Guppedanta Manasu April 12th: కిడ్నాపైన రిషిధారలు ఎలా తప్పించుకుంటారు, సౌజన్యారావు కి చెక్ పెట్టేదెలా!
Guppedantha Manasu April 12th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంతమనసు ఏప్రిల్ 12 ఎపిసోడ్
రిషి, వసు కారులో వెళ్తుండగా ఒక అమ్మాయి కారు వెనుక పరిగెడుతూ కాపాడండి అని అరుస్తుంది. కారు ఆపి ఏం జరిగింది అనడంతో ఇద్దరు రౌడీలు నా వెనకాల పడుతున్నారు సార్ నన్ను చంపాలని చూస్తున్నారు కాపాడండి అని అంటుంది. అప్పుడు రిషి కొంచెం వాటర్ ఇచ్చి పోలీసులకు ఫోన్ చేస్తాను రిమైనింగ్ అంతా వాళ్ళు చూసుకుంటారు అని అనగా పోలీసులకు వద్దు సార్ మా అమ్మ నాన్నలకు పోలీస్ కేసులో అవి ఇష్టం ఉండదు వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేను జాబ్ చేస్తున్నానంటుంది. ఆ అమ్మాయి చెప్పింది నిజమే అని నమ్ముతారు రిషిధార. మా ఇంటిదగ్గర దిగబెట్టండి అని అడగడంతో సరే అంటారు.
జగతి-మహేంద్ర-దేవయాని
మరోవైపు జగతి, మహేంద్ర ఇద్దరు రిషి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు..ఇంకా రాలేదేంటి..చాలా రోజుల తర్వాత కలిశారు కదా అందుకేనేమో అని సరాదాగా మాట్లాడుకుంటారు. మహేంద్ర ఫోన్ చేయమని చెప్పినా వద్దంటుంది జగతి. ఇంతలో వసుధార కాల్ చేసి..మేడం ఇంటికి వస్తున్నాం మధ్యలో చిన్నపనిపడింది మీరంతా భోజనం చేసి పడుకోండి అని చెబుతుంది. అక్కడకు వచ్చిన దేవయాని ...ఫోన్లో ఎవరు అని అడిగితే వసుధార అని చెబుతుంది జగతి. రిషి గురించి పట్టించుకోవాలి కదా అని దేవయాని డ్రామా మొదలెడుతుంది..రివర్స్ లో కౌంటర్స్ ఇస్తుంది జగతి. అక్కడికి ధరణి రావడంతో అంతా కలసి భోజనానికి వెళతారు..
ఆ అమ్మాయిని డ్రాప్ చేయడానికి రిషిధార వెళతారు . దించేసి వెళ్లిపోదాం అంటారు..ఈరోజు మీరు లేకపోతే నా జీవితం నాశనం అయ్యేది.. నా సాటిస్పాక్షన్ కోసం ఇంటికొచ్చి కాఫీ తాగి వెళ్లండి అంటుంది..మా అమ్మా నాన్నని పరిచయం చేస్తానంటుంది. అప్పుడు రిషిధార ఓ రూమ్ లోకి వెళతారు..నాన్నగారు లేవండి అని ఆ అమ్మాయి అనడంతో..అక్కడ పడుకున్న ఇద్దరు రౌడీలు ముసుగుతీసి ఆ ముసుగు రిషికి వేయాలని ప్రయత్నించడంతో రిషి వాళ్లని చితకబాదతాడు. ఇంతలో ఆ అమ్మాయి వసుధార మెడపై కత్తిపెట్టి బెదిరిస్తుంది. ఆ తర్వాత రిషిధార దగ్గర కారు కీస్,ఫోన్లు తీసుకుని..రూమ్ లో పెట్టి తలుపేసి వెళ్లిపోతారు. హెల్ప్ అని ఇద్దరూ అరుస్తారు...ఎవరు సార్ ఈ అమ్మాయి మనల్ని ప్లాన్ ప్రకారం ఇక్కడ బంధించిందని వసు అంటే..అదే ఆలోచిస్తున్నా అంటాడు రిషి. బయటపడే మార్గం కోసం ఎదురుచూస్తుంటారు...
ఈ రోజుల్లో మంచిగా ఉండడం సరికాదు మిస్టర్ రిషీంద్ర భూషణ్ అనుకుంటాడు సౌజన్యారావు. రిషి డౌట్స్ ఒక్కొక్కటికీ వసుధారకి చెబుతుంటే.. అటు సౌజన్యారావు ఆన్సర్ ఇస్తుంటాడు...
రిషి: అసలు ఎవరి ఇదంతా చేశారో ఎందుకో ఇదంతా చేశారు అసలు ఏం ఉద్దేశిస్తున్నారు
వసు: మన కాలేజీలో జరిగిన గురించి నాకు తెలుసు..
వసు: ఆ వెనుక ఎవరు ఉన్నారో కూడా నాకు తెలుసు కానీ సాటి విద్యాసంస్థల్ని అవమానించాలని అనుకోలేదు..అందుకే వదిలేశాను అయినా బుద్ధి చూపించారు
రిషి: అవును వసుధార మారతారని అనుకున్నాను కానీ ఇలా చీప్ గా ట్రై చేస్తారని అనుకోలేదు . మన కాలేజ్ ని ఎలా దెబ్బతీయాలా అని ఆలోచిస్తున్నారు
వసు టెన్షన్ పడుతుంటే రిషి ధైర్యం చెబుతాడు
మరోవైపు సౌజన్య రావ్ నవ్వుకుంటూ నిన్ను ఎవరు ట్రాప్ చేశారు ఎవరికి కిడ్నాప్ చేశారని ఆలోచిస్తున్నావు కదా నిన్ను కిడ్నాప్ చేసింది ఈ సౌజన్య రావు అనుకుంటున్నాడు. ఎప్పటినుంచో నీ పతనం కోసం ఎదురుచూస్తున్నాను ఇవాళ ఆ ఛాన్స్ దొరికింది రాజు రాణి ఇద్దరినీ నేను బంధించి చెక్ పెట్టాను అనుకుంటాడు. ఇంతలోనే అతనికి ఒక వ్యక్తి ఏమయింది అప్డేట్ రాలేదు అని మెసేజ్ చేయగా చెప్పిన పని పూర్తి అయ్యింది అని మెసేజ్ చేస్తాడు సౌజన్య రావు. రిషి వాళ్ళ సంగతి చూడాలి అంటూ మెసేజ్లు చాటింగ్ చేసుకుంటూ ఉంటారు.