Gunde Ninda Gudi Gantalu August 8th Episode: పోలీస్ స్టేషన్ కి కల్పన, రోహిణి మనోజ్ కి హెల్ప్ చేసిన బాలు మీనా - గుండెనిండా గుడిగంటలు ఆగష్టు 08ఎపిసోడ్!
Gundeninda GudiGantalu Today episode: రోహిణి పార్లర్ కి వస్తుంది మనోజ్ మాజీ లవర్ కల్పన. వెంటనే మనోజ్ కి చెప్తుంది రోహిణి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుండెనిండా గుడిగంటలు ఆగష్టు 08 ఎపిసోడ్ (Gunde Ninda Gudi Gantalu August 08 th Episode)
కల్పన తిరిగి కెనడా వెళ్లిపోతాను అని చెప్పగానే..మంచి కష్టమర్ మీరు వెళ్లిపోతున్నారని బాధపడతాడు బాలు. ఆ తర్వాత పార్లర్ కి వెళ్లాలని అనుకుంటుంది కల్పన. నాకు తెలిసిన ఓ పార్లల్ ఉందంటూ రోహిణి దగ్గరకు తీసుకెళ్తాడు బాలు. అయితే మనోజ్-రోహిణి వెతుకుతున్నది ఈమెనే అని కానీ, మనోజ్ ని మోసం చేసి తండ్రి డబ్బులు కొట్టేసి కెనడా పారిపోయిన కల్పన ఈమె అని బాలుకి తెలియదు.
మొబైల్ పూలషాపు రన్ చేస్తున్న మీనా..బండేసుకుని ఇంటింటికి పూలు తీసుకెళ్లి అమ్ముతుంటుంది. ఓషాపు ముందు బండిపెట్టి లోపలకు వెళ్లి వచ్చేసరికి బండి అక్కడ ఉండదు. ఏమైందని అడిగితే..నో పార్కింగ్ లో పెట్టారు పోలీసులు తీసుకెళ్లిపోయారని చెబుతాడు అక్కడున్న వ్యక్తి. కంగారుగా బాలుకి కాల్ చేస్తుంది మీనా. ఈసారి కూడా కార్పొరేషన్ వాళ్లు ఎత్తుకుపోయారా అంటే.. జరిగింది చెప్పి బాధపడుతుంది. నేను పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చానని చెప్పగానే నేను వస్తున్నా అక్కడే ఉండు అంటాడు బాలు. ఇదంతా కల్పనకి చెప్పి ప్లీజ్ మేడం ఒక్కసారి పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళదాం అంటాడు. సరే అంటుంది కల్పన.
ఏజెన్సీకి వెళ్లి ఎంక్వైరీ చేసినా కల్పన డీటైల్స్ దొరక్కపోవడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని ఫిక్సవుతారు మనోజ్, రోహిణి. ఇంట్లోంచి బయలుదేరి పోలీస్ స్టేషన్ కి వెళతారు. అదే టైమ్ కి కల్పనని తీసుకుని బాలు అక్కడకు వస్తాడు. మీనా కూడా అక్కడే ఉంటుంది. మీరు ఇక్కడే ఉండండి మేడం అని లోపలకు వెళ్లి పోలీసులను బతిమలాడుతాడు బాలు. కార్లోంచి బయటకు దిగిన కల్పన..రోహిణి, మనోజ్ ని చూసి షాక్ అవుతుంది. వాళ్లు తనని చూసేలోగా మళ్లీ కార్లో దాక్కుండిపోతుంది. ఎట్టకేలను మీనా బండి విడిపించి ఇచ్చి కల్పనని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతాడు బాలు. మీనాను అక్కడ చూసిన రోహిణి ఏం జరిగిందని అడిగితే చెబుతుంది మీనా. రోహిణి పార్లర్ కి వెళ్లిపోతుంది.
మౌనికను తీసుకుని పార్టీకి వెళ్లిన సంజయ్ మరోసారి ఫ్రెండ్స్ ముందు మౌనికను అవమానిస్తాడు. సంతోషంగా తీసుకెళ్లాడు అనుకున్న మౌనిక భర్త ప్రవర్తన, స్నేహితుల ముందు జరిగిన అవమానం తల్చుకుని కన్నీళ్లుపెట్టుకుంటుంది
తనకు తెలిసిన పార్లర్ ఉందని చెప్పిన బాలు...కల్పనని రోహిణి పార్లర్ కి తీసుకెళ్తాడు. ఫేషియల్ చేయాలని అడుగుతుంది..సరే అన్న రోహిణి కల్పనను చూసి షాక్ అవుతుంది. ఎక్కడో చూసినట్టుందే అనుకుంటూ మనోజ్ ఫోన్లో చూసిన ఫొటో గుర్తుచేసుకుంటుంది. కాసేపట్లో తేరుకుని..కూర్చోండి ఫేషియల్ చేస్తానని చెప్పి...వెంటనే మనోజ్ కి కాల్ చేస్తుంది. నీకోసం డబ్బులు వెతుక్కుంటూ వచ్చాయ్ అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ రోహిణి అంటే..నిన్ను మోసం చేసిన కల్పన ఇప్పుడు పార్లల్ లో ఉందని చెబుతుంది. అవునా వెంటనే వస్తానంటూ మనోజ్ బయలుదేరుతాడు. ఫేషియల్ చేస్తూ టైంపాస్ చేస్తుంది రోహిణి. ఇంతలో మనోజ్ రావడంతో షాక్ అవుతుంది కల్పన. ఆవేశంగా వచ్చిన మనోజ్..ఇన్నాళ్లుగా ఇంట్లో లక్షలు మింగినోడు అనే ముద్రను తల్చుకుని ఊగిపోతాడు.
ఎప్పుడూ బాలుతో మాటలు పడడం, రోహిణికి టార్గెట్ అవడం తప్ప ఏమీ మాట్లాడని మనోజ్..ఫస్ట్ టైమ్ కల్పనని చూసి విశ్వరూపం చూపించాడు. ఆవేశంగా వచ్చి గొంతుపట్టుకుని..నీ వల్ల నా ఇంట్లో నేను దొంగనయ్యానంటూ నిలదీస్తాడు. ముందు షాక్ అయిన కల్పన.. ఆ తర్వాత మనోజ్ చేతిని విసిరి కొడుతుంది. గట్టిగా ఇచ్చేందుకే డిసైడ్ అయినట్టుంది.. లేదంటే..వెంటనే తప్పించుకునిబాలు కార్లో పారిపోయే అవకాశం ఉంది. బాలు కార్లో వెళ్లడం చూస్తే..మళ్లీ రోహిణి, మనోజ్ ఇద్దరూ కలసి బాలుని టార్గెట్ చేసే అవకాశం ఉంది. అప్పుడు బాలునే మళ్లీ కల్పన నుంచి తండ్రి రిటైర్మెంట్ పెన్షన్ వసూలు చేస్తాడేమో... ఏం జరుగుతుందో చూద్దాం..
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం - సులభమైన పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
శ్రీవరలక్ష్మీ వ్రతకథ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















