Guppedanta Manasu April 15th: రిషి సార్ కి తొందరెక్కువైంది, దేవయాని మాస్టర్ ప్లాన్ కి అదిరిపోయే కౌంటర్!
Guppedantha Manasu April 15th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంతమనసు ఏప్రిల్ 15 ఎపిసోడ్
వసుధార రూమ్ కి వెళ్లిన రిషి..దేవయానితో మాట్లాడిన మాటలు విన్నానని బాగా మాట్లాడావని చెబుతాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. వసుధార కిడ్నాప్ గురించి మాట్లాడుతుంది..జరిగిన విషయాలను తలుచుకొని ఆలోచిస్తూ ఉండకూడదని చెప్పి నేను చూసుకుంటాలే అని భరోసా ఇస్తాడు. నువ్వు తిని అంటే నువ్వు తిను అని పోటీ పడుతూ..ఇద్దరూ ఒకేసారి యాపిల్స్ తినిపించుకుంటారు..ఇదంతా చూసిన దేవయాని వీళ్లని ఎలాగైనా విడదీయాలి అనుకుంటూ వెళ్లిపోతుంది. బయటకు వెళ్లేందుకు ఇధ్దరూ బయలుదేరుతారు..వసుధార ఎప్పటిలా తూలిపడబోతుంటే రిషి పట్టుకుంటాడు...బ్యాంగ్రౌండ్ లో ఓ సాంగ్ వేసుకుంటారు. ఆ తర్వాత గుడ్ నైట్ చెబుతూ...ఇద్దరం చెరో రూమ్ లో ఉండి గుడ్ నైట్ చెప్పుకోవడం కాకుండా పక్కపక్కనే ఉండి గుడ్ నైట్ చెప్పుకునే రోజుకోసం ఎదురుచూస్తున్నాను అంటాడు. ఆ తర్వాత కూడా ఇద్దరూ కదలరు.. సంతోషం ఎక్కువైంది ఈ రాత్రి నిద్రరాదు అని వసు అంటే.. ఓ ప్రమాదాన్ని ఎదుర్కొన్నాను అందుకే ప్రశాంతంగా నిద్రపోతాను అంటాడు. ఆ తర్వాత మళ్లీ వసుధారని బెడ్ వరకూ తీసుకొచ్చి గుడ్ నైట్ చెప్పేసి వెళ్లిపోతాడు.
Also Read: వసు ప్రేమలో తడిసి ముద్దవుతోన్న రిషి, కనిపించని శత్రువులతో జాగ్రత్త అని కొడుకుని హెచ్చరించిన జగతి
తెల్లారేసరికి దేవయాని స్కెచ్ రెడీ చేస్తుంది. ఫణీంద్ర కూర్చుని ఉంటాడు...ఇంతలో రిషి వచ్చి ఎందుకు పెద్దమ్మా పిలిచారని అడుగుతాడు. జగతి, మహేంద్ర మీరుకూడా రండి అంటుంది దేవయాని. రిషి-వసుధార పెళ్లిగురించి మాట్లాడడానికి పిలిచాను అంటుంది దేవయాని.
దేవయాని: అన్ని పద్ధతులు తెలుసు కాబట్టి ఇంటి పెద్దగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది..ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేద్దాం.. వసు తల్లిదండ్రులను తీసుకొస్తే మాట్లాడుదాం
వసు-జగతి: వసుధార టెన్షన్ పడుతూ జగతితో మాట్లాడుతుంది
దేవయాని: మీలో మీరే మాట్లాడుకుంటే మాకేం అర్థం అవుతుంది మా అందరికీ కూడా చెప్పండి
జగతి: అది కాదు అక్కయ్య వాళ్ళ ఇంట్లో సమస్యలు ఉన్నాయని మాట్లాడుతోంది
దేవయాని: సమస్యలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి మన ఇంట్లో లేవా వాటిని పక్కన పెట్టి మనం ముందుకు వెళ్లాలి. నేను ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను జగతి మీరు ఎప్పుడు వెళ్తారో టైం చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్లి రండి
రిషి: అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదంటాడు రిషి...తన గురించి తన ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు పెద్దమ్మ మనందరికీ తెలిసిందే
దేవయాని: అదేంటి కొన్ని పద్ధతిలో ఉంటాయి కదా
రిషి: డేట్ ఫిక్స్ చేసి ఆరోజు పిలవండి పెద్దమ్మ వాళ్ళు వచ్చి మాట్లాడి వెళ్తారు. మనం వాళ్ళ ఊరు వెళ్లాల్సిన పనిలేదు మీరు అలాంటి ప్రయాణాలు పెట్టకండి
మహేంద్ర: రిషి చెప్పింది కరెక్టే కదా వదిన
దేవయాని: నువ్వు కూడా అలాగే మాట్లాడితావేంటి మహేంద్ర తల్లిదండ్రులుగా మీరు దగ్గరండి చూసుకోవాల్సింది పోయి
రిషి: మీరు చెప్పింది కరెక్టే కానీ.. ఈ సిట్యుయేషన్లో ఉన్నప్పుడు మనం వెళ్లి వాళ్ళను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు పెద్దమ్మ . మీరు ఇబ్బంది పడకండి ఎవరిని ఇబ్బంది పడకండి పెద్దమ్మ మేమిద్దరం ప్రేమించుకుంన్నాం. పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి కానీ ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఉండాలని అనుకుంటున్నాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
Also Read: ఏప్రిల్ 15 రాశిఫలాలు, ఈ రాశులవారు తొందరపాటు తగ్గించుకుంటే విజయం సాధిస్తారు
ధరణి వంట చేస్తుండగా వసుధార సంతోషంగా కిచెన్ లోకి వెళ్తుంది.
ధరణి: కాఫీ కలుపుతున్న వసుధారతో...ఏంటి వసుధార అప్పుడే నాకు పూర్తిగా సహాయంగా వచ్చేస్తున్నావా
వసుధార: ప్రేమగా ధరణిని హత్తుకుంటుంది. నాకు మిమ్మల్ని ప్రేమగా అక్క అని పిలవాలని ఉంది మేడం అనడంతో అలా అయితే ఇప్పుడు అక్కయ్య అని పిలువు అని అంటుంది ధరణి. అప్పుడు వారిద్దరు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు.
నిజంగానే వీళ్ళిద్దరినీ దూరం చేద్దామనుకుంటే వాళ్ళు ఇంకా దగ్గరవుతున్నారని ఆలోచనలో పడుతుంది దేవయాని. నా ప్రయత్నాలు అన్నీ ఫెయిల్ అవుతున్నాయి.. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ధరణి అక్కడికి వచ్చి కాఫీ ఇస్తుంది. దేవయాని కావాలనే ధరణిని టార్గెట్ చేస్తుంది. ధరణి కూడా కౌంటర్స్ వేస్తుంటుంది. పంచదార తగ్గంది కాఫీలో అంటే..మీ ఆరోగ్యం కోసం అని రిప్లై ఇస్తుంది. చూడు ఇప్పుడు కాఫీలో పంచదార తగ్గించినట్టు పెళ్లిసంబరాల్లో పడి నన్ను నిర్లక్ష్యం చేయవద్దు..అదే జరిగితే జగతికి కోడలు వస్తుంది...నాకోడలు..అని గ్యాప్ ఇచ్చిన దేవయాని ఒళ్లు దగ్గర పెట్టుకుని నీపని నువ్వు చేసుకో అంటుంది.