు వ్యాపారంలో వృద్ధి చెందుతారు. పాత అప్పుల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది. మీ గురించి అందరూ ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి ఈ రాశివారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ కోరిక అయినా ఈ రోజు నెరవేరుతుంది. వ్యాపార విస్తరణకు కొత్త పద్దతులు అనుసరించడం లాభిస్తుంది. అనుకున్న పనులు పూర్తిచేయడంలో బిజీగా ఉంటారు.

కన్యా రాశి
భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న కన్యారాశివారు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాలను వేరొకరికి అప్పగించి నిర్లక్ష్యంగా ఉండకూడదు. మీ సామర్థ్యం ఏంటో అంచనా వేసుకున్న తర్వాతే ఏపనైనా చేపట్టండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం రావొచ్చు. అధిక పని ఒత్తిడి వలన అలసటకు గురవుతారు.

తులా రాశి
ఈ రాశివారు కుటుంబానికి సమయం కేటాయించాలి. పూర్తి విధేయతతో మీ బాధ్యతలు పూర్తిచేయాలి. పిల్లల సక్సెస్ చూసి మీలో ఉత్సాహం పెరుగుతుంది. స్నేహితుల సమస్యలను అర్థం చేసుకుంటారు వారికి అవసరమైన సహకారం అందిస్తారు. సాహిత్య రంగానికి సంబంధించిన వ్యక్తులు ద్రవ్య ప్రయోజనం, గౌరవం పొందుతారు.

Also Read: మీ నక్షత్రం ప్రకారం మీ వాహనం( టూ వీలర్ or ఫోర్ వీలర్) ఏ రంగు ఉండాలో తెలుసా!

వృశ్చిక రాశి
ఈ రాశి ఉద్యోగులు సహోద్యోగులతో మర్యాదగా ప్రవర్తించండి. కుటుంబానికి సంబంధించి కొన్ని విషయాల్లో భావోద్వేగానికి లోనవుతారు. కొత్త పనుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. వ్యాపార ఒప్పందాలను సకాలంలో పూర్తిచేస్తారు. భార్యాభర్తల మధ్య అనుబంధం బలంగా ఉంటుంది.

ధనస్సు రాశి
ఈ రాశివారు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు శుభసమయం. వ్యాపారులు అప్రమత్తంగా లేకపోతే నష్టాలు తప్పవు. నూతన పెట్టుబడులు పెట్టే ఆలోచనను వాయిదా వేయడం మంచిది. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ప్రేమికులకు శుభసమయం

మకర రాశి
ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో ఒక వ్యక్తితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. దీని వలన మీ మనస్సు చంచలంగా మారవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ స్నేహితుల నుంచి సలహా తీసుకోవాలి.కష్టతరమైన సబ్జెక్టులను అధ్యయనం చేయడానికి ఈ రోజు అద్భుతమైనది. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు

కుంభ రాశి
ఈ రాశికి చెందిన వారు దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టైతే ఈ రోజు కొంత ఉపసమనం లభిస్తుంది. పనిచేసే ప్రదేశంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచన ముందుకు సాగుతుంది. పెద్దల అనుభవాల నుంచి నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు.సామాజిక సేవపై ఆసక్తి చూపిస్తారు

మీన రాశి
ఈ రోజు మీకు నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఎలాంటి నిర్ణయం అయినా తడబాటు లేకుండా తీసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికందుతుంది. సంబంధాల పట్ల మీ వైఖరిలో చాలా మార్పులు ఉండొచ్చు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Embed widget