(Source: Poll of Polls)
Gunde Ninda Gudi Gantalu October 22 Episode: మీనా విశ్వరూపం చూసి వణికిపోయిన రోహిణి, మురిసిపోయిన బాలు- గుండెనిండా గుడిగంటలు అక్టోబర్22ఎపిసోడ్!
Gundeninda GudiGantalu Today episode: రోహిణి బదులు మీనాను కిడ్నాప్ చేయించాడు దినేష్.బాలుపై ఉన్న పగని ఇలా తీర్చుకోవాలి అనుకుంటాడు...బాలు ఎంట్రీతో మొత్తం మారిపోయింది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 22 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 October 22t Episod
రోహిణిని కిడ్నాప్ చేయమని దినేష్ చెబితే.. రౌడీలు కన్ఫ్యూజన్లో రోహిణి బదులు మీనాను తీసుకెళ్లిపోతారు. విద్యకు పూలు ఇచ్చి బాలుతో కాల్ మాట్లాడుతూ బయటకు వస్తుంది మీనా. రెడ్ కలర్ శారీ అని చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకుని మీనాను కిడ్నాప్ చేస్తారు. ఏవండి వీళ్లు ఎవరో నన్ను లాక్కెళుతున్నారని మీనా అరుపులు విని బాలు కంగారుగా పరిగెత్తుతాడు. విద్య కాల్ చేసింది పూలు తీసుకెళ్తున్నా అన్న విషయం ముందుగానే మీనా చెప్పడంతో విద్య ఇంటికి బయలుదేరుతాడు. కంగారుగా లోపలకు వెళ్లి మీనా ఏది అని అడుగుతాడు. పువ్వులు ఇచ్చేసి వెళ్లిపోయింది కదా అని అని చెబుతుంది విద్య. బయటకు వచ్చి మీనా సెల్ కి కాల్ చేస్తాడు..ఆ ఫోన్ ఆ పక్కనే రోడ్డుపై పడి ఉంటుంది. అదిచూసి బాలులో కంగారు మరింత పెరుగుతుంది. ఎవరు తీసుకెళ్లారా అని ఆలోచిస్తాడు. ఎక్కడికి వెళ్లాలో అర్థంకాక అయోమయంగా ఉండిపోతాడు కాసేపు. ఆ తర్వాత మీనా దారి మొత్తం పూలు విడుస్తూ వెళుతుంది..అంటే నాకు హింట్ ఇవ్వడం కోసమే మీనా ఇలా చేసింది...మంచిపని చేశావ్ మీనా.. నేను నిన్ను కాపాడుకుంటాను అనుకుని బయలుదేరుతాడు.
మరోవైపు మీనాను తీసుకెళ్లి కుర్చీకి కట్టేస్తారు కిడ్నాపర్స్. నేను తీసుకురమ్మన్నది రోహిణిని కదా దీన్ని తీసుకొచ్చారేంటి అనుకుంటాడు. ఆ బాలుగాడిపై పగ తీర్చుకుంటా...ముందు కళ్యాణి సంగతి తేలుస్తా అనుకుంటాడు.
మనోజ్ దగ్గరకు వెళ్లిన రోహిణి... విద్య వాళ్ల ఫాదర్ కి సర్జరీ ఉందట... 50 వేలు కావాలని అడిగింది ఇద్దాం అంటుంది. డబ్బులన్నీ డీలర్ కి కట్టేశా కదా అని మనోజ్ అనగానే ఫైర్ అవుతుంది. నేను కష్టంలో ఉన్నప్పుడు సాయం చేసింది.. ఇప్పుడు తనకు అవసరం అని అడిగేసరికి కాదని ఎలా అంటాను అంటుంది. ఇంతలో రోహిణి ఫోన్ రింగ్ అవుతుంది. విద్యనా...నేను మాట్లాడుతా ఇవ్వు రేపు షాప్ తెరిచిన తర్వాత అరెంజ్ చేస్తానని చెబుతా అంటాడు. అవసరం లేదు నేనే చెప్తాను అని బయటకు వెళ్లిపోతుంది. డబ్బు తీసుకుని నా దగ్గరకు వస్తావా? ఆధారాలు తీసుకుని మీ ఇంటికి రమ్మంటావా అని వాయిస్ మెసేజ్ పెడతాడు. నేను వెళ్తున్నా అని చెప్పేసి మళ్లీ వెళ్లిపోతుంది రోహిణి. ఇప్పుడు ఎక్కడికి అని మనోజ్ అడిగితే..పూజ టైమ్ కి వస్తాను అని చెప్పిసి వెళ్లిపోతుంది. నేను తీసుకెళ్తాను పద అనగానే... ఇద్దరం లేకపోతే తిడుతుంది నువ్వు ఉండు అంటుంది. వెళ్తూ వెళ్తూ మనోజ్ కి సారీ చెప్పేసి వెళ్లిపోతుంది... సరేలే అంటాడు మనోజ్.
మీనా మూతికి ఉన్న ప్లాస్టర్ తీయగానే ఎవడ్రా నువ్వు అని ఫైర్ అవుతుంది. మీ ఆయన నాకు బాకీ ఉన్నాడని పొగరుగా చెప్తాడు దినేష్. మా ఆయన వస్తే నిన్ను ఉతికి ఆరేస్తాడని అనగానే.. బాలు ఎంట్రీ ఇస్తాడు. ఎక్కడుందిరా నా భార్య అని చొక్కాపట్టుకుంటాడు. ఇద్దరూ కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు..వెనుకనుంచి ఓ కిడ్నాపర్ బాలు తలపై కొడతాడు. వెంటనే స్పృహతప్పి పడిపోతాడు. బాలు కిందపడిపోవడం చూసి మీనా కంగారుగా కట్లను బలవంతంగా విప్పేసుకుని రంగంలోకి దిగుతుంది. దినేష్ ని ఉతికి ఆరేస్తుంది. ఈ లోగా పోలీసులు వస్తారు. శ్రీ కృష్ణుడు మూర్ఛపోతే సత్యభామలా యుద్ధం చేసింది నా భార్య అంటాడు బాలు. వీడు ఆడవాళ్లను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తుంటాడు అని కంప్లైంట్ చేస్తాడు బాలు. అప్పటికే దినేష్ కి డబ్బులిచ్చేందుకు లొకేషన్ కి వచ్చిన రోహిణి కిటికీ లోంచి ఇదంతా చూసి అవాక్కవుతుంది.
మీనా బాలుకి తన గురించి మొత్తం తెలిసిపోయింది అనుకుంటూ విద్య దగ్గరకు వెళుతుంది రోహిణి. కంటపడకుండా అక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకుంటుంది. ఇంటికి వెళ్లిన తర్వాత జరిగినదంతా బాలుని ఏమీ చెప్పొద్దని మాటతీసుకుంటుంది మీనా.
ఇవాల్టితో ఇంట్లోంచి గెంటేస్తారని రోహిణి ఏడుస్తుంటుంది. ఆ దినేష్ గాడిని పోలీసులకు పట్టించాడు బాలు అంటుంది. విద్య సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా రోహిణి ఏడుస్తూనే ఉంటుంది. ఎప్పుడో అప్పుడు తెలియాల్సిందే కదా అని విద్య అంటుంది...నా కాపురం కూలిపోతుందని రోహిణి ఏడుస్తుంటే... నువ్వు పెళ్లికి ముందే చెప్పాల్సింది అంటుంది విద్య. ఫోన్ రింగవడంతో మరింత కంగారుపడుతుంది రోహిణి.
అరుణాచలంలో కార్తీక శోభ - గిరిప్రదక్షిణ అంటే అలా తిరిగేసి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!
ఆలయం నుంచి వరుసగా 17వ ఎనర్జీ పాయింట్ వరకూ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
18వ ఎనర్జీ పాయింట్ నుంచి 44వ ఎనర్జీ పాయింట్ వరకూ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















