ఇంట్లో దేవుడి మందిరంలో శివలింగం ఉండొచ్చా! శివలింగం ఇంట్లో దేవుడి మందిరంలో ఉంచొచ్చో లేదో అనే సందేహం చాలామందికి ఉంటుంది ఒకవేళ ఉంచితే నిత్యం అభిషేకం చేయాలి లేదంటే ఏవో ప్రమాదాలు జరిగిపోతాయనే ప్రచారం ఉంది ఈ విషయం గురించి శివపురాణంలో ఏముందంటే..బొటనవేలు అంత పరిమాణం ఉన్న శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు శివాలయం లేని ఊరు శ్మశానంతో సమానం అంటారు.. అంతెందుకు శ్మశానంలో కూడా శివలింగం ఉంటుంది ఇంట్లో ఉండకూడదు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎంతమాత్రం విశ్వసించొద్దంటారు పండితులు బొటనవేలంత శివలింగాన్ని ఇంట్లో దేవుడి మందిరంలో ఉంచుకుని నిత్యం నీళ్లతో అభిషేకం చేయాలి ఒక్కోరోజు కుదరక అభిషేకం చేయకపోయినా ఏదో ప్రమాదం జరిగిపోతుందనే భ్రమ వద్దంటున్నారు పండితులు అభిషేకం చేసేటప్పుడు మహా మృంత్యుంజయ మంత్రం చదవాలి లేదంటే ఓం నమఃశివాయ అంటూ చేస్తే సరిపోతుంది Image Credit: Pixabay