Karthika Puranam Day-7 October 28: కార్తీక మహాపురాణం కథ DAY-7 ( అక్టోబర్ 28) కార్తీకమాసంలో శివుడిని, శ్రీహరిని పూజించే విధానం ఇదే!
Karthika Puranam: కార్తీకమాసంలో కార్తీకపురాణం చదువుతారు. రోజుకో కథ చొప్పున 30 రోజులు 30 కథలు. ఏడవ రోజు చదువుకోవాల్సిన కథ ఇది

కార్తీకమాసం DAY-7 అక్టోబరు 28: కార్తీకపురాణం ఏడవ అధ్యాయం
వశిష్ఠ మహర్షి జనకమహారాజుతో చెబుతున్నారు..
ఓ రాజా! కార్తీకమాసం గురించి, దాని మహత్మ్యం గురించి ఎంత విన్నా తనివితీరదు.
ఈ నెలలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలాలతో పూజి౦చిన వారి ఇంట లక్ష్మిదేవి స్థిరంగా నివాసం ఉంటుంది
తులసీదళాలతో కానీ, బిల్వపత్రములతోగాని సహస్రనామపూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుంది
కార్తీకమాసంలో ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామాన్ని ఉంచి భక్తితో పూజి౦చిన వారికి మోక్షం కలుగుతుంది
బ్రాహ్మణులకు ఉసిరిచెట్టు క్రింద బోజనము పెట్టి తాను తినిన, సర్వపాపములు నశిస్తాయి
ఈ విధంగా కార్తీకస్నానం, దీపారాధన చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏదైనా ఆలయానికి వెళ్లి భక్తితో సాష్టా౦గ నమస్కారం చేసినా వారి పాపములు నశించును. సంపత్తిగలవారు శివకేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతార్చన, హొమం, దానధర్మములు చేసిననచో అశ్వమేధము చేసినంత ఫలం దక్కుతుంది.. వారి పితృదేవతలకు కూడా వైకు౦ఠప్రాప్తి కలుగుతుంది.
శివాలయంలో కానీ, వైష్ణవ ఆలయంలో కానీ జెండా ప్రతిష్టించినచొ యమకింకరులకు దగ్గరకు రాలేరు సరి కదా, పెను గాలికి ధూళిరాసు లెగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాప౦చలై పోవును.
ఈ కార్తీక మాసములో తులసికోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి, నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిదనుంచి నిండా నువ్వులు నూనె పోసి, వత్తిని వేసి వెలిగించాలి. ఈ దీపం 24 గంటల పాటూ ఆరకుండా చూసుకుని..నైవేద్యం పెట్టి కార్తీకపురాణం పఠించాలి. ఇలా చేస్తే మోక్షం లభిస్తుంది
కార్తీకమాసంలో జిల్లేడు పూలతో శ్రీహరిని పూజిస్తే ఆయుర్ వృద్ది కలుగుతుంది
మల్లెపువ్వులతో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే వారి పాపంము సూర్యోదయానంతరము చీకటి నశించునట్లు నశించును.
సాలగ్రామానికి ప్రతి నిత్యం గంధం పెట్టి తులదీదళాలతో పూజిస్తే విష్ణులోకం పొందుతారు...పూర్వజన్మ పాపాలు కూడా నశిస్తాయి
కార్తీకమాసంలో భక్తితో అన్నదానం చేసేవారి పాపాలు పూర్తిగా నశిస్తాయి
కార్తీకమాసంలో స్నానం, దానం, జపం యథాశక్తిగా చేయనివారు నూరు జన్మలు కుక్కగా పుడతారు
కార్తీకమాసంలో కదంబం పువ్వులతో శ్రీహరిని పూజిస్తే సూర్యమండలాన్ని దాటి స్వర్గానికి చేరుకుంటారు
మొగలిపువ్వులతో హరిని పూజిస్తే ఏడు జన్మలందు వేదవేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడిగా జన్మిస్తారు
అవిసెపువ్వుల మాలికతో విష్ణువును పూజిస్తే స్వర్గప్రాప్తి లభిస్తుంది
స్త్రీలు పూలమాలతో , తులసీదళాలతో హరిని పూజిస్తే సర్వపాపనిర్ముక్తులై వైకుంఠాన్ని పొందుతారు
కార్తీక శుద్ధపాడ్యమినాడు పూర్ణిమనాడు అమావాస్యనాడు ఈ మూడు రోజులు వేకువజామునే స్నానం ఆచరిస్తే మాసం మొత్తం కార్తీకస్నానం ఆచరించిన ఫలం పొందుతారు
కార్తీక దీపాలను చూసి ఆనందం పొందినవారి పాపాలు కూడా పటాపంచలైపోతాయి
కార్తీకమాసంలో సాయంకాల సమయంలో ఆలయంలో స్తోత్రాలను పఠించేవారికి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది
ధనం, బలం, ఆరోగ్యం ఉండి కూడా కార్తీక మాసంలో పూజలు చేయరో వారు మరు జన్మలో శునకం(కుక్క)లా జన్మించి తిండి దొరక్క ఇంటింటికీ తిరిగి దెబ్బలు తింటారు. అందుకే మహారాజా..కార్తీకమాసం నెలరోజులు పూజలు చేయలేనివారు కనీసం ఒక్కసోమవారం అయినా శివకేశవులను అర్చిస్తే మాసఫలం దక్కుతుంది. అందుకే కార్తీకమాసం వ్రతాన్ని అంతా ఆచరించాలని చెప్పారు వశిష్ఠ మహర్షి
నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం
నాగేంద్రకన్యా వృష కేతనాభ్యం నమో నమ శ్శంకర పార్వతీభ్యాం
స్కాంద పురాణా౦తర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమహాత్మ్యంలో ఏడవ అధ్యాయం సమాప్తం






















