Guppedanta Manasu April 14th: వసు ప్రేమలో తడిసి ముద్దవుతోన్న రిషి, కనిపించని శత్రువులతో జాగ్రత్త అని కొడుకుని హెచ్చరించిన జగతి
Guppedantha Manasu April 14th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంతమనసు ఏప్రిల్ 14 ఎపిసోడ్
రిషి మహేంద్ర ఫణీంద్ర తో మాట్లాడుతూ తన ప్లాన్ గురించి చెబుతాడు.
రిషి: డీబీఎస్టీ కాలేజీ ప్రతిష్టను భంగపరిచేలా ప్రవర్తిస్తే 24 గంటల్లో పోలీసుల సహకారంతో మిమ్మల్ని బయటపెడితే మీ పరువు ఏమవుతుందో ఆలోచించుకోండి..మరోసారి మా కళాశాల గురించి తప్పుడు నిర్ణయం తీసుకుంటే డీబీఎస్టీ కాలేజీ మీకు తగినబుద్ధి చెబుతుంది. ఇలా ఓ ప్రెస్ నోట్ తయారు చేయండి డాడ్
ఫణీంద్ర:మంచి నిర్ణయం తీసుకున్నావు రిషి
ధరణి పని చేసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి వసుధార వెళుతుంది
ధరణి: ఎందుకు వచ్చావ్ కాలికి దెబ్బతగిలింది కదా రెస్ట్ తీసుకో
వసుధార: పర్లేదు మేడం అని అంటుంది . బయటకు వెళ్లాం కానీ ఏమీ తినలేదు... రిషి సార్ అలాగే పడుకుంటారు..
ధరణి: మీరు బయట తినివస్తారని ఇంట్లో ఏమీ ఉంచలేదు..
వసుధార: ఆపిల్స్ కట్ చేసి తీసుకెళ్తాను
ధరణి: రిషి అంటే ఎంత ప్రేమ వసుధారా నీకు
వసు: సార్ మీద ఉన్న ఇష్టం ప్రేమ కొలవలేను మేడం. నా కన్నా తనే ఎక్కువ ( వాటర్ కోసం వచ్చిన రిషి ఆ మాటలు విని సంతోషంగా వెనక్కు వెళ్లిపోతాడు)
రిషి వెళ్లిపోవడం చూసి జగతి పిలిచి వాటర్ కావాలా అని అడుగుతుంది...
రిషి : మీకు గతంలోనూ చెప్పాను అయినా మళ్లీ చెప్పాలి అనిపిస్తోంది..మీ శిష్యురాలిని నాకు ఇచ్చినందుకు చాలా థాంక్స్ మేడం . వసు విషయంలో మిమ్మల్ని ఎంత మెచ్చుకున్నా నా విషయంలో మాత్రం ఎప్పటికీ నా గుండెను గుచ్చే ఒక కొరత మాత్రం తీరదు మేడం. ప్రేమకు ఇంత ప్రాధాన్యత ఇచ్చే మీరు, ఇంత స్వచ్ఛంగా ప్రేమించే మీరు మన బంధానికి ఎందుకు దూరంగా వెళ్లిపోయారని అడగాలని ఉంది. కానీ అడగను మేడం ఎందుకంటే మీ ప్రేమను పొందే అదృష్టం నాకు లేదు
రిషి మాటలు విని జగతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
జగతి: రిషి మన మధ్యలో దూరానికి కారణం చాలా సార్లు చెప్పాలని ప్రయత్నించాను కానీ నువ్వు వినిపించుకోలేదు వినిపించుకునే పరిస్థితిలో లేవు.
రిషి: అంటే ఏంటి మేడం అపార్ధాలు ఎప్పటికీ అర్థం కాకుండా అలాగే ఉంటాయని మీరు అనుకుంటున్నారా . అయినా గడిచిన క్షణాలు అన్ని మళ్ళి తిరిగి వస్తాయా మేడం. చెప్పాల్సిన వయసు మీకు దాటిపోయింది అడగాల్సిన వయసు నాకు దాటిపోయింది
ఆ మాటలకు జగతి బాధపడుతుంది
రిషి:పర్లేదు మేడం మన బంధానికి అటువైపు మీరు ఇటువైపు నేను మధ్యలో తెర మాత్రమే ఉంది ఆ తెర ఎప్పటికీ తరగనిది మేడం
రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా రిషి ప్లీజ్ ఒకే ఒక్క మాట మాట్లాడాలి అని అంటుంది జగతి.
జగతి: రిషి నువ్వు కోల్పోయినట్టు నేను కూడా కోల్పోయాను కొడుకుతో అమ్మ అని పిలిపించుకోలేకపోయాను. నేను కూడా అన్ని బంధాలకు దూరం అయ్యాను. కనీసం ఈ విషయం అయిన నువ్వు తెలుసుకుంటే ఈ అమ్మ మీద జాలి పుడుతుందేమో అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి రిషి కనిపించని శత్రువులు ఎక్కువ అవుతున్నారు మనపై దాడి చేయాలని కాచుకు కూర్చున్నారు జాగ్రత్తగా ఉండు. ముఖ్యంగా నువ్వు ఆచితూచి అడుగులు వేయాలి
Also Read: మాకు భయపడాల్సిన అవసరం లేదు పెద్దమ్మా అని ఇచ్చిపడేసిన రిషి, ప్లాన్ బి అమలు చేయమన్న కొత్త విలన్!
ధరణి-రిషి
ఆ తర్వాత గదిలోకి వెళ్లిన రిషి జగతి అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి ధరణి యాపిల్స్ తీసుకొని రావడంతో ఇప్పుడెందుకు వదిన నాకు ఆకలిగా లేదు అనగా ఇవి నేను పంపించలేదు వసుధార నీకోసం పంపించింది అంటుంది ధరణి. వసుధార కి నువ్వంటే చాలా ఇష్టం రిషి నువ్వంటే తనకు ప్రాణం అనడంతో తెలుసు వదిన ఇందాక మీరు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నేను విన్నాను అంటాడు. నువ్వు చాలా అదృష్టవంతుడివి రిషి వసుధార లాంటి అమ్మాయి దొరికింది అంటుంది ధరణి. ఇన్నాళ్లీ మీ విషయంలో భయపడ్డాను...వసుధార నీకోసం ఎవ్వరూ చేయని సాహసం చేసింది, ఎన్నో అవమానాలు భరించింది...మీ ప్రేమ చాలా గొప్పది మీ ఇద్దరూ ఇలాగే హ్యాపీగా ఉండాలి...నాకు మీ పెళ్లి చూడాలని ఉందని ధరణి అనడంతో..తొందర్లోనే జరుగుతుంది వదినా అని రిప్లై ఇస్తాడు రిషి....
వసుధార తన రూమ్ లోకి వెళుతుండగా దేవయాని వస్తుంది. చాలా సంతోషంగా కనిపిస్తున్నావని అడగడంతో సంతోషించాల్సిన విషయమే కదా మేడం అంటుంది
దేవయాని:అదేంటి మెడలో తాళిబొట్టు లేకుండా తిరుగుతున్నావు
వసు: తొందర్లోనే నా మొగుడు తాళికట్టబోతున్నాడు అలాంటప్పుడు నేను మళ్ళీ ఎందుకు కట్టుకోవడం మేడం
దేవయాని: జనాలు అడిగితే ఏం చెప్తావు
రిషి:మీ వల్లే ఊడిపోయిందని చెప్తాను మేడం అందుకు కారణం మీరే అని చెబుతాను... ఆ రోజు పీడకలలో మీరే భయంకరంగా వచ్చారు ఆ భయంతోనే నా తాళి తెగిపోయింది
దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది
వసు: మీరు ఏదో చేయాలని చూశారు కానీ అది జరగలేదు కదా .సమయానికి ఫణీంద్ర సార్ నిజం చెప్పారు కాబట్టి సరిపోయింది లేదంటే మీకు నిజం చెప్పేవారా..నోరు తెరిచేవారా...
దేవయాని: ఏం మాట్లాడుతున్నావ్..నేను అడిగినదేంటి నువ్వు మాట్లాడుతున్నావేంటి...
ఇంతలోనే రిషి అక్కడికి వచ్చి వారిద్దరి మాటలు వింటూ ఉంటాడు.
వసు: తాళి వేసుకున్నప్పుడు ఎవరో అడుగుతారని వేసుకోలేదు..నా ప్రేమను గెలిపించుకోవడం కోసం వేసుకున్నాను..ఏది చేసినా మా ప్రేమ , మా బంధం గురించే ఆలోచించి చేస్తాను కానీ ఎవరో అడుగుతారని మళ్లీ వేసుకోను...ఎదుటివారి జీవితంలోకి తొంగిచూడాలి అనుకున్నవాళ్లు సంస్కారం లేనివాళ్లు...మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు మేడం...
దేవయాని: బాగా పొగరు పట్టింది మాటకు మాట సమాధానం చెబుతోంది..అనుకుంటూ వెళ్లిపోతుంది
Also Read: ఏప్రిల్ 14 రాశిఫలాలు, ఈ రాశివారు మానసికంగా దృఢంగా ఉండేందుకు ప్రయత్నించండి
వసు రూమ్ కి వెళతాడు రిషి...
వసు: ఈ టైమ్ లో వచ్చారేంటి సార్
రిష: నేను నిన్ను చూడ్డానికి వచ్చాను ఇందాక పెద్దమ్మతో మాట్లాడుతున్నప్పుడు విన్నాను చాలా ధైర్యంగా మాట్లాడావు
వసు: అందులో భయపడాల్సిన విషయం ఏముంది సార్
రిషి: నిజమే...కొందరు కావాలని కొన్ని మాటలంటారు
వసు: మీరు పక్కనుండగా నాకేంటి సార్..మిమ్మల్నితలుచుకుని మెడలో తాళి వేసుకున్నప్పుడే మీరు నా భర్త అయ్యారు..ప్రెస్ ముందు నన్ను అంగీకరించినప్పుడు నేను మీ భార్యని అయ్యాను...
రిషి: కాలికి దెబ్బతగిలింది కదా నిద్రపోవచ్చు కదా
వసు: కళ్లు మూసుకుంటే ఆ విషయాలే గుర్తుకు వస్తున్నాయంటుంది..టాపిక్ డైవర్ట్ చేస్తాడు రిషి... కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు...