అన్వేషించండి

జూలై 19 రాశిఫలాలు, ఈ రాశివారు గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు బయటపడతాయి!

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ జూలై 19 బుధవారం రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today July 19, 2023

మేష రాశి
ఈ రోజు ఈ రాశి వ్యాపారులకు వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి.  వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు మీరు తీసుకునే జాగ్రత్తలే మీ గౌరవాన్ని నిలబెడతాయి. పిల్లల నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం క్షీణించవచ్చు జాగ్రత్త. అనవసర విషయాలపై చర్చ పెట్టొద్దు.

వృషభ రాశి
ఈ రాశివారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఈ రోజు మీకు మంచి రోజు. ప్రణాళికలో వేసుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఈ కారణంగా సంతోషంగా ఉంటారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. మీరు గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు బయటపడతాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. చాలాకాలం తర్వాత పాత స్నేహితుడిని కలుస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. 

మిథున రాశి
ఈరోజు మీ ఆదాయం పెరుగుతుంది. మీరు కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.  మీ పురోగతికి మార్గంలో కొన్ని అడ్డంకులు ఉంటే వాటిని ముందుగానే తొలగించుకునే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఆగిపోయిన కొన్ని పనులు ఊపందుకుంటాయి. ముఖ్యమైన సమాచారాన్ని లీక్ చేయొద్దు. స్నేహితులతో సమయం స్పెండ్ చేస్తారు.

కర్కాటక రాశి
ఆస్తికి సంబంధించిన విషయాలలో ఈ రోజు ఫలితం మీకు అనుకూలంగా వస్తుంది. ఎప్పటినుంచో సాగుతున్న వివాదాలకు ఫుల్ స్టాప్ పడుతుంది.  ఇల్లు, వాహనం, దుకాణం లాంటి ఆస్తులు కొనుగోలు దిశగా అడుగేస్తారు.  కుటుంబంలోని సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు. ఈరోజు సీనియర్ సభ్యుల సహాయంతో మీరు మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న విభేదాలను పరిష్కరించుకోగలరు. మీ అంచనాలకు అనుగుణంగా పిల్లలుంటారు. మీరు భవిష్యత్తు కోసం కొంత డబ్బు ఆదా చేసుకునేందుకు ప్రయత్నించండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

Also Read: జూలై 18 నుంచి అధిక శ్రావణం ప్రారంభం, వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి!

సింహ రాశి
ఈ రోజు ఈ రాశివారికి కొన్ని చిక్కులు తప్పవు. వ్యాపారులు అనవసరమైన ఒత్తిడికి గురవుతారు.మీరు సొంతపనికన్నా ఇతరుల పనిపై ఎక్కువ దృష్టిపెడతారు. దీంతో సమస్యలు మరింత పెరుగుతాయి. అనవసరమైన చర్యలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబంలో ఏదైనా శుభకార్యం నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈ రాశి ఉద్యోగులపై ప్రత్యర్థులు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తారు..మీరు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి

కన్యా రాశి
ఈ రోజు ఈ రాశివారికి సమస్యలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగులకు పై అధికారులతో మంచి స్నేహం ఉంటుంది.  మీరు సకాలంలో నిర్ణయం తీసుకోవడం ద్వారా అధికారులను ఆశ్చర్యపరుస్తారు. పోటీ రంగంలో ముందుకు సాగుతారు. దూరంగా ఉన్న బంధువుల నుంచి నిరాశతో కూడిన సమాచారం వింటారు. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. 

తులా రాశి
ఆరోగ్యం పరంగా ఈరోజు మీకు బలహీనమైన రోజు. ప్రత్యర్థులు ఇచ్చే తప్పుడు సమాచారం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే చేసే పనిలో అప్రమత్తంగా ఉండాలి. ఒకరు చెప్పింది వినికాకుండా మీ నిర్ణయం మీరు తీసుకోండి. ఆలోచనల్లో సానుకూలతను కొనసాగించండి.  పిల్లల వైపు నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఇంకొంతకాలం ఎదురుచూపులు తప్పవు. 

వృశ్చిక రాశి
ఈ రోజంతా  మీకు హడావిడిగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఏదైనా విభేదాలు ఉంటే అవి తొలగిపోతాయి. ఈరోజు మీరు వ్యాపారంలో కొంత నష్టం ఉండవచ్చు. పనిలో అధిక శ్రమ కారణంగా మీరు అలసిపోయినట్లు అనిపించవచ్చు. కొన్ని పెద్ద పనులు పరిష్కారం అవుతాయి. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఆర్థికంగా చాలా నష్టపోతారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు

Also Read: గడిచిన వారం కన్నా ఈ వారం ఈ రాశులవారి ఆర్థిక స్థితి బావుంటుంది!

ధనస్సు రాశి
ఈ రోజు మీకు కచ్చితంగా ఫలవంతంగా ఉంటుంది. మీ మనస్సులో ప్రతికూల శక్తిని ఉంచుకోవద్దు లేదంటే మీరు తలపెట్టే పని చెడిపోతుంది. చేసే పనిని మంచి ఆలోచనతో ప్రారంభించండి. చట్టపరమైన విషయంలో మీరు నిరాశ చెందవచ్చు. ఆరోగ్యంలో కొంత క్షీణత ఉంటే దానిని విస్మరించవద్దు. ప్రయాణం చేయాల్సి ఉంటే వాహనం జాగ్రత్తగా నడపాలి. వ్యాపారం బాగానే సాగుతుంది. ఉద్యోగులకు మిశ్రమ సమయం. 

మకర రాశి
ఈ రోజు మీకు గడిచిన రోజుల కన్నా మెరుగ్గా ఉంటుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనే మీ కల నెరవేరుతుంది. ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో ఏవైనా కొత్త పనులు చేయాలనే ఉత్సాహంతో ఉంటారు. మీరు మానసికంగా , శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. మీ ప్లాన్‌లలో దేనిలోనైనా ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టవద్దు, లేకుంటే సమస్య ఉండవచ్చు, దాని కోసం మీరు తర్వాత పశ్చాత్తాపపడతారు.

కుంభ రాశి
ఈ రోజు మీకు మిశ్రమ రోజుగా ఉంటుంది. మీ కుటుంబంలోకి కొత్త అతిథి రావచ్చు. ఏదో శుభకార్యక్రమంలో కుటుంబ సభ్యులందరూ బిజీబిజీగా ఉంటారు. మీ తల్లిదండ్రులతో కలసి ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలి అనుకుంటే ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది. మీ మనసులో ఉన్న సమస్యల గురించి ఎవరితోనైనా చర్చిస్తే మనసు తేలికపడుతుంది.

మీన రాశి
ఈ రోజు మీకు కొన్ని సమస్యలతో నిండి ఉంటుంది. అధిక పని కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉండదు. ఇరువైపుల వాదనలు విన్నాకే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభఫలితాలే ఉన్నాయి. నిరుద్యోగులు ఇంకొంత కాలం ఎదురుచూడడం తప్పదు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Income: కాంగ్రెస్ పాలనలో తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలనలో తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Income: కాంగ్రెస్ పాలనలో తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలనలో తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Eating Ghee on an Empty Stomach : ఉదయాన్నే స్పూన్ నెయ్యి తింటే కలిగే ప్రయోజనాలివే.. బరువు కూడా తగ్గొచ్చు
ఉదయాన్నే స్పూన్ నెయ్యి తింటే కలిగే ప్రయోజనాలివే.. బరువు కూడా తగ్గొచ్చు
Embed widget