సమయం వచ్చినప్పుడు బుద్ధి బయటపడడం అంటే!



జానీయాత్వేషణేభృతాన్ బాన్దవాన్ వ్యసనాఆగమే!
మిత్రం యాఅవత్తికాలేషు భార్యా చ విభవక్సయే!!



ఈ శ్లోకం ద్వారా చాణక్యుడు ఏం చెప్పాలి అనుకున్నాడంటే.. సమయం వచ్చినప్పుడే ఎవరి స్వభానాన్ని అయినా గుర్తించడం సాధ్యమవుతుంది



బంధువులు,సన్నిహితులు, స్నేహితులు, జీవిత భాగస్వామి నైజం సమయం వచ్చినప్పుడే తెలుస్తుందంటాడు చాణక్యుడు



అతిముఖ్యమైన పనిపై నమ్మినవారిని పింపిస్తే వారు చేసుకొచ్చిన పనిని బట్టి వారి లక్షణం ఏంటో అర్థంచేసుకోవచ్చట



కష్టకాలంలో చుట్టాలను, ఆపద సమయంలో స్నేహితులను, ధననష్టం వాటిల్లినప్పుడు భార్య ప్రవర్తన ద్వారా వారి గురించి పూర్తి క్లారిటీ వస్తుంది



మనిషి సంఘజీవి..ఒంటరిగా బతకలేడు..అందుకే బంధాలు, బంధుత్వాలు కావాలి అనుకుంటాడు..అందరితో కలసి సంతోషంగా బతకాలని ఆశపడతాడు



ఏదైనా కారణంతో వారు సమయానికి సాయపడకపోతే బ్రతుకు కొంత కష్టమవుతుంది..మానసకింగా కుంగిపోతారు



కష్టకాలంలో సాయపడేవాడే నిజమైన సేవకుడు, ఆపత్కాలంలో ఆదుకున్నవారు -వ్యసనాలనుంచి బయటకు తీసుకొచ్చేవారు నిజమైన స్నేహితులు



ఆర్థిక ఇబ్బందుల్లోనూ వెంటనడిచేదే సరైన జీవిత భాగస్వామి..దీనికి విరుద్ధంగా ఉంటే ఆ బంధాలు దేనికీ పనికిరావని అర్థం



Images Credit: Pixabay


Thanks for Reading. UP NEXT

పుణ్య క్షేత్రాల్లో రాళ్లు పేరిస్తే ఇల్లు కడతామా!

View next story