పుణ్య క్షేత్రాల్లో రాళ్లు పేరిస్తే ఇల్లు కడతామా!



సొంత ఇల్లు ఈ భూమ్మీద ఉండే ప్రతీ ఒక్కరి కల. చిన్నదో, పెద్దదో ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలని ఆశపడతారు



ఈ కల నెరవేరాలంటే రాసిపెట్టి ఉండాలి



కొన్ని దేవాలయాల పరిసరాల్లో రాళ్లు పేరిస్తే గృహయోగం కలుగుతుందని విశ్వసిస్తారు



ఎంత ఎత్తుగా రాళ్లు పేరిస్తే అన్ని అంతస్థుల ఇల్లు కడతారని, ధనం వరదలా పారుతుందని భావిస్తారు



ఇవన్నీ నిజంగా జరుగుతాయా అనే ఆలోచన పక్కనపెడితే ప్రతి ఒక్కరికీ గూడు అవసరం



ఉరకల పరుగల జీవితంలో కొట్టుకుపోతూ సొంతంగా ఓ స్థిరాస్తిని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన కూడా చేయనివారెందరో



పణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు మాత్రం మనసు ప్రశాంతంగా ఉంటారు...ఆలోచనంతా దేవుడిపైనే ఉంటుంది. ఆ సమయంలో గట్టిగా ఏం కోరుకున్నా ఆ దిశగా అడుగేస్తారనే ఉద్దేశంలో ఇలా చేస్తారని కూడా చెబుతారు



వయసులో ఉన్నప్పుడు సొంతింటి గురించి చింత ఉండదు కానీ ముసలితనం వచ్చాక సొంతిల్లు అవసరం ఎంతుందన్నది తెలుస్తుంది.. అది గుర్తుచేయడం కోసమే పుణ్యక్షేత్రాల్లో ఇలా చేస్తారంటారు



పుణ్యక్షేత్రాల్లో రాళ్లు పేరిస్తే నిజంగా గృహయోగం ఉంటుందో లేదో అన్నది పక్కనపెడితే.. ఆ దిశగా ఆలోచన చేయడం మంచిదే కదా...



Images Credit: Pinterest