News
News
వీడియోలు ఆటలు
X

ఏప్రిల్ 15 రాశిఫలాలు, ఈ రాశులవారు తొందరపాటు తగ్గించుకుంటే విజయం సాధిస్తారు

Rasi Phalalu Today 15th April 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

ఏప్రిల్ 15 రాశిఫలాలు

మేష రాశి

ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. కొత్త ప్రణాళికలు అమలుచేయడానికి మంచిరోజు అవుతుంది. అవసరం అయినవారికి సహాయం చేయండి. బంధువుల నుంచి శుభవార్త వింటారు..కుటుంబంలో సంతోషం ఉంటుంది. మీ గురించి మీరు గర్వపడతారు. వ్యాపారులు బిజీగా ఉంటారు. ఉద్యోగులు ఉన్నతాధి ఈ రోజు మీరు పేదవారికి సహాయం చేసే అవకాశం పొందుతారు. మీ బంధువులు శుభవార్త చెప్పగలరు, దాని కారణంగా ఇంట్లో ఆనందం ఉంటుంది. వైవాహిక జీవితం బావుంటుంది

వృషభ రాశి

ఈరోజు మీకు ప్రయోజనకరమైన రోజు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.ఈ రోజంతా బిజీబిజీగా ఉంటారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సక్సెస్ త్వరలోనే మీకు చేరువవుతుంది. ప్రైవేట్ రంగంలో పనిచేసేవారు పురోభివృద్ధి సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. స్టాక్ మార్కెట్ తో సంబంధం ఉండేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది..ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. 

మిథున రాశి

ఈరోజు అద్భుతమైన రోజు అవుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుస్తారు. ఉద్యోగులు పనిలో తొందరపాటు ప్రదర్శించకుండా ఉంటే సమయానికి పని పూర్తవుతుంది.వ్యాపారంలో భాగస్వాముల నుంచి మంచి సహకారం ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది. మీరు ఏదైనా ఆఫీసు పనిలో తొందరపడకపోతే, పని సులభంగా సమయానికి పూర్తవుతుంది. విద్యార్థులు చదువుల్లో మార్పులు చేసుకోవడానికి టైమ్ టేబుల్‌లో మార్పులు చేసుకోవాలి. ఈరోజు మీ ధైర్యం చాలామందికి స్ఫూర్తిదాయకంగా మారుతుంది.

కర్కాటక రాశి

ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. జీవిత భాగస్వామి మనసు  అర్థంచేసుకోవడానికి ప్రయత్నించండి. బంధువులతో సఖ్యత ఉంటుంది. కొత్త వ్యక్తిని కలుస్తారు. ప్రాజెక్ట్ వర్క్‌లో మీకు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆఫీసు పనిలో ఇతరుల అభిప్రాయాలను తీసుకోవద్దు. మీ ప్రియమైనవారి సహాయం తీసుకుంటే మీరు చేపట్టిన పని సులభతరం అవుతుంది. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు

Also Read: అక్షయ తృతీయ అంటే బంగారం కొనడం కాదు, ఈ ఆలయాలకు చాలా ప్రత్యేకం!

సింహ రాశి

ఈ రోజు సింహరాశివారికి అద్భుతంగా ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవడంలో మీ ఖాళీ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే..ఇది మీ పురోగతికి దోహదపడుతుంది. ఈ రోజు మిమ్మల్ని కలిసే వ్యక్తుల వల్ల ఆనందంగా ఉంటారు. కష్టంలో ఉన్న స్నేహితుడికి ఆర్థికంగా సహాయం చేస్తారు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెడతారు. వ్యాపారంతో సంబంధం ఉన్నవారికి లాభాలు వస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఆసక్తి ఉంటుంది.రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

కన్యా రాశి

ఈరోజు మీ ఇంటికి కొత్త అతిథి రాకతో సంతోషం ఉంటుంది. కొత్తగా ప్రారంభించే పనిపట్ల ఉత్సాహంగా ఉంటారు. అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు.మీ ఆదాయానికి కొత్త వనరులు వస్తాయి. మీ  ఆర్థిక పరిస్థితి బావుంటుంది. సాహిత్య రంగంలో ఉన్నవారికి మరింత శ్రద్ధ పెరుగుతుంది. క్రీడలతో సంబంధం ఉన్న ఈ రాశి వారు ఈరోజు సాధనలో బిజీగా ఉంటారు. ఆర్థిక విషయాలలో తోబుట్టువులు, స్నేహితుల సహకరిస్తారు.

తులా రాశి 

ఈ రోజు ప్రత్యేకంగా ఒకరిని కలవబోతున్నారు. పాత స్నేహితుడిని కలుస్తారు. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి గర్వపడతారు. ఈ రోజు మీరు కొత్త పని మార్గాలను పరిశీలిస్తారు. ఎవరికైనా సహాయం చేసే అవకాశం మీకు లభిస్తుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది, సాయంత్రం ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తారు.

Also read: గంగమ్మ జాతరలో స్త్రీల రూపంలో పురుషులు, ఈ వేషధారణ వెనుక కారణం తెలిస్తే పూనకాలు లోడింగ్!

వృశ్చిక రాశి

ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మీ ఇంటికి బంధువు వస్తారు. అనుకున్న పనిలో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఈరోజు స్త్రీ వర్గానికి ప్రయోజనం చేకూరుతుంది. వ్యాపారస్తులకు పెద్ద పనులు ఈరోజు పూర్తవుతాయి. ఈరోజు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ పనితీరుకి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.  ఈ రోజు ఈ రాశి వ్యాపారులకు ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. 

ధనుస్సు రాశి

ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. కుటుంబం ముందు మీ అభిప్రాయాన్ని చెప్పడానికి మీకు పూర్తి అవకాశం లభిస్తుంది. మీ ప్రణాళిక ద్వారా ప్రజలు బాగా ప్రభావితమవుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ మనస్సు భక్తిలో నిమగ్నమై ఉంటుంది. వృత్తి గురించి ఆందోళనలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి సలహా ప్రయోజనకరంగా ఉంటుంది. 

మకర రాశి

ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు. మీ వ్యాపారంతో పాటు మీ వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను కాపాడుకోండి, మీ జీవితం సంతోషంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఈ రోజు మీరు పనికి సంబంధించి ప్రయాణం చేయవలసి ఉంటుంది, ఈ ప్రయాణం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఆఫీసులో మంచి సమాచారం అందుతుంది. జీతం పెరుగుదల ఉండొచ్చు. మీ గౌరవం పెరుగుతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.

కుంభ రాశి

ఈరోజు కుంభరాశివారికి మంచిరోజు. మీ మనస్సు యోగా-వ్యాయామంలో నిమగ్నమై ఉంటుంది. సక్సెస్ కి చాలా దగ్గరగా ఉన్నారు. మీ సామర్థ్యం కారణంగా కొత్త గుర్తింపును పొందుతారు, మీ జూనియర్లు మీ నుంచి కొత్తగా ఏదైనా నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. మార్కెటింగ్ వ్యాపారంతో సంబంధం ఉన్నవారు ఈ రోజు వారి వ్యాపారంలో లాభం పొందుతారు. ఈరోజు మీరు పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగులకు మంచి రోజు.

మీన రాశి

ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ పనుల్లో కొన్ని అడ్డంకులు ఏర్పడవచ్చు.కానీ సహోద్యోగి సహకారంతో పూర్తి చేస్తారు. ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల కోసం బహుమతిని ప్లాన్ చేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం. 

Published at : 15 Apr 2023 05:58 AM (IST) Tags: Astrology rasi phalalu Horoscope Today Aaj Ka Rashifal Today Rasiphalalu astrological prediction today April 15th Horoscope Horoscope for 15th April 15th APril Horoscope 15th April Astrology

సంబంధిత కథనాలు

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

కుక్కల ప్రవర్తన మీ భవిష్యత్తును తెలుపుతుందట - శకున శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?

కుక్కల ప్రవర్తన మీ భవిష్యత్తును తెలుపుతుందట - శకున శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

టాప్ స్టోరీస్

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?