Akhanda 2 Movie : 'అఖండ 2' లో అష్టవామన (8 మంది బాల బ్రాహ్మణులు) బలి గురించి పురాణాల్లో ఉందా? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Balakrishna Akhanda 2 Movie Review: నందమూరి నటసింహం అఖండ 2 తాండవం థియేటర్లలో మోత మోగిపోతోంది. అయితే ఈ మూవీలో ఓ సన్నివేశంలో అష్టవామన బలి గురించి ఉంటుంది..ఆ బలులు నిజంగా ఉన్నాయా? పురాణాల్లో ఏముంది?

Asta Vamana Bali In Akhanda 2 Movie: బాలకృష్ణ అఖండ 2 సినిమాలో అష్టవామన బలి గురించి ఓ సన్నివేశం ఉంటుంది. పదవీ కాంక్షతో తన దగ్గరకు వచ్చిన ఓ నాయకుడితో.. శక్తులన్నీ వశం చేసుకుని 8 మంది బాల బ్రాహ్మణులను బలి ఇస్తే అనుకున్నది నెరవేరుతుందని చెబుతాడు నేత్ర అనే తాంత్రికుడి పాత్రలో నటించిన ఆది పినిశెట్టి. అందుకోసం 8 మంది వేదం చదివే బాల బ్రాహ్మణులను తీసుకొస్తారు.. వారిని బలిఇస్తే 8 అష్ట శక్తులు నిద్రలేస్తాయని చెబుతాడు. ఆ సమయంలో అఖండ ఎంట్రీ ఇచ్చి ఆ బలులను ఆపేస్తాడు.
ఇంతకీ అష్ట వామన బలి అనేది పురాణాల్లో ఉందా?
అష్ట వామన బలి అంటే 8 మంది బాల బ్రాహ్మణులను బలి ఇవ్వడమా?
పురాణాల్లో ఉన్నది వేరు - సినిమాలో చూపించింది వేరా?
అస్సాం, బెంగాల్ లో కొన్ని శాక్తేయ ఉపాసనల్లో అష్టబాల బలి, అష్ట వామ బలి అనే ప్రయోగం వినిపిస్తుంది. కానీ దాని అర్థం 8 మంది బాల బ్రాహ్మణులను బలిఇవ్వడం కాదు.. ఎనిమిది రకాల జంతువులను ఒకేసారి దేవతకు సమర్పించడం అని అర్థం. కొన్ని అతి రహస్య శాక్తేయ-కౌల గ్రాంధాల్లో నరబలి గురించి ఉంది కానీ అదికూడా బాల బ్రాహ్మణులను సూచించదు. పైగా ఆధునిక కాలంలో మానవ బలి పూర్తిగా నిషేధం, చట్ట విరుద్ధం. అంటే ఎక్కడా కూడా బాల బ్రాహ్మణులను బలివ్వడాన్ని అష్ట వామన బలి అంటారని లేదు.
హిందూ పురాణాల్లో మరో ప్రస్తావన ఉది అష్ట వామన బలి గురించి..
శ్రీ మహావిష్ణువు..బలి చక్రవర్తిని మూడు అడుగులు అడుగుతాడు. ఓ అడుగు నేలపై, మరో అడుగు ఆకాశంలో, ఇంకో అడుగు బలి తలపై వేసి పాతాళానికి తొక్కేస్తాడు. మూడో అడుగు వేసే సందర్భంలో ఎనిమిది రకాల వామన బలులు, అష్టబలులు గురించి ప్రస్తావన ఉంటుంది.
బలిచక్రవర్తి వామనుడికి తాను 8 రకాల బలులు సమర్పించాడని ...అందుకే పాతాళంలో రాజ్యాధికారం, చిరంజీవిత్వం ఇచ్చాడని ఓ పురాణ కథ ఉంది.
ఎనిమిది బలులు ఏంటంటే..
ఆత్మబలి - తనను తాను పూర్తిగా శరణాగతి చేయడం
మనోబలి - మనుస్సును సమర్పించడం
వాక్ బలి - వాక్కును సమర్పించడం
కర్మ బలి - కర్మలన్నీ ఆ దివ్య చరణాలకు అర్పించడం
ధన బలి - సర్వ సంపదనూ దానం చేయడం
దార బలి - భార్య, పుత్రులు బంధాన్ని వదిలేయడం
కుల బలి - కులగర్వాన్ని వదిలేయడం
జీవ బలి - తన జీవితాన్నే అర్పించడం ( ఇందుకు వామనుడు అంగీకరించకుండా బలికి చిరంజీవిత్వం ఇచ్చాడు)
అష్ట వామన బలి పూర్తిగా శరణాగతి తత్వానికి, పూర్తి సమర్పణకు చిహ్నం. అంతేకానీ ఎనిమిది మంది బాల బ్రాహ్మణులను బలివ్వడం కాదు.. అఖండ 2 లో ఈ సన్నివేశం కేవలం కథకు, అఖండ పాత్రకు హైప్ తీసుకొచ్చేందుకు, ప్రేక్షకులను మెప్పించేందుకు మాత్రమే అనుకోవాలేమో
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే ఇవ్వబడింది. ABP దేశంఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
ఉత్తరాఖండ్ అడవుల్లో భయానక గాలులు! అప్సరసల శాపమా? రహస్య శక్తులా?






















