అన్వేషించండి

Gunde Ninda Gudi Gantalu December 19 Episode: బాలు బిజినెస్ ప్లాన్, ప్రభావతితో మీనా సరికొత్త సవాల్ - గుండెనిండా గుడిగంటలు డిసెంబర్ 19 ఎపిసోడ్

Gundeninda GudiGantalu Today episode: మౌనిక కనిపించడం, ఈయనెవరో నాకు తెలియదు అని గెంటించేయడంతో బాలు ఆ బాధలోనే ఉండిపోతాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 19 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 December 19 Episode

 మౌనిక దగ్గర్నుంచి వచ్చిన తర్వాత బాలు అదే బాధలో ఉండిపోతాడు. తను నన్ను కొట్టినా కానీ నేను బాధపడేవాడిని కాదు అస్సలు నేనెవరో తెలియదు అని చెప్పేసింది..దీన్నుంచి నేను బయటపడలేకపోతున్నా..అసలు మౌనిక ఎందుకలా చేసిందో అర్థంకావడం లేదని బాలు బాధపడతాడు. ఇంకేదో కారణం ఉండి ఉంటుంది లెండి అని సర్దిచెబుతుంది మీనా. ఆ కారణం ఏంటో , మౌనిక ఎందుకు అలా చేస్తోందో తెలియాలి అనుకుంటాడు. ఆ సంజయ్ ఏదైనా బెదిరించి ఉంటాడా అనే సందేహం వస్తుంది.  ఆ తర్వాత మీనా కాల్ చేసినా లిఫ్ట్ చేయదు మౌనిక. ఇదంతా చూసి..ఇలానే కంటిన్యూ అయిపో..ఎప్పటికీ  ఈ ఇంట్లో ఏదో మూలన పడి ఉండొచ్చు అంటాడు సంజయ్.

నిద్రపోతున్న మనోజ్ కి మెలకువ వస్తుంది...ఉదయం షాప్ లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి ఇచ్చిన లెటర్ చూసి టెన్షన్ పడుతుంటాడు. నా చుట్టూ ఉన్నవారివల్లే సమస్యలు అంటే ‌అర్థం ఏంటి? ఇంట్లో వాళ్లా? నా చుట్టూ ఎక్కువ సమయం రోహిణి కదా ఉంటుంది అని ఆలోచిస్తాడు. ఏం చేయాలో అర్థంకాక తల్లికి కాల్ చేసి రూమ్ నుంచి బయటకు రమ్మని అడుగుతాడు. ఆ లెటర్ చూసిన ప్రభావతి... నీవల్ల ఎవరికైనా సమస్య వస్తుంది కానీ ఎవరి వల్ల అయినా నీకు సమస్య వస్తుందా అని అంటుంది. ఏంటి కొత్తడ్రామానా... నెలకు 50 వేలు ఇమ్మన్నామని కొత్తగా ఏమైనా ప్లాన్ చేశావా అంటుంది. నేను మాత్రం నిన్ను నమ్మను..ఆ బాలుగాడిని అయినా నమ్ముతా అంటాడు. నువ్వు నన్ను ఇంతమాట అన్నావని తెలిసినా ... నేను నిన్ను కొట్టానని తెలిసినా బాలుగాడు దీపావళి పండుగ చేసుకుంటాడో పోరా అని నెట్టేస్తుంది...వీడికి కాస్తైనా తెలివితేటలు ఇవ్వు స్వామి అని దేవుడిని కోరుకుంటుంది ప్రభావతి.

బాలు సెకెండ్స్ లో మరోకారు కొంటాడు కదా..ఆ కారుని రాజేష్ కి రెంట్ కి ఇవ్వాలని ఫిక్సవుతారు. ఆ కారు తాళాలను సత్యం చేతుల మీదుగా రాజేష్ కి ఇప్పిస్తాడు బాలు. ఎవరో పరిచయం లేనివాళ్లకు ఇస్తే కారు పాడవుతుంది..మంచి పని చేశావ్ అని బాలుతో అంటాడు.  తీసుకో రాజేష్ నీకు అంతా మంచే జరుగుతుంది అని దీవిస్తాడు సత్యం. కారు నడిపేటప్పుడు జాగ్రత్త అని చెబుతుంది మీనా. స్నేహితులు అయినా కానీ ఇచ్చిపుచ్చుకునే దగ్గర స్ట్రిక్ట్ గా ఉండాలి అంటాడు సత్యం. నేను చూసుకుంటా మావయ్య అంటుంది మీనాయ  ఇలా నువ్వు 200 కార్లు కొని పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపో అంటాడు రాజేష్. బాలు-మీనా సంతోషం చూసి కుళ్లుకుంటారు రోహిణి, మనోజ్, ప్రభావతి. అయినా బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే దానికో స్టేటస్ ఉండాలి, ఇలా చదువు సంధ్య లేనివాడు బిజినెస్ మ్యాన్ ఎలా అవుతాడని అవమానిస్తాడు మనోజ్.

అవును స్టేటస్ ఉండాలి అన్నారు కదా.. స్టేటస్ ఎలా వస్తుంది? నాలుగు లక్షల ఫర్నిచర్ మోసుకుపోతో వస్తుందా? నాలుగు లక్షల ఫర్నిచర్ కోసం ఎవరినెత్తిపైన అయినా చెంగేసుకుంటే వస్తుందా? ఆ నాలుగు లక్షల కోసం నా బంగారం ఎత్తుకుపోతే వస్తుందా? అంటుంది. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావ్ వాడిని చూసి నీకు అసూయ అంటుంది ప్రభావతి. వీడిని చూసి అసూయపడే పనికిమాలిన వాడు ఈ ప్రపంచంలో ఉంటారా అంటాడు బాలు. అన్నయ్యా మీరు శుభమా అని కారు తీసుకున్నారు.. ఈ భజన మీకెందుకు వెళ్లండి అంటుంది. ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ మీరు చాలా కార్లు కొని పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతారని అంటుంది. ప్రభావతి మళ్లీ సెటైర్స్ వేస్తుంటే.. మీనా అడ్డుకుని గట్టిగా సమాధానం చెబుతుంది. మరో శపథం చేస్తుంటే..ఆపేస్తాడు బాలు.. 

ఏంట్రా బిజినెస్ మ్యాన్..ఇంకొకరిని ఎగతాళి చేసేముందు నీ చరిత్ర నువ్వు మర్చిపోయే జబ్బు ఏమైనా వచ్చిందా? అని సత్యం క్లాస్ వేస్తాడు. అందరితో అనడం ఎందుకు..ఏదైనా అంటే నాతో అను అంటుంది రోహిణి. నాకు ఇవన్నీ అలవాటే కానీ...ఇంతకీ ఆ లెటర్ ఎవరు రాశారో అని మళ్లీ అదే టాపిక్ మాట్లాడుతాడు. ఆ లెటర్ సంగతి తేల్చుకుని వస్తానంటాడు. 

మనోజ్ వెళ్లి పార్క్ ఫ్రెండ్ ని కలుస్తాడు.  లెటర్ సంగతి చెప్పి..నాకు పెద్ద సమస్య వచ్చేలా ఉందంటాడు. అయినా నీవల్లే అందరకీ సమస్యలు వస్తాయి కదా అని సెటైర్ వేస్తాడు.  ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అడిగితే.. ఈ జ్యోతిష్యుడు చాలా పవర్ ఫుల్ అని చెబుతాడు మనోజ్. ఇక్కడ కూడా నేను మోసపోకుండా ఉండేందుకు నిన్ను పిలిచాను అంటాడు. లోపలకు వెళ్లిన తర్వాత...ఏదైనా సమస్య వస్తుందనే భయంతో వచ్చాంటూ లెటర్ ఆ జ్యోతిష్యుడి చేతిలో పెడతాడు. నువ్వే అప్పులు, తప్పులు చేసేవాడిలా ఉన్నావ్ అంటాడు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి స్వామీ అని అడుగుతాడు మనోజ్. త్వరలో నీకు పెద్ద ఆపద రాబోతోంది, నువ్వు భయం స్వభావం కలవాడివి అని మరింత భయపెట్టేస్తాడు.  నువ్వు వేసుకునే దుస్తులే నీకు కవచంలా మారుతాయంటూ రోజుకో రంగు చెబుతాడు జ్యోతిష్యుడు

 'అఖండ 2' లో అష్టవామన (8 మంది బాల బ్రాహ్మణులు) బలి గురించి పురాణాల్లో ఉందా? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

అఖండ 2లో బాలకృష్ణ శక్తి వెనుకున్న లాజిక్ ఇదేనా! రామాయణంలో బల, అతిబల విద్యల ప్రాముఖ్యత ఏంటి?

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
Advertisement

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Embed widget