News
News
వీడియోలు ఆటలు
X

Guppedanta Manasu April 13th: మాకు భయపడాల్సిన అవసరం లేదు పెద్దమ్మా అని ఇచ్చిపడేసిన రిషి, ప్లాన్ బి అమలు చేయమన్న కొత్త విలన్!

Guppedantha Manasu April 13th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 
Share:

గుప్పెడంతమనసు ఏప్రిల్ 13 ఎపిసోడ్

రిషిధారని కిడ్నాప్ చేసిన కొత్త విలన్ సౌజన్య రావు...క్రూరంగా నవ్వుకుంటాడు. మిస్టర్ రిషేంద్ర భూషణ్  నిన్ను పడగొట్టాలని చాలాసార్లు ప్రయత్నించాను. ప్రతిసారి తప్పించుకున్నావు కానీ  ఈసారి మాత్రం తప్పించుకోలేవు..ఈ రోజుతో మీ పేరు ప్రఖ్యాతులు మంటగలసిపోతాయి అనుకుంటాడు. మరోవైపు రిషి-వసు బయటకు వెళ్లే మార్గం గురించి ఆలోచించి ఆలోచించి రూమంతా తిరుగుతారు...ఎట్టకేలకు కిటికీలోంచి బయటపడతారు. గేటు దగ్గర కాపలా రౌడీలు ఉండడంతో దాక్కుంటారు...అక్కడేదో అలికిడి వచ్చిందంటూ రౌడీలు రిషిధార వైపు వస్తుంటారు ఇంతలో ప్రెస్ వాళ్లు రావడంతో వాళ్లు వెళ్లిపోతారు...రిషిధార తప్పించుకుంటారు. 
రిషి: మనల్ని మన కాలేజీలని పరువు తీయాలని చాలా పకడ్బందీగా ప్లాన్ వేశారు అందుకే ఇద్దరిని ఒకటే గదిలో బంధించారు
వసు: మన మొబైల్ ఫోన్స్ కారు అక్కడే ఉన్నాయి కదా సార్ ఇప్పుడు ఎలా
రిషి: అవన్నీ ఎలా తీసుకురావాలో నాకు తెలుసు ఇప్పుడు మనం అక్కడికి వెళితే  ప్లాన్ మొత్తం  రివర్స్ అవుతుంది.ఇంటికి వెళదాం పద..ఆ తర్వాత వాళ్ల సంగతి చూద్దాం
వసుధార కాలికి గాజు పెంకు కుచ్చుకోవడంతో రిషి టెన్షన్ పడుతూ ఆ గాజు పెంకును తీసేస్తాడు. నడిచేందుకు ఇబ్బంది పడుతున్న వసుధారని ఎత్తుకుని తీసుకెళతాడు. ఆటోలో కూర్చుని డ్రైవర్ ఫోన్ తీసుకుని పోలీసులకు మొత్తం వివరిస్తాడు రిషి.

Also Read: కిడ్నాపైన రిషిధారలు ఎలా తప్పించుకుంటారు, సౌజన్యారావు కి చెక్ పెట్టేదెలా!

ఇంట్లో అందరూ వసుధార, రిషి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు దేవయాని రిషి వాళ్ళు రాలేదని జగతి,మహేంద్ర లపై సీరియస్ అవుతూ ఉంటుంది. మీ అందరికీ నేను అన్న మాటలే కనిపిస్తాయి కానీ రిషి మీద ఉన్న ప్రేమ మాత్రం కనిపించదు అని అరుస్తూ ఉంటుంది. మీ శిష్యురాలికి ఇదేమైనా పుట్టినిల్లా ఇక్కడ ఎలా ఉండాలో చెప్పాలి కదా అని జగతిపై సీరియస్ అవుతుంది. అప్పటివరకూ ఓపికగా ఉన్న ఫణీంద్ర...దేవయాని అని గట్టిగా అరుస్తాడు..ఓపికతో భరిస్తున్నారు కదా అని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు అంటాడు. ఇంతలో రిషి వసు ఇద్దరూ ఆటో దిగి రావడంతో అందర్లో మరింత టెన్షన్ పెరుగుతుంది.

రిషికి మాట్లాడే అవకాశం లేకుండా దేవయాని వరుస ప్రశ్నలు వేస్తుంటుంది. 
రిషి:పెద్దమ్మ ఆగండి ...మేడం వసుధార కాలికి దెబ్బ తగిలింది ఫస్టైడ్ చేయండి 
ఫణీంద్ర: ఏం జరిగింది రిషి 
రిషి:చెప్తాను ఆగండి పెద్దనాన్న ...పెద్దమ్మ మేము ఇంటికి లేటుగా రావడానికి కారణం ఉంది కానీ మేము కావాలని లేట్ చేయలేదు. మిమ్మల్ని టెన్షన్ పెట్టాలని కాదు మేమిద్దరం సంతోషంగా ఉన్నాము అలా బయటకు వెళ్ళాము కానీ మాకు అపాయం పొంచి ఉందని ఊహించలేదు పెద్దమ్మా . సొసైటీ అంతా ఏమనుకుంటున్నారో అంటున్నారు కానీ...మీరు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు. తప్పు చేసేవాళ్లే అలా భయపడతారు మేము అలా కాదు పెద్దమ్మ
 
Also Read: ఏప్రిల్ 13 రాశిఫలాలు, ఈ రాశివారు ఆర్థిక విషయాల్లో రిస్క్ చేయకూడదు

మరోవైపు సౌజన్య రావు నువ్వు చాలా సమర్థవంతుడివి రిషి నేను వేసిన ప్లాన్స్ ఎస్కేప్ అయ్యావు అని అనుకుంటూ ఉంటాడు నో ప్రాబ్లం మరొక ప్లాన్ వేస్తాను అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు.

వసుధార కాలికి జగతి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంత జరిగిందా అని ఫణీంంద్ర అనడంతో అవును పెదనాన్న అంటాడు రిషి. ఇదంతా ఎవరు చేశారు బయటికి చెప్తే వాళ్ల పరువు పోతుందని అనడంతో..రిషి వాళ్లపై సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి అని అంటాడు మహేంద్ర. ఇప్పుడు కూడా సైలెంట్ గా ఉంటే ఎలా రిషి అనగా నేను వాళ్ళని వదిలిపెట్టను కచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను అంటాడు రిషి. అప్పుడు రిషి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను డాడ్ మనం విషయం గురించి పేపర్ లో యాడ్ న్యూస్ ఇద్దాము. అంటూ రిషి తన ప్లాన్ మొత్తం చెబుతాడు..

Published at : 13 Apr 2023 08:37 AM (IST) Tags: Guppedanta Manasu Serial Guppedanta Manasu Serial Today Episode Guppedanta Manasu Serial Written Update Guppedanta Manasu Serial March 13th Episode

సంబంధిత కథనాలు

మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు, బాలయ్య మూవీ టైటిల్ వచ్చేసింది - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం

మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు, బాలయ్య మూవీ టైటిల్ వచ్చేసింది - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం

హీరో, హీరోయిన్లను కొట్టడం పై తేజకి ప్రశ్న - దర్శకుడి ఆన్సర్‌కి పారిపోయిన ‘జబర్దస్త్’ కమెడియన్!

హీరో, హీరోయిన్లను కొట్టడం పై తేజకి ప్రశ్న - దర్శకుడి ఆన్సర్‌కి పారిపోయిన ‘జబర్దస్త్’ కమెడియన్!

Gruhalakshmi June 8th: శేఖర్ కిడ్నాప్, క్లైమాక్స్ కి చేరిన లాస్య కథ- దివ్య మీద రాజ్యలక్ష్మి ఫైనల్ ఎటాక్

Gruhalakshmi June 8th: శేఖర్ కిడ్నాప్, క్లైమాక్స్ కి చేరిన లాస్య కథ- దివ్య మీద రాజ్యలక్ష్మి ఫైనల్ ఎటాక్

Guppedanta Manasu June 8th: వసు పనిచేస్తున్న కాలేజీ బాధ్యతలు తీసుకున్న రిషి సార్, మళ్లీ ప్రేమకథ మొదలు!

Guppedanta Manasu June 8th: వసు పనిచేస్తున్న కాలేజీ బాధ్యతలు తీసుకున్న రిషి సార్, మళ్లీ ప్రేమకథ మొదలు!

Brahmamudi June 8th: రాహుల్ ప్లాన్ తిప్పికొట్టి కావ్య తన అక్క పెళ్లి జరిపిస్తుందా?

Brahmamudi June 8th: రాహుల్ ప్లాన్ తిప్పికొట్టి కావ్య తన అక్క పెళ్లి జరిపిస్తుందా?

టాప్ స్టోరీస్

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు

Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు

YS Viveka Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ - అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్ !

YS Viveka  Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ -  అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్  !

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్