Dev Uthani Ekadashi 2025 : దేవుత్తాన ఏకాదశి 2025 తేదీ, ప్రాముఖ్యత, తులసి వివాహ శుభ సమయం, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం!
Dev Uthani Ekadashi 2025 Date: నవంబర్ 1, 2025న దేవఉఠాన ఏకాదశి ప్రారంభం. శుభకార్యాలు మొదలవుతాయి. జ్యోతిష్యుల ప్రకారం ప్రాముఖ్యత తెలుసుకోండి.

Dev Uthani Ekadashi: ఈ సంవత్సరం (2025) నవంబర్ 1, 2025న దేవుత్తాన ఏకాదశి వ్రతం ఆచరిస్తారు. ఈరోజు నుంచి శుభకార్యాలు ప్రారంభమవుతాయి. ఇందుకు ఆరంభ సూచనగా మరుసటి రోజు తులసి వివాహం చేస్తారు. దేవుత్తాన ఏకాదశి నుంచి శ్రీ విష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటాడని నమ్మకం. ఆ తర్వాత శుభ కార్యాలు ప్రారంభమవుతాయి.
వైదిక పంచాంగం ప్రకారం కార్తీక శుక్ల ఏకాదశి తిథి నవంబర్ 1, 2025 సూర్యోదయ సమయం నుంచి ఉంది..ఇదే రోజు రాత్రి తెల్లవారుజామున 2 గంటల 47 నిముషాల వరకూ ఏకాదశి తిథి ఉంది. ఎలాంటి సందేహం లేకుండా దేవుత్తాన ఏకాదశిని నవంబర్ 1న జరుపుకుంటారు. ఉపవాస నియమాలు పాటించేవారు అక్టోబర్ దశమి రోజు రాత్రి నుంచి మొదలవుతాయి. నవంబర్ 2 క్షీరాబ్ధి ద్వాదశి వచ్చింది. ఈ రోజు వ్రతాన్ని ఆచరించి తులసి, శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం
నవంబర్ 1న దేవుత్తాన ఏకాదశి
నవంబర్ 2న తులసి వివాహం
ఇప్పటి నుంచి వివాహానికి ముహూర్తాలు ప్రారంభమవుతాయి
ఆషాఢ శుద్ధ ఏకాదశికి విష్ణువు యోగనిద్రలోకి వెళ్లినప్పుడు ఆగిన శుభకార్యాలు...చాతుర్మాస్య వ్రత దీక్ష ముగిసిన తర్వాత కార్తీక శుక్ల ఏకాదశి రోజు మేల్కొంటాడు. అందుకే ఈ నాలుగు నెలల కాలం పితృకార్యాలు నిర్వహిస్తారు కానీ శుభకార్యాలకు బ్రేక్ ఇస్తారు. ఉత్తాన ఏకాదశి నుంచి మళ్లీ వివాహానికి ముహూర్తాలు ప్రారంభమవుతాయి.
ఇప్పటికే ముహూర్తాల సందడి మొదలైంది..సన్నాహాల్లో బిజీగా ఉన్నారు. మండపాలు, కేటరింగ్ లు బుక్ చేసుకోవడం..షాపింగ్ లతో హడావుడి మొదలైంది.
ఈ ఏడాది నవంబర్ లో వివాహానికి ముహూర్తాలు 15 రోజులు ఉంటాయి. ఆ తర్వాత మళ్లీ డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఇది సంక్రాంతి వరకూ కొనసాగుతుంది. ఇక డిసెంబర్ 12న అస్తమించిన శుక్రుడు తిరిగి ఫిబ్రవరి 1న ఉదయిస్తాడు. ఈ సమయంలో 51 రోజుల పాటూ శుక్రబలం ఉండకపోవడంతో శుభకార్యాలకు బ్రేక్ ఇస్తారు. ఈ మధ్యలో జనవరి ఆఖరివారంలో వసంతపంచమి ఉంటుంది. ఈ రోజు పంచాంగం, వారం, వర్జ్యం, తిథితో సంబంధం లేకుండా శుభకార్యాలు నిర్వహిస్తారు.
దేవుత్తాన ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల ...ఈ రోజు శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. దేవుత్తాన ఏకాదశి మర్నాడు వచ్చే క్షీరాబ్ధి ద్వాదశి రోజు తులసి వివాహం నిర్వహిస్తారు. ఈ రోజు సాలిగ్రామాలు తులసి అమ్మవారికి వివాహం జరిపిస్తారు. తులసి వివాహం చేయడం వల్ల దాంపత్యం జీవితం సంతోషంగా ఉంటుందని..సౌభాగ్యం పెరుగుతుందని నమ్మకం
నవంబర్-డిసెంబర్ వివాహ ముహూర్త వివరాలు
నవంబర్: 2, 3, 5, 8, 12, 13, 16, 17, 18, 21, 22, 23, 25, 30
డిసెంబర్: 4, 5, 6 (కొన్ని పంచాంగాలలో తేడాలు ఉండటం వల్ల తేదీలు మార్పులు ఉండవచ్చు.)
ధనుర్మాసంలో ముహూర్తాలు ఉండవు
డిసెంబర్ 16న ప్రారంభమైన ధనుర్మాసం జనవరి 14 వరకూ ఉంటుంది. ఈ సమయంలో వివాహాది శుభకార్యాలు నిర్వహించరు. ఆ తర్వాత ఫిబ్రవరి, మార్చి నెలలో మళ్లీ వివాహాల సీజన్ ప్రారంభమవుతుంది
ఫిబ్రవరి , మార్చి 2026లో ముహూర్తాల సందడి
ఫిబ్రవరిలో 16 రోజులు వివాహానికి అనుకూలంగా ఉంటాయి. ఫిబ్రవరిలో 4, 5, 6, 7, 8, 10, 11, 12, 13, 14, 19, 20, 21, 24, 25, 26 తేదీలలో లగ్న ముహూర్తం ఉంది.
మార్చిలో 11 ముహూర్తాలు ఉన్నాయి. ఇందులో 2, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 మరియు 14 మార్చిలలో శుభ లగ్న ముహూర్తం ఉంది. మార్చి 14 తర్వాత మళ్లీ శుభ కార్యాలపై నిషేధం ఉంటుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించిన సమాచారం మాత్రమే . ABP దేశంఎటువంటి నమ్మకాన్ని, సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
కార్తీక మహాపురాణం కథ DAY-1: కార్తీకమాస పవిత్రత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, శివభక్తి, దీపారాధన మహత్యం!
కార్తీక మహాపురాణం కథ DAY-2 : కుక్కగా జన్మించిన నిష్టురికి మోక్షం ఎలా లభించింది?
కార్తీక మహాపురాణం కథ DAY-3 : బ్రహ్మరాక్షసులకు శాప విమోచనం






















