Gunde Ninda Gudi Gantalu December 17 Episode: ప్రభావతిలో మార్పు మొదలైందా! మనోజ్ వద్దు బాలు ముద్దు అంటుందా? గుండెనిండా గుడిగంటలు డిసెంబర్ 17 ఎపిసోడ్
Gundeninda GudiGantalu Today episode: సత్యం-ప్రభావతి మధ్య గొడవ సర్దుమణగడంతో మరో కారు కొనేశాడు బాలు. తల్లిదండ్రులను కొత్త కార్లో గుడికి తీసుకెళ్లాడు . ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 17 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 December 17 Episode
మనోజ్ ఎవరి కొంప ముంచినా ముందుగా రోహిణికే ఎఫెక్ట్ అవుతుంటుంది..ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇప్పుడు డబ్బు సమస్యను కూడా మీ నాన్నకు చెప్పి నువ్వే తీర్చు అంటుంది ప్రభావతి. మా నాన్న ఎలా ఇస్తారు? ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నా కదా అంటుంది. జైల్లో ఉన్నా కానీ వాడు వ్యాపారం పెట్టేందుకు సహాయం చేశారు కదా..మొన్న బాలుగాడికి డబ్బులు పంపించారు? ఇప్పుడు కూడా అడుగు అంటుంది. మరోవైపు ఇప్పటికైనా బుద్ధిగా ఉండరా అని మనోజ్ ని అనగానే.. తన అక్కసు వెళ్లగక్కాడు మనోజ్. నువ్వేం చేస్తావ్..నేను సంపాదిస్తే కూర్చుని తింటావా అని అనేశాడు. బాగా బుద్ధి చెప్పావ్..నువ్వు ఏం చేస్తావో తెలియదు..డబ్బులు తెచ్చి ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్పింది ప్రభావతి. గుండెనిండా గుడిగంటలు డిసెంబర్ 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

ఫర్నిచర్ షాప్ కి వెళ్లిన మనోజ్ కి ఎవడో వచ్చి లెటర్ ఇచ్చి వెళ్లిపోయాడు. నీ చుట్టూ ఉండేవారివల్లే సమస్యలు వస్తాయి జాగ్రత్తగా ఉండు అని ఉంటుంది. ఆ లెటర్ ఎవరు ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో మనోజ్ కి అర్థంకాదు. అప్పుడో షాప్ లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిణి చేతిలో పెడతాడు ఆ లెటర్. చుట్టూ ఉండేవారివల్లే సమస్యలు వస్తాయా? ఏంటిది? ఎవరిచ్చారు అని అడుగుతుంది. ఏమో నాకు తెలియదు..ఎవరో వచ్చి లెటర్ ఇచ్చి వెళ్లిపోయారు అంటాడు మనోజ్. ఎవరో తెలుసుకోవాలికదా అని బయటకు గట్టిగా మాట్లాడినా..లోలోపలే రోహిణిలో ఏదో తెలియని భయం మొదలవుతుంది. డబ్బు గురించి మాట్లాడినందుకు పుట్టినప్పటి నుంచి సపోర్ట్ చేసిన తల్లినే అంతమాట అనేసిన మనోజ్.. తనని ఎలా చూస్తాడో అని భయపడుతుంది.

మనోజ్ మింగేసి ఇచ్చిన డబ్బులతో మరో కొత్త కారు కొని తీసుకొస్తాడు బాలు. రెండోదాన్ని తీసుకొచ్చాను బయటకురా అని ఆటపట్టిస్తాడు బాలు..మీనా కూడా మా చెల్లిని బయటే ఉండమనండి వస్తున్నా హారతి ఇస్తా అని రివర్స్ లో ఏడిపిస్తుంది. కారు తీసుకురాగానే ఇంట్లో అందర్నీ పిలిచి సంతోషంగా చూపిస్తాడు. బామ్మ సుశీలమ్మ ఉంది కాబట్టి ప్రభావతి నోటికి పని చెప్పడం కాస్త తగ్గించింది. సుశీలమ్మ, సత్యం, శ్రుతి, రవి అందరూ కంగ్రాంట్స్ చెబుతారు. వాడేం పెద్ద విమానం కొనలేదని అక్కసు వెళ్లగక్కుతుంది ప్రభావతి. ఇద్దర్నీ గుడికి తీసుకెళ్లిరారా అని సుశీలమ్మ చెప్పడంతో తల్లితండ్రితో పాటూ మీనాను కూడా తనతో రమ్మంటాడు బాలు. వెనుకసీట్లో సత్యం, ప్రభావతి చెరోవైపు తిరిగి కూర్చుంటారు. ఇలా కాదు అనుకుంటూ కారుని కావాలనే మెలికలు తిప్పి తీసుకెళ్తుంటాడు బాలు...వెనుకసీట్లో ఎడమొహం పెడమొహం పెట్టుకుని కూర్చున్న ప్రభావతి, సత్యం తూలిపడుతుంటారు..నా చేయి పట్టుకో అని ప్రభావతికి చెబుతాడు. హమ్మయ్య అని నవ్వుకుంటారు మీనా, బాలు. ఇందాక అడ్డదిడ్డంగా తీసుకెళ్లావ్..ఇప్పుడు కారు చక్కగానే పోతోంది అంటాడు సత్యం. ఇప్పుడు రోడ్డుపై గుంతలు లేవులే అంటాడు బాలు

సుశీలమ్మ బర్త్ డే గిఫ్ట్ వీడియోను చూపిస్తుంది శ్రుతి. బాలు నిజంగా గ్రేట్ అంటుంది శ్రుతి. అవునమ్మా వాడికి మాత్రమే నా మనసులో ఏముందో తెలుసు అంటుంది. మీ మాజీ లవర్ ఫొటో అంటూ గోపాలం పిక్ చూపించి ఆటపట్టిస్తుంది. నీకు ఇప్పుడు నీ గోపాలం ఫొటో చూపిస్తా అంటూ రవి చిన్నప్పటి సిగ్గుబిళ్లతో ఉన్న పిక్ చూపిస్తుంది. అది చూసి దొరికావ్ అని శ్రుతి అనగానే...రవి లాక్కునేందుకు ట్రై చేస్తాడు. ఇంతలో బాలు, మీనా వస్తారు. ఆంటీ అంకుల్ ఏరి అని అడిగితే.. ఇద్దరూ నవ్వుకుంటూ లోపలకు వస్తారు. ప్రభావతి మంచి నీళ్లు ఇవ్వు అని సత్యం అడుగుతాడు...అబ్బో ఏంటి ఈ మార్పు అంటుంది శ్రుతి. ఇద్దరకీ ఒకరంటే ఒకరికి ఇష్టం అంటుంది సుశీలమ్మ. అంతా మనోజ్ గాడివల్లే జరిగింది కానీ లేదంటే ఇలా ఉండేవారం కాదంటుంది ప్రభావతి. పిల్లలపై ప్రేమ వాళ్లను చెడుదారిలో నడిపించేలా ఉండకూడదు అంటాడు సత్యం.

ఇంటికి వచ్చేసరికి ప్రభావతి మొహంపై స్టిక్కర్ సత్యం మెడకు అంటుకుని ఉంటుంది. అంతా కలసి సరదాగా ఆటపట్టిస్తారు. ఏంట్రా నిజంగా మీరు గుడికే వెళ్లారా పార్కుకి వెళ్లొచ్చారా అని సెటైర్ వేస్తుంది సుశీలమ్మ. సో రొమాంటిక్ జర్నీ అన్నమాట అంటుంది శ్రుతి. ఏం కాదు.. మా డ్రైవర్ కి డ్రైవింగ్ సరిగా రాలేదు అంటుంది . అదే కార్లో కార్లో నేనూ ఉన్నాను..కారుని అటు ఇటు తిప్పితే నేనేం మా ఆయనపై పడలేదే అంటుంది మీనా. నా పరువు తీయకే అంటుంది ప్రభావతి. హమ్మయ్య వీళ్లిద్దరూ కలిసిపోయారు చాలు అనుకుంటారు బాలు-మీనా. తనను నిందించే మనోజ్ కన్నా తన సంతోషాన్ని కోరుకునే బాలునే బెటర్ అని ప్రభావతిలో ఇప్పటికైనా మార్పు మొదలవుతుందేమో చూడాలి.






















