Gunde Ninda Gudi Gantalu June 25th Episode : రోహిణి, శోభ కుట్రకు బాలు బలవుతాడా ? బయటపడతాడా? తాళి మార్చే ఫంక్షన్ లో ఏం జరుగబోతోంది - గుండె నిండా గుడి గంటలు జూన్ 25 ఎపిసోడ్
Gundeninda GudiGantalu Today episode: శ్రుతి, రోహిణి తాళి మార్చే వేడుక కోసం హడావుడి చేస్తుంది ప్రభావతి. అంతా కలసి బాలుని టార్గెట్ చేస్తారు. గుండెనిండా గుడిగంటలు ఈరోజు ఎపిసోడ్ లో ఏంజరిగిందంటే

గుండెనిండా గుడిగంటలు జూన్ 25 ఎపిసోడ్
శ్రుతికి తాళి మార్చే ఫంక్షన్ లో భాగంగా రోహిణికి కూడా జరిపించేద్దాం అంటుంది ప్రభావతి. మీనాన్నని రమ్మని చెప్పు అని రోహిణికి కండిషన్ పెడుతుంది. ఈ టెన్షన్ నుంచి తప్పించుకోవాలంటే బాలుని ఎగదోసి గొడవ పెట్టించాలి..అప్పడు నా టాపిక్ పక్కకు వెళ్లిపోతుందని ప్లాన్ చేసుకుంటుంది రోహిణి.
మీనా తల్లిని కలుస్తుంది. ఇటువైపు పని ఉండి వచ్చానంటుంది. అల్లుడుగారు రాలేదా అని అడిగితే రాలేదంటుంది మీనా. ఆయన ఎందుకు రావాలని క్వశ్చన్ చేస్తాడు శివ. మరోసారి మా ఆయన గురించి మాట్లాడితే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది మీనా. నల్లపూసల ఫంక్షన్ గురించి చెప్పి మిమ్మల్ని పిలవమని మావయ్య చెప్పారు కానీ..నేనే వద్దని చెప్పాను అంటుంది. అదే బెటర్ అంటుంది మీనా తల్లి
కూతురి తాళి మార్చే ఫంక్షన్ కోసం డబ్బు తీసుకుని వస్తుంది సుగుణమ్మ. పార్లర్ కి వెళ్లి రోహిణిని కలుస్తుంది. తల్లిని చూసి టెన్షన్ పడుతుంది సుగుణమ్మ. నీ తాళి మార్చే ఫంక్షన్ కోసం నీ మొదటి పెళ్లి తాళిని తాకట్టు పెట్టి తీసుకొచ్చాను అంటుంది. ఇంతలో ప్రభావతి పార్లల్ కి వస్తుంది. మీరు ఇక్కడే కూర్చోండని చెప్పి రిసెప్షనిస్ట్ లోపలకి వెళ్లి రోహిణికి చెబుతుంది. మీ అత్తయ్య వచ్చారని చెప్పడంతో రోహిణి టెన్షన్ పడుతుంది. ఇప్పుడు ఆమె కంటపడకుండా నిన్ను ఎలా పంపించాలని అడుగుతుంది? నువ్వు బయటకువెళ్లి మాట్లాడి ఆవిడను అట్నుంచి అటే పంపించు అంటుంది సుగుణమ్మ. అసలే పార్లల్ విషయంలో ఆమె పేరు లేదని విశ్వరూపం చూపించింది. ఇప్పుడు నిన్ను ఇక్కడ చూస్తే రచ్చే అంటుంది. నన్ను ఆవిడ గుర్తుపడుతుందా అని అడిగితే గతంలో మీనాతో ఇంటికి వచ్చావు కదా నిన్నెలా మర్చిపోతుందని అంటుంది. ఇంకా రాలేదంటని ప్రభావతి అసహనంతో లోపలకు వెళ్లబోతుంటే రోహిణి బయటకు వస్తుంది. మీ తాళి మార్చే ఫంక్షన్ గురించి తిరుగుతున్నా కదా కాసేపు నీతో మసాజ్ చేయించుకుని వెళదాం అనే వచ్చాను అంటుంది. మీ నాన్న కోసం షర్ట్ కొన్నాను అవును మీనాన్న వస్తున్నారా అడిగితే వస్తున్నారని చెబుతుంది. అప్పుడే డబ్బులు కూడా పంపించేశారని తల్లి తీసుకొచ్చి ఇచ్చిన డబ్బు తెచ్చి ఇస్తుంది.
ఇంటికొచ్చిన ప్రభావతి డబ్బుల కోసం బాలుని అడుగుతుంది ప్రభావతి. తనకు ఎలాంటి సంబంధం లేదంటాడు సత్యం. మీనాకు 16 రోజులు ఫంక్షన్ చేశాం ఆ పూలవాళ్లు ఏమైనా పెట్టారా అని క్వశ్చన్ చేస్తుంది. నేను లేను అనుకుని మాట్లాడుతున్నావా అంటాడు బాలు..అవును నువ్వు లేనప్పుడు మీ ఆవిడను రాచి రంపాన పెడుతున్నాకదా చెప్పవే అంటుంది. మీ అబ్బాయి ఉన్నాడని చూసుకోకుండా మాట్లాడింది మీరే మధ్యలో నన్నెందుకు లాగుతున్నారని అడుగుతుంది. నీ గొప్పకోసం ఆ డబ్బుడమ్మ ఫంక్షన్ కి అన్నీ కొనాల్సిన అవసరం నాకేంటని ప్రశ్నిస్తాడు. ఎవరి పనులపై వాళ్లు వెళ్లండి అని పంపించేస్తాడు సత్యం.
తాళి మార్చే ఫంక్షన్ కి మౌనికను పిలవాలని అనుకుంటారు సత్యం ఫ్యామిలీ. సత్యం, ప్రభావతి ఇద్దరూ కలసి మౌనిక అత్తారింటికి వెళతారు. ఎప్పటిలా మౌనిక అత్తింటివారు అవమానిస్తారు. ప్రభావతి, సత్యం ఏమీ మాట్లాడుకోలేక ఆగిపోతారు. ఎందుకింత గొడవ నేను రాకపోతే తాళి మార్చే ఫంక్షన్ ఆగిపోతుందా? నేను రాను అనేస్తుంది మౌనిక.
గుండెనిండా గుడిగంటలు జూన్ 26 ఎపిసోడ్ లో బాలుని టార్గెట్ చేస్తారు శ్రుతి తల్లి, రోహిణి. ఏం జరుగుతుందో చూడాలి






















