భగవంతుడు ఉన్నాడా లేదా అనే సందేహం ఉండేవారికి సూర్యభగవానుడే నిదర్శనం
ప్రత్యక్షనారాయణుడు అయిన సూర్యుడికి నిత్యం నమస్కరిస్తారు భక్తులు
ఆరోగ్యం కోసం సూర్యనమస్కారాలు చేస్తారు
అయితే సూర్యుడికి నమస్కరించినప్పుడు, సూర్యనమస్కారాలు చేసినప్పుడు ఈ మంత్రం పఠించండి
నమః సూర్యాయ శాంతాయ సర్వరోగనివారిణే||
ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహి దేహి దేవా జగత్పితే||
ఓ సూర్య దేవా ! జగత్ పరిపాలకా!! నీకు ఇవే నా నమస్కారములు అని అర్థం
నీవు సర్వరోగాలు తొలగించువాడవు, మాకు ఆయువును, ఆరోగ్యాన్ని, సంపదను అనుగ్రహించు
నిత్యం ఈ శ్లోకం పఠిస్తే ఆరోగ్య సిద్ధి, సంపద వృద్ధి కలుగుతుందని పండితులు చెబుతారు