(Source: ECI/ABP News/ABP Majha)
Guppedanta Manasu July 19th : డీబీఎస్‌టీ కాలేజీలోకి ఈగోమాస్టర్ రీఎంట్రీ - రిషిపై అటాక్ చేయించేందుకు శైలేంద్ర ప్లాన్!
Guppedantha Manasu July 19th: కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర-దేవయాని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. రిషి ఇంట్లోంచి వెళ్లిపోయిన తర్వాత ఇన్నేళ్లకు జగతి మహంద్ర కొడుకుని కలుుసుకున్నారు
గుప్పెడంతమనసు జూలై 19 ఎపిసోడ్ (Guppedanta Manasu July 19th Written Update)
రిషిని తిరిగి డీబీఎస్‌టీ కాలేజీ వ్యవహారాల్లో భాగం చేయడానికి జగతి, మహేంద్ర కలిసి ఓ ప్లాన్ వేస్తారు. రిషిధారకి తిరిగి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించేందుకు ప్లాన్ చేసుకుంటారు. అదే విషయం విశ్వనాథంకి చెబుతారు. మర్నాడు కాలేజీలో మీటింగ్ నిర్వహించి ఆ బాధ్యతలు తీసుకోమని కోరతాడు విశ్వనాథం. వసుధార వెంటనే ఒప్పుకుంటుంది కానీ రిషి మాత్రం అయిష్టంగానే సరే అనాల్సి వస్తుంది. ఈ ప్రపొజల్ తీసుకొచ్చినవారితో మాట్లాడాలి అనుకుంటున్నానని చెప్పి రిషి మీటింగ్ నుంచి వెళ్లిపోతుంది. ఆవెనుకే ఫాలో అవుతుంది వసుధార.
జగతి-మహేంద్రని కలుస్తారు రిషిధార
రిషి: మళ్లీ నాజీవితంలోకి వచ్చి ప్రశాంతత లేకుండా ఎందుకు చేస్తున్నారు. వేటాడి వెంటాడి ఎక్కడున్నానో వెతుక్కుని వచ్చారు. మీ రాక, మీ ఊహే నన్ను రకరకాలుగా చిత్రవధ చేస్తోంది. నిందలు మోపి నన్ను ఒక మోసగాడు అని కాలేజీ నుంచి పంపించారు. మళ్లీ ఎందుకొచ్చారు ఈ మోసగాడి దగ్గరకు మహేంద్ర: అలా ఎందుకు అనుకుంటావ్..అలా ఎందుకు చేయాల్సివచ్చింది? దాని వెనుక ఉన్న కారణాలేమిటో తెలుసుకోవాలి
రిషి: ఇంకేం తెలుసుకోవాలి. ఈ గురుశిష్యులు ఇద్దరు కలిసి నా మీద మోసగాడు అని ముద్ర వేశారు. నేను మోసగాడినని వీరిద్దరు అందరిని నమ్మించారు. ఎండీగా పనికిరానని తేల్చేశారు. బోర్డ్ నుంచి తీసేశారు. నా ప్రాణం లాంటి డీబీఎస్‌టీ కాలేజీకి నన్ను దూరం చేశారు. నువ్వు తప్పుడు మనిషిని అని నింద మోస్తూ బతికిపో అని శాపం పెట్టారు. ఆ క్షణంలో మనిషి ఎంత బాధనైతే భరిస్తాడో అంత బాధను తాను భరించాను. ఇంత చేసి ఇప్పుడు నన్ను పొగిడి బాధ్యతలు అప్పగించి ఏం చేయాలని అనుకుంటున్నారు? నన్ను మళ్లీ ఇబ్బంది పెట్టడానికే పిలుస్తున్నారా ? మీరు నా జీవితంతో ఆడుకోవాలి అనుకుంటున్నారా?
జగతి: నీకు మా మీద ఉన్న కోపం సహజం అని జగతి అనేలోగా
రిషి: ఇది కోపం కాదు ఆవేదన
జగతి: నువ్వు దూరమైంది మావల్లే అది మేం చేసిన తప్పు అందుకు చేతులు జోడించి క్షమాపణలు అడుగుతున్నాను. డీబీఎస్‌టీ కాలేజీ వైభవం పోతోంది, మిషన్ ఎడ్యుకేషన్ ప్రభావం తగ్గిపోతోంది, మినిస్టర్ గారు మీ యాక్షన్ ఏంటని అడుగుతున్నారు. అందుకే నిన్ను టేకప్ చేయమని అడుగుతున్నాను. మన ద్వేషం, మన దూరం వ్యక్తిగతం....నిన్ను రమ్మని అంటుంది మాత్రం మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతల కోసం మాత్రమే. మాకోసం కాదు రిషి పేద పిల్లలకోసం, నువ్వు అనుకున్న లక్ష్యం కోసం ఈ సాయం చేయాలి
రిషి: ఈ రిషి బలం బలహీనత మీకు తెలుసు అందుకే రమ్మంటున్నారు..నేను ఆలోచించనిదే ఏమీ చేయలేను . దయచేసి మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్లిపొండి. మళ్లీ నా జీవితంలోకి రాకండి అనేసి వెళ్లిపోతాడు
వసుధార కూడా జగతిపై సీరియస్ అవుతుంది. మీరు చేసిన తప్పువైపు సహకరించాను అందుకే నన్ను తప్పు చేసిన మనిషిగానే చూడమని చెప్పి వసుధార కూడా వెళ్లిపోతుంది.
Also Read: 'గుప్పెడంత మనసు' సీరియల్: రిషి, మహేంద్ర మీద అనుమానపడిన ఏంజెల్- కొడుకుని హగ్ చేసుకుని ఏమోషనలైన తండ్రి
జగతి-మహేంద్ర
కన్నీళ్లలో మునిగిపోయిన జగతిని మహేంద్ర ఓదార్చుతాడు. రిషి, వసుధార క్షేమంగా ఉన్నారని తెలిసింది కదా మనకు అది చాలాని అంటాడు. రిషి మనసులో ఉన్న ద్వేషం, కోపం పోయి మళ్లీ మన దగ్గరకు వచ్చేలా దేవుడు చేస్తాడని అప్పటివరకు ధైర్యంగా ఉండమని జగతితో అంటాడు మహేంద్ర.
జగతి-విశ్వనాథం
మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ బాధ్యతల్ని తీసుకోవడానికి రిషి ఒప్పుకోలేదని విశ్వనాథంతో అంటారు జగతి మహేంద్ర. ఇలాంటి కార్యక్రమాలకు రిషి ఎప్పుడు ముందుంటాడని, అలాంటిది మిషన్ ఎడ్యుకేషన్ ఒప్పుకోకపోవడానికి కారణం ఏమై ఉంటుందని విశ్వనాథం అనుమానపడతాడు. బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో రిషి ఆలోచనలో పడ్డాడని, తప్పకుండా అతడు ఒప్పుకుంటాడనే నమ్మకం ఉందని జగతి, మహేంద్ర అంటారు. వీళ్ల మాటలు వింటాడు రిషి.
శైలేంద్ర
రిషి బతికి ఉన్నాడనే నిజాన్ని శైలేంద్ర జీర్ణించుకోలేకపోతాడు. రిషి బతికి ఉన్నంత కాలం తన గుండెల్లో ఈ భయం ఉంటుందని అనుకుంటాడు శైలేంద్ర. శత్రుశేషం ఉండకూడదంటే రిషిని ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అవుతాడు. రిషి ఊపిరి ఆగేదాక అతడిపై ఎన్నిసార్లయినా ఎటాక్ చేయాలని అనుకుంటాడు.
Also Read: జూలై 19 రాశిఫలాలు, ఈ రాశివారు గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు బయటపడతాయి!
మరోవైపు రిషిని వదిలిపెట్టి వెళ్లడానికి జగతి మనసు ఒప్పుకోదు. రిషి సంతోషంగా ఉండాలంటే వెళ్లితీరాల్సిందే అని మహేంద్ర చెబుతాడు. ఇంకో రెండు, మూడు రోజులు ఉండి వెళ్దామని జగతి పట్టుపడుతుంది. రిషి కోపం, అసహ్యం తనకు కనిపించడం లేదని తను పిలిచిన అమ్మా అనే పిలుపే వినిపిస్తోందంటుంది.
ఎపిసోడ్ ముగిసింది