Gunde Ninda Gudi Gantalu October 23 Episode: ప్లాన్ ప్రకారం రచ్చ చేసిన శ్రుతి తల్లి, బాలు చెంప పగలగొట్టిన సత్యం - గుండెనిండా గుడిగంటలు అక్టోబర్ 23 ఎపిసోడ్!
Gundeninda GudiGantalu Today episode: రోహిణి బదులు మీనాను కిడ్నాప్ చేసి తన్నులు తిన్నాడు దినేష్. ఇక సత్యం ఫ్యామిలీలో చిచ్చు పెట్టేందుకు రంగంలోకి దిగింది శోభ...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 23 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 October 23rd Episod
రోహిణి బదులు మీనాను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన దినేష్ ని ఉతికి ఆరేస్తాడు బాలు. మధ్యలో బాలు స్పృహ తప్పిపడిపోవడంతో మీనా కట్లు విప్పుకుని వచ్చిమరీ చితక్కొడుతుంది. ఇంతలో పోలీసులు వచ్చి దినేష్ ని తీసుకెళ్లిపోతారు. వీడు ఆడపిల్లల్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుతుంటాడని బాలు కంప్లైంట్ ఇస్తాడు. ఆ మాటలు విన్న రోహిణి..నా గురించి మొత్తం తెలిసిపోయింది, నా జీవితం నాశనమే అంటూ విద్య దగ్గరకు వెళ్లి ఏడుపు మొదలుపెడుతుంది. ఎంత సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా..బాలుకి , మీనాకి తెలిసిపోయింది..ఇంటికి వెళ్లి మా అత్తయ్యతో చెప్తే అంతే..నా రెండో పెళ్లి కూడా పెటాకులు అయినట్టే అని ఏడుస్తుంది.ఎంతో ప్రేమించిన మనోజ్ కళ్లలో నాపై ద్వేషాన్ని చూడాల్సి వస్తుందని బాధపడుతుంది. ఇంతలో ప్రభావతి, మనోజ్ కాల్స్ చేయడంతో కంగారుపడుతుంది రోహిణి. ఏం జరిగినా ఇంటికి వెళ్లి ఫేస్ చేయి..నిజం చెప్పు..ఇంకా దాచొద్దు అని చెప్పి పంపిస్తుంది విద్య. సరే అని ఇంటికి బయలుదేరుతుంది రోహిణి. ఇంటికి వచ్చేసరికి అంతా నార్మల్ గా ఉండడం చూసి...బాల మీనా ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు హమ్మయ్య అనుకుంటుంది. అసలు వాళ్లకి విషయమే తెలియలేదని తెలుసుకుని రిలాక్స్ అయిపోతుంది.
ఇంట్లో అందరూ కలసి పూజ చేస్తారు..క్రాకర్స్ కాలుస్తారు..అంతా కలసి భోజనం చేస్తారు. సరదాగా కూర్చుని మాట్లాడుకుంటారు...దీపావళి పండక్కి కూతురు శ్రుతి , అల్లుడు రవిని ఆహ్వానించిన శోభ.. వాళ్లు రాకపోయేసరికి హర్ట్ అవుతుంది. అక్కడైతే నువ్వునాన్న ఉంటారు.. ఇక్కడ చాలామంది ఉంటాం..బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అని సమాధానం చెబుతుంది శ్రుతి. అసలే ఇంట్లో గొడవలు జరిగి ఇప్పుడే సర్దుకున్నాయ్ అంటూ రూమ్ గొడవ తల్లికి చెబుతుంది. అంతే..ఇదే అవకాశంగా చేసుకుని మరోసారి సత్యం ఫ్యామిలీలో నిప్పు రాజేయాలని ఫిక్సవుతుంది శోభ. అంతా దీపావళి వేడుకల్లో ఉండగా అక్కడకు వెళుతుంది శోభ. ఈ ఆనందాన్ని ఎంతోసేపు నిలువనీయకూడదు అనుకుంటుంది. కూతురిపై ప్రేమ చూపించి.. వియ్యాలవారిపై విసుర్లు ప్రారంభిస్తుంది.
బెడ్ రూమ్స్ కోసం రోజుకో గొడవ జరుగుతోందని విన్నాను..అప్పట్లో మీరు ఇల్లు కట్టుకునేందుకు లోన్ కోసం అప్లై చేస్తే మా ఆయనే కదా ఇప్పించారు. అందుకే ఈ మాత్రం ఇల్లు అయినా కట్టుకున్నారు అంటూ మరోసారి దర్పం చూపిస్తుంది. నావంతు సాయంగా ఈ చెక్ తీసుకొచ్చానంటూ 5lac ఇస్తుంది. ప్రభావతి తీసుకునేందుకు ఉరుకుతుంది కానీ సత్యం కోపంగా చూడడంతో ఆగిపోతుంది. మమ్మీ నేను ఏదో క్యాజువల్ గా చెప్పాను నీకు.. నీవంతు సాయం కావాలని అడిగానా అంటుంది. నువ్వు ప్రత్యేకంగా అడగాలా శ్రుతి...మీ ఇంటి పరిస్థితి ఏంటో నాకు తెలియదా అని మరింత రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. తీసుకోమ్మా ఎందుకు ఆగిపోయావ్ అన్న బాలు... ఆ డబ్బుతో మంచి రూమ్ కట్టించవచ్చు అంటాడు. అదేంటి ఇలా మాట్లాడుతున్నాడని అంతా షాక్ అయి చూస్తారు. అవును మంచి రూమ్ కట్టిస్తే ఆవిడ..వాళ్లాయన వచ్చి ఇక్కడే ఉంటారు అని కౌంటర్ వేస్తాడు. ఇక సత్యం కూడా స్పందించి.... ఇక ఆపమ్మా అంటూ... బ్యాంక్ లోన్ మీ ఆయన సహాయంతో రాలేదు.. ఆర్టీసీ నుంచి కాదు బ్యాంక్ నుంచి వచ్చింది...నా ఫైల్ పై సంతకం కూడా పెట్టకుండా రెండు నెలలు తిప్పించుకుంటే పై అధికారితో కాల్ చేయిస్తే అప్పుడు సంతకం చేశారని అసలు విషయం చెబుతాడు సత్యం. ఇప్పుడు అవన్నీ ఎందుకులెండి అని టాపిక్ డైవర్ట్ చేస్తుంది శోభ...
కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!
అరుణాచలంలో కార్తీక శోభ - గిరిప్రదక్షిణ అంటే అలా తిరిగేసి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే! ఆలయం నుంచి వరుసగా 17వ ఎనర్జీ పాయింట్ వరకూ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
18వ ఎనర్జీ పాయింట్ నుంచి 44వ ఎనర్జీ పాయింట్ వరకూ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















