Gunde Ninda Gudi Gantalu October 29 Episode: రవి శ్రుతిని ఫాలో అయిన బాలు మీనా! దొంగనోట్ల ఉచ్చులో చిక్కుకున్న మనోజ్ - గుండెనిండా గుడిగంటలు అక్టోబర్ 29 ఎపిసోడ్!
Gundeninda GudiGantalu Today episode: ఆవేశంలోనే రూమ్ కట్టేందుకు డబ్బు మొత్తం తానే ఇస్తానని ప్రామిస్ చేస్తాడు బాలు..కట్టి చూపిద్దాం అంటుంది మీనా..తిప్పలు మొదలయ్యాయి...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 29 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 October 29th Episod
నిల్చుని డబ్బింగ్ చెప్పి చెప్పి అలసిపోయానని శ్రుతి చెబుతుంది. రవి కాసేపు కాళ్లు పట్టవా అని అడుగితే సరే అంటాడు రవి. డోర్ క్లోజ్ చేద్దాం అని రవి ట్రై చేసినా నీ భార్యకు నువ్వు సేవచేస్తే సిగ్గెందుకు అని క్వశ్చన్ చేస్తుంది. ఆ తర్వాత నెయిల్ పాలిష్ వేయమని అడుగుతుంది. రవి రాదు అని చెప్పినా.. బ్రెడ్ పై బటర్ రాస్తావు కదా అలా వేసెయ్ అని సలహా చెబుతుంది. రవి నెయిల్ పాలిష్ వేస్తుండగా.. ప్రభావతి చూసి రగిలిపోతుంది. ఇప్పుడు గట్టిగా అడగకపోతే ఇదే అలవాటు అవుతుందనుకుంటూ నేరుగా రూమ్ లోకి వెళ్లి క్వశ్చన్ చేస్తుంది. ఏం చేస్తున్నావ్ అని అడిగితే.. నెయిల్ పాలిష్ వేయించుకుంటున్నా అంటుంది. కాళ్లు పట్టావు కదా అంతకన్నా ముందు అని అడిగితే.. అవును ఆఫీసులో వర్క్ ఎక్కువ అయింది అందుకే కాళ్లు నొప్పిగా ఉన్నాయ్ పట్టమన్నా అంటుంది. నా భర్త నాకు సేవ చేస్తే మీకెందుకు ఆంటీ అని కడిగేస్తుంది. ఇవన్నీ కామన్...మీరు కూడా వెళ్లి అంకుల్ తో నెయిల్ పాలిష్ పెట్టించుకోండి అంటుంది. అదే టైమ్ కి మేడపై నుంచి కిందకు వస్తాడు బాలు. ప్రభావతి మాటలన్నీ వింటాడు బాలు. భార్య భర్త ఇద్దరూ సంతోషంగా ఉంటే చూడలేదు అనుకుంటాడు. విసురుగా బయటకు వచ్చిన ప్రభావతికి క్లాస్ వేస్తాడు బాలు. ఆ వెనుకే వచ్చిన రవి...అమ్మతో ఏంటి డిస్కషన్ అని అడుగుతాడు రవి. అమ్మని అలా వదిలేయకూడదు.. మరింత రెచ్చగొట్టాలని ఫిక్సవుతాడు బాలు. రవి చేతిలో నెయిల్ పాలిష్ తీసుకుంటాడు
ప్రభావతి కోపంగా వెళ్లి సత్యంతో చెబుతుంది. ఆ రవి భార్య నా మాట వినడం లేదని కంప్లైంట్ చేస్తుంది. కాలాన్ని బట్టి మారాలని క్లాస్ వేస్తాడు సత్యం. భర్తను పట్టుకుని రారా పోరా అనడమా ? తను చేసివి నేను చూడలేకపోతున్నా? తన మాటలు వినలేకపోతున్నా అంటుంది. దీనికి పరిష్కారం నేను బయటకు వెళ్లి వస్తానంటూ వెళ్లిపోతాడు సత్యం
హాల్లోకి వచ్చిన బాలు మీనాను పిలుస్తాడు. సత్యం బయటకు వెళ్లడం చూసి ఎక్కడికి నాన్న నేను చేసుకుని వస్తాను అంటాడు బాలు.. వద్దులే నేను వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిపోతాడు సత్యం. ఏ పనిపై వెళుతున్నారో చెప్పొచ్చు కదా అని ప్రభావతి అంటే.. పనిపై వెళ్లేవారిని అడగకూడదని తెలియదా అంటాడు బాలు. ఇప్పుడు నీకు సినిమా చూపిస్తా అంటూ మీనాను పిలుస్తాడు. ప్రభావతి పక్కనే కూర్చుని మీనాకు నెయిల్ పాలిష్ వేయడం స్టార్ట్ చేస్తాడు. నీ పాదాలకు వెన్న రాస్తావా..అంత మృదువుగా ఉన్నాయని అడుగుతాడు బాలు. మృదువుగా ఉంటే నెత్తిమీద పెట్టుకుని ఊరేగు అని సెటైర్ వేస్తుంది ప్రభావతి. ఆ రోజు వస్తే తప్పకుండా నెత్తిమీద పెట్టుకుని ఊరేగుతా అంటాడు బాలు. కక్కలేక మింగలేక ఏమీ అనలేక ప్రభావతి లోలోపలే రగిలిపోతుంది. అమ్మ మాటలు నువ్వు పట్టించుకోకు మీనా అంటాడు బాలు. మీనా పాదాలను వర్ణిస్తుంటాడు...ప్రభావతి కోపంగా చూస్తుంటుంది. నేను ఇక్కడున్నానన్న ఆలోచన కూడా లేకుండా ఏంటిది అంటుంది. ఎందుకండీ అత్తయ్యని ఉడికిస్తారని మీనా అంటే..కొందరికి ఏ భాషలో చెప్పాలంటే ఆ భాషలోనే చెప్పాలి అంటాడు. వాళ్లకోసం వీళ్లకోసం కాకుండా నాకోసం చేయండి అంటుంది మీనా...ఎవరికోసం చేసినా నీపై ప్రేమతోనే చేస్తానని చెప్పి ట్రిప్ కి వెళ్లిపోతాడు బాలు
డబ్బులు భారీగా వచ్చాయ్..వ్యాపారం బాగా సాగుతోందని డబ్బులు చూసి ఉత్సాహంగా ఉంటాడు మనోజ్. రోహిణికి కాల్ చేసి ఉత్సాహంగా మాట్లాడుతాడు. మనం గోవా , బ్యాంకాక్ ఎక్కడికి వెళదాం అని అడుగుతాడు. టైమ్ స్టార్ట్ అయింది..ఇంక మనల్ని ఎవ్వరూ ఆపలేరు..బాలుగాడు బంబేలెత్తిపోవాలి అంటాడు. రోహిణి మనోజ్ సరదాగా మాట్లాడుకుంటారు. ఆఫీసులో స్టాఫ్ ని పిలిచి అందరూ పార్టీ చేసుకోండి అని చెప్పి డబ్బులిస్తాడు మనోజ్.
ఇద్దరు అధికారులు వస్తారు. మేం విజిలెన్స్ డిపార్ట్ మెంట్ నుంచి వచ్చాం అని చెబుతారు. ఏం జరిగింది? ఎందుకు వచ్చారని మనోజ్ అడుగుతాడు. కొద్దిసేపటి క్రితం పెద్ద ఆర్డర్ ఇచ్చి ఎవరైనా ఫర్నిచల్ తీసుకెళ్లారా అని అడుగుతారు. అవును క్యాష్ పేమెంట్ చేశారని చెప్తాడు మనోజ్. ఇవి దొంగనోట్లు అని చెబుతారు. నా దగ్గర ఫర్నిచర్ కొన్నవాళ్లు ఇచ్చారని చెబుతాడు. బిల్లు ఏదని అడిగితే లేదని చెప్పడంతో..బ్లాక్ మనీ తీసుకున్నారా అని క్వశ్చన్ చేస్తారు. మేం వాళ్లని దారిలో పట్టుకున్నాం... ఈ క్యాష్ సీజ్ చేస్తున్నాం.. స్టేషన్ కి వచ్చి మీ ఫర్నిచర్ తీసుకెళ్లండి అని చెప్పేసి వెళ్లిపోతారు. హమ్మయ్య అరెస్ట్ చేయలేదు వెంటనే వెళ్లి ఫర్నిచర్ తెచ్చుకోవాలి అనుకుంటూ మనోజ్ పోలీస్ స్టేషన్ కి వెళతాడు. నా ఫర్నిచర్ ఇక్కడుందని విజిలెన్స్ డిపార్ట్ మెంట్ వాళ్లు చెప్పారని అడుగుతాడు.
ఏం జరిగిందో పోలీసులు ఊహించి చెప్తారు..అంతా చూసినట్టు చెబుతున్నారు ఎలా సర్ అని మనోజ్ అడుగుతాడు. నీకింకా అర్థం కాలేదా...నువ్వు రెండుసార్లు మోసపోయావ్. నీ దగ్గర ఫర్నిచర్ తీసుకెళ్లినవాళ్లూ దొంగలే..డబ్బు తీసుకెళ్లిన వాళ్లూ దొంగలే అని చెబుతాడు పోలీస్. ఐడీ కార్డ్ చూపిస్తే నమ్మేస్తావా? చదువుకున్నావా అసలు అని క్లాస్ వేస్తాడు. బిల్లు లాంటి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే లేవంటాడు మనోజ్. బ్లాక్ మనీ తీసుకుందాం అనుకుంటున్నావా అని రివర్సవుతాడు పోలీస్. నిన్ను అరెస్ట్ చేసి లోపలవేస్తే బుద్ధి వస్తుందనగానే...ఈసారి ఎవరైనా వస్తే బిల్లు ఇచ్చే డబ్బులు తీసుకుంటాను అని చెప్పి బయటపడతాడు. ఫర్నిచర్ వెతికిపట్టుకుంటాం..కంప్లైట్ ఇచ్చి వెళ్లు అని పంపించేస్తాడు పోలీస్. ఇప్పుడు ఈ విషయం బాలుకి తెలిస్తే నా పనైపోతుందని భయపడతాడు మనోజ్...
Karthika Puranam Day-7 October 28: కార్తీక మహాపురాణం కథ DAY-7 ( అక్టోబర్ 28) కార్తీకమాసంలో శివుడిని, శ్రీహరిని పూజించే విధానం ఇదే!
కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!
అరుణాచలంలో కార్తీక శోభ - గిరిప్రదక్షిణ అంటే అలా తిరిగేసి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే! ఆలయం నుంచి వరుసగా 17వ ఎనర్జీ పాయింట్ వరకూ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
18వ ఎనర్జీ పాయింట్ నుంచి 44వ ఎనర్జీ పాయింట్ వరకూ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















