Gunde Ninda Gudi Gantalu August 7th Episode: మనోజ్ కి దొరికిపోయిన కల్పన, రోహిణికి ఆహారమైపోతుందా బాలు తప్పిస్తాడా? - గుండెనిండా గుడిగంటలు ఆగష్టు 07ఎపిసోడ్!
Gundeninda GudiGantalu Today episode: రోహిణి పార్లర్ కి వస్తుంది మనోజ్ మాజీ లవర్ కల్పన. వెంటనే మనోజ్ కి చెప్తుంది రోహిణి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

దీక్ష నియమాలు పాటించాల్సిందే అంటూ రోహిణిని టార్చర్ చేస్తుంది ప్రభావతి. ముగ్గువేయమని చెబుతుంది. ఇంట్లో అంతా రోహిణికి సపోర్ట్ చేసినా కానీ ప్రభావతి తగ్గేదే లే అన్నట్టు పట్టుబడుతుంది. చేసేదిలేక రోహిణి అడ్డదిడ్డంగా ముగ్గేస్తుంది. ఓవైపు బాలు సెటైర్స్ వేస్తుంటాడు. పార్లలమ్మ ముగ్గువేయకపోతే జైల్లో ఉన్న వాళ్లనాన్న బయటకు రాలేరని అంటాడు. ఎట్టకేలకు ముగ్గేస్తుంది.
అంతా టిఫిన్ చేస్తుంటారు. పూరీ కర్రీ నీఅంత బాగా ఎవరూ చేయలేరంటూ రవిశ్రుతి మెచ్చుకుంటారు, ప్రభావతి కుళ్లుకుంటుంది. నోటికి పనిచెప్తుంది..ఇంతలో సత్యంరావడంతో సైలెంట్ అయిపోతుంది ప్రభావతి. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన బాలు పూరీ చేశావా అంటూ తిందామని కూర్చుంటాడు. బాలుకి ఇష్టం అని వడ్డిస్తుంది మీనా. మిగిలినవాళ్లున్నారు తినొద్దా అంటూ బాలు ప్లేట్ లోంచి పూరీలు తీసేస్తుంది ప్రభావతి. మీనా బాధపడుతుంది. ఇలా చేస్తావా ఆగు నీ పని చెప్తాను అనుకుంటాడు బాలు.
రోహిణి, మనోజ్ కూడా ఆకలి అంటూ టిఫిన్ చేసేందుకు వస్తారు. వాళ్లు ప్లేట్లో పూరీలు పెట్టుకోగానే..ఆగండి అని అరుస్తాడు బాలు. పూజారిగారు ఏం చెప్పారు? మర్చిపోయారా? ఉప్పు కారం తినకూడదు, స్వయంపాక చేసుకుని తినాలన్నారు, లేదంటే మీనాన్న బయటకురాలేరని అన్నారు గుర్తులేదా అంటాడు. అవును నేను మర్చిపోయాను నీకైనా గుర్తుండాలి కదా రోహిణి అంటుంది ప్రభావతి. జావచేశాను ఉప్పు వేసి ఇవ్వనా అని మీ మీనా అంటే ఉప్పు వేయకూడదని కంటిన్యూ చేస్తాడు బాలు. నాకేం అవసరం లేదు ఈ నీళ్లు తాగుతా అంటుంది రోహిణి. సరేలే రోహిణి వాటా పూరీలు నేను తింటా అని మనోజ్ సిద్ధమవుతాడు. భార్య వ్రతం చేస్తే భర్త కూడాసహకరించాలి..తను ఏం తింటే నువ్వు అదే తినాలి, నేను దీక్ష చేస్తే మీనా కూడా చేస్తుందంటాడు బాలు. ఇద్దరి పూరీలు పెట్టుకుని తినేస్తాడు. అరేయ్ నేను నీ ప్లేట్ లోంచి రెండు పూరీలే తీసుకున్నారా అందుకోసం ఇలా చేస్తావా అంటుంది ప్రభావతి. ఇంతలో కల్పన కాల్ చేయడంతో టిఫిన్ తినేసి వెళ్లిపోతాడు బాలు
భర్త పుట్టినరోజుని ఘనంగా జరిపించాలనే సంతోషంలో ఉంటుంది మౌనిక. ఇంటికి రాగానే విష్ చేస్తుంది, దేవుడి దగ్గర పూజ చేసి హారతి ఇస్తుంది. కేక్ కట్ చేయిస్తుంది. నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా నేను కరగను అనుకుంటాడు సంజయ్. ఎంత విసుక్కున్నా, ఎంత ఏడిపించినా ఇది మాత్రం నాపై ప్రేమ చూపిస్తోంది..దీనికి నేనంటే ఏంటో చూపించాలని ఫిక్సవుతాడు. కేక్ కట్ చేయడానికి ఒప్పుకోడు ఇంతలో తల్లి కాల్ వేచి విశెష్ చెప్పి..మౌనికను ఏమీ అనొద్దని చెప్పి కాల్ కట్ చేస్తుంది. సాయంత్రం పార్టీకి వెళదాం ఫ్రెండ్స్ తో కలసి రెడీ అవు అని చెప్తాడు. మౌనికను ఏడిపించేందుకు ఏదో ప్లాన్ చేశాడు సంజయ్. అదేం తెలియని మౌనిక మాత్రం సంతోషంగా సరే అంటుంది.
మనోజ్, రోహిణి..ఎంక్వైరీ చేసిన ఆఫీసుకి వెళ్లిన కల్పన కెనడాకు ఫ్లైట్ టికెట్ బుక్కైందా అని అడుగుతుంది. అయిందని చెప్పిన అక్కడ రిసెప్షనిస్ట్ మీ గురించి ఎవరో ఎంక్వైరీ చేశారని చెబుతుంది. మీ డీటైల్స్ ఇవ్వలేదని..వాళ్ల పేర్లు మనోజ్, రోహిణ అని క్లారిటీ ఇస్తుంది. షాక్ అయిన కల్పన..పెళ్లి చేసుకున్నాడన్నమాట అనుకుంటుంది. ఇకపై నా వివరాలు ఎవరు అడిగినా ఇవ్వొద్దని చెప్పి వెళ్లిపోతుంది.
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం - సులభమైన పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
శ్రీవరలక్ష్మీ వ్రతకథ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















