Gunde Ninda Gudi Gantalu June 24th Episode : శ్రుతి ఫంక్షన్ లో హైడ్రామా , బాలుని అవమానించేందుకు శోభ ప్లాన్ - గుండె నిండా గుడి గంటలు జూన్ 24 ఎపిసోడ్
Gundeninda GudiGantalu Today episode: బాలుకి కారు కొనిచ్చి సర్ ప్రైజ్ చేస్తుంది మీనా. ఇదంతా చూసి రగిలిపోయిన ప్రభావతి రోహిణిని టార్గెట్ చేస్తుంది. గుండెనిండా గుడిగంటలు ఈరోజు ఎపిసోడ్ లో ఏంజరిగిందంటే

గుండెనిండా గుడిగంటలు జూన్ 24 ఎపిసోడ్
శృతికి తాళి మార్చే ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది శ్రుతి తల్లి. అయితే ఈ ఫంక్షన్ కి బాలు రాకూడదు అనే కండిషన్ పెడుతుంది. ప్రభావతి అదే విషయాన్ని సత్యానికి చెబుతుంది. కనీసం తల్లిలా మట్లాడండి అంటుంది మీనా. ఫైర్ అవుతుంది ప్రభావతి. ఇంతలో మనోజ్ వచ్చి..హమ్మయ్య వీడు వస్తే ఇన్ డీసెంట్ గా బిహేవ్ చేస్తాడు రాకపోవడమే మంచిది అంటుంది మనోజ్. అంటే ఏంటని బాలు అడిగితే సభ్యత లేకుండా అని అర్థం అంటుంది రోహిణి. తండ్రి డబ్బులు లక్షలు మింగడం సభ్యతా? పెళ్లానికి హల్వా కొనిపెట్టలేక పక్కవాళ్లు తీసుకొచ్చిన హల్వా తినడం సభ్యతా? అని ఇచ్చిపడేస్తాడు.
ఇంతలో శ్రుతి - రవి వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. బాలుని రావొద్దన్నారని మీనా చెబుతుంది. పెళ్లి ఎలాగూ మీ అందరి మధ్యా జరగలేదు. మాకంటూ మొదటిసారి జరుగుతున్న ఫంక్షన్ ఇది అందరూ రాకపోతే ఎలా అంటుంది శ్రుతి. మీనా నువ్వు మంచి మనసుతో ఆశీర్వదిస్తావనే కదా నీకు అబద్ధం చెప్పి తీసుకెళ్లాం నువ్వు రాకపోతే ఎలా అంటుంది శ్రుతి. నా భర్తకి విలువ ఇవ్వని ప్రదేశానికి నేను రావడం సరికాదు అంటుంది మీనా. నేను మా మమ్మీతో మాట్లాడుతాను అందరం కలసి ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకుంటాం అని చెబుతుంది. భర్త రాకుండా భార్య వెళ్లను అంటోంది.. కొడుకు రాకుండా తండ్రి రానంటున్నాడు.. అన్నదమ్ములు లేకుండా వాళ్లు వెళ్లనంటున్నారు.. భర్త రాకుండా నువ్వు వెళతాను అంటే వెళ్లు అంటాడు సత్యం. అందరం కలసే వెళదాం అనుకుంటారు.
ప్రభావతి కాల్ చేసి అందరం వస్తున్నాం అంటుంది. బాలు మీరు చెప్పినా వినలేదా..మీ మాటకు ఇంతేనా విలువ అని అడుగుతుంది? మీ కుటుంబంలో అందరం రావడం ఓకే కానీ ఫంక్షన్లో ఏదైనా జరిగితే మా పరువు పోతుంది అంటుంది ప్రభావతి. మీరు ఏదోదో చెబుతున్నారు కానీ నాకు మనసు అంగీకరించడం లేదంటుంది శ్రుతి తల్లి. నేను హామీ ఇస్తున్నా బాలు గొడవ చేయడు అంటుంది ప్రభావతి. కాల్ కట్ చేసి నవ్వుకుంటుంది శోభ. ఏంటి ఒక్కదానివే నవ్వుకుంటున్నావ్ అని అడిగితే...మనం అనుకున్నది జరగాలంటే ప్రభావతిని గ్రిప్ లో పెట్టుకుంటే చాలు అంటుంది. ఫంక్షన్ కి అందరూ వస్తున్నారు.. అయినా ఈ ఫంక్షన్ కి బాలు వచ్చితీరాలి..వాడు వస్తేనే మనం అనుకున్నట్టు గొడవ చేస్తాడు. ఆ సిట్యుయేషన్ ని మనకు అనుకూలంగా మార్చుకుని..ఇలాంటి వాడు ఉన్న ఇంట్లో నా కూతురు ఉంటే సంతోషంగా ఉండదు, సెక్యూరిటీ ఉండదని చెప్పి మన అమ్మాయిని అల్లుడిని ఇంటికి తీసుకొచ్చేయాలి అంటుంది. బాలుని ఎలా రెచ్చగొట్టాలో నాకు ఐడియా ఉంది అంటుంది శోభ.
మీనా వంట చేస్తుంటే ప్రభావతి వెళ్లి ఏదేదో మాట్లాడుతుంది. వాడిని ఫంక్షన్ కి రావొద్దని చెబితే నువ్వు రానంటున్నావ్ ఏంటి అంటుంది. మావయ్యగారికి విలువనివ్వని దగ్గరకు మీరు వెళతారేమో నేను నా భర్తని అవమానించిన చోటుకి నేను వెళ్లను అంటుంది. కారు డ్రైవర్ ని పెళ్లి చేసుకుని ఆకాశంలో తేలుతున్నావ్.. మనోజ్ లాంటి డిగ్రీలు చేసినవాడిని పెళ్లి చేసుకుంటే భూమ్మీద ఉండేదానివి కాదేమో అంటుంది. డిగ్రీలు చేసి ఏం లాభం పార్కులో పల్లీలు తినడానికి తప్ప దేనీకీ పనికిరారు..నా భర్తకేం చదువుకోపోయినా తన కాళ్లపై తాను నిలబడుతున్నాడు అంటుంది. అక్కడ గొడవ చేస్తే ఊరుకోను అంటుంది ప్రభావతి. ఎవరూ రెచ్చగొట్టనంతవరకూ నా భర్త మాట్లాడడు.. ఎవరైనా ఏమైనా అంటే మాత్రం చూస్తూ ఊరుకోరు అంటుంది మీనా.
మేడపై ఉన్నబాలు దగ్గరకు వెళ్లిన మీనా..శ్రుతి ఫంక్షన్లో మీరు ఎవరితోనూ గొడవపడొద్దు అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటాడు బాలు. అక్కడ ఏమైనా గొడవ జరిగితే మీరు తొందరపడి ఎవర్నీ ఏమీ అనొద్దు అంటుంది మీనా. నా నోటికి ప్లాస్టర్ వేసుకోనా అని మండిపడతాడు బాలు
మీనా సర్దిచెప్పడంతో...నాన్న గురించి నీ గురించి మాట్లాడితే ఊరుకోను అంటాడు బాలు.
డబ్బులుంటే సగం సమస్య తీరిపోతుందని భావించి రోహిణి తల్లికి కాల్ చేస్తుంది. డబ్బులు ఏమైనా దాచావా అని అడిగితే.. ఏమీ లేవని చెప్పిన తల్లి ఓ నగ ఉంది అది తీసుకొస్తాను అంటుంది. ఇప్పటికిప్పుడు టెన్షన్ నుంచి బయటపడితే చాలు అంటుంది రోహిణి. నాన్న టాపిక్ డైవర్ట్ చేయాలంటే ఇంకేదైనా ఇష్యూ క్రియేట్ చేయాలి దాన్ని హైలెట్ చేయాలని ప్లాన్ చేస్తుంది రోహిణి.
గుండెనిండా గుడిగంటలు జూన్ 25 ఎపిసోడ్ లో... శ్రుతి రోహిణి ఫంక్షన్ కి మౌనికను ఆహ్వానిద్దామని వెళతారు సత్యం ఫ్యామిలీ. అవమానిస్తాడు సంజయ్. నేను రాకపోతే ఫంక్షన్ ఆగిపోతుందా అని నో చెబుతుంది మౌనిక






















