Gunde Ninda Gudi Gantalu June 23rd Episode : బాలుని అవమానించిన ప్రభావతిపై శ్రుతి ఫైర్ - గుండె నిండా గుడి గంటలు జూన్ 23 ఎపిసోడ్
Gundeninda GudiGantalu Today episode: బాలుకి కారు కొనిచ్చి సర్ ప్రైజ్ చేస్తుంది మీనా. ఇదంతా చూసి రగిలిపోయిన ప్రభావతి రోహిణిని టార్గెట్ చేస్తుంది. గుండెనిండా గుడిగంటలు ఈరోజు ఎపిసోడ్ లో ఏంజరిగిందంటే

గుండెనిండా గుడిగంటలు జూన్ 23 ఎపిసోడ్
తమ రూమ్ ని తల్లిదండ్రులకు ఇచ్చేసి బాలు-మీనా హాల్లోనే నిద్రపోతారు. పూలమ్మిన డబ్బులు దాచి కారుకోసం అడ్వాన్స్ ఇస్తుంది మీనా. తనకు నచ్చిన కారు కొనిచ్చిన మీనాకు థ్యాంక్స్ చెబుతాడు బాలు. స్వీట్స్, పూలు తీసుకొచ్చి ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. ఓసారి ప్రభావతి వస్తుంది, మరోసారి శ్రుతి వచ్చి బిర్యానీ ఆర్డర్ చేసుకుని తింటుంది, ఇంకోసారి మనోజ్ - రోహిణి వస్తారు. బాలు తీసుకొచ్చిన స్వీట్స్ అన్నీ మనోజ్ తినేసి వెళ్లిపోతాడు..బాధపడతాడు బాలు. ఇక అంతా వచ్చి వెళ్లిపోయారులే అనుకుంటారు కానీ మళ్లీ ప్రభావతి కిందకు దిగుతుంది. శ్రుతి తీసుకొచ్చిన బిర్యానీ ఫుల్లుగా కుమ్మేస్తుంది ప్రభావతి..అది అరగక ఇబ్బంది పడుతుంది. రూమ్ లో కాసేపు తిరుగు అని సత్యం చెబితే..ఇదేమైనా పార్కా..చిన్న రూమ్ ఎలా తిరుగుతాను ఇక్కడ హాల్లోకి వెళతాను అంటుంది. అక్కడ వాళ్లని పదే పదే ఎందుకు ఇబ్బంది పెడతావని సత్యం చెప్పినా పట్టించుకోదు. కావాలనే విజిల్ ఊదుతూ హాల్లోకి వెళుతుంది. గూర్ఖాలా ఇల్లంతా విజిల్ వేసుకుంటూ తిరుగుతోందేంటని శ్రుతి చికాకుపడుతుంది. ఎవరికి వారు రూమ్ లో పడుకుంటారు కానీ బాలు మీనా ఇబ్బందిని ఎవరూ పట్టించుకోరు. పైగా పదే పదే తిరుగుతూ డిస్ట్రబ్ చేస్తుంటారు.
కూతురిని, అల్లుడిని తమతో పాటూ శాశ్వతంగా తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసిన శ్రుతి తల్లి ప్రభావతి ఇంటికి వస్తుంది. నల్లపూసలు గుచ్చే కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నామని చెబుతుంది. అప్పుడే అటువైపు వచ్చిన రోహిణిని కూడా పిలిచి ఆ విషయం చెబుతుంది. ఫంక్షన్ మొత్తం తనింట్లోనే జరుగుతుందని..ఖర్చంతా తామే భరిస్తామని చెబుతుంది శ్రుతి తల్లి. హమ్మయ్య అనుకుంటుంది ప్రభావతి. అయితే ఈ ఫంక్షన్ పేరుతో సత్యం ఇంట్లో గొడవలు సృష్టించాలని ప్లాన్ చేస్తుంది రవి అత్తయ్య. అందుకోసం బాలుని టార్గెట్ చేయాలి..చిన్న మాట అంటే రెచ్చిపోతాడు కాబట్టి గొడవ చేయించి హడావుడి చేయాలనుకుంటుంది. ఇందులో తొలి అడుగుగా..బాలుని అసలు ఫంక్షన్ కి రానివ్వకూడదు అనే కండిషన్ పెడుతుంది. అప్పట్లో మౌనిక నల్లపూసల కార్యక్రమానికి కూడా బాలు ఉండకూడదు అనే కండిషన్ వాళ్లు పెడతారు. సరే అనిబయటకు వెళ్లిపోతున్న బాలుని వెనక్కు పిలిచి అవమానించేందుకు ప్లాన్ చేసుకుంటాడు సంజయ్..తీరా బోల్తా పడతాడు. ఇప్పుడు కూడా అదే జరిగేలా ఉంది
శ్రుతి తల్లి వేసిన ప్లాన్ ని శ్రుతి తప్పికొడుతుందేమో చూడాలి. ఎందుకంటే బాలు ఆ ఫంక్షన్ కి రాకూడదు అని ఆమె కండిషన్ పెట్టినట్టు భర్త సత్యానికి చెబుతుంది ప్రభావతి. నా కొడుకుని వద్దన్న చోటుకి నేనూ కూడా రాను అంటాడు సత్యం. నా భర్తని వద్దన్న చోట నేను కూడా ఉండలేను అనేస్తుంది మీనా. షాక్ అవుతుంది ప్రభావతి. ఇంతలో అక్కడకు వస్తారు రవి-శ్రుతి. ఏంటి మాట్లాడుతున్నారు మీరు.. అందరితోపాటూ బాలు-మీనా కూడా ఉంటేనే ఈ ఫంక్షన్ జరుగుతుందని తేల్చి చెబుతుంది శ్రుతి. ప్రభావతిలో కంగారు మొదలవుతుంది. మొదట్లో ఇలా ముందరికాళ్లకు బంధం వేసి..ఆ తర్వాత ఫంక్షన్ లో గొడవ చేసి బాలుని చెడు చేయాలన్నది శ్రుతి తల్లి ప్లాన్. మరి ఈ ప్లాన్ ని మీనా ఎలా ఎదుర్కొంటుంది? ఎప్పటిలా శ్రుతి సపోర్ట్ చేస్తుందా? బాలు రియాక్షన్ ఎలా ఉండబోతోంది? . మరోవైపు శ్రుతి ఫంక్షన్ తో పాటూ రోహిణి నల్లపూసలు గుచ్చే కార్యక్రమం చేయాలని పట్టుబట్టింది ప్రభావతి. మీనాన్నని మలేషియా నుంచిపిలువు అని కండిషన్ పెట్టింది. ఇన్నాళ్లూ అబద్ధాలు చెబుతూ నెట్టుకొస్తున్న రోహిణి ఇప్పుడేం చేస్తుంది? మరో జూనియర్ ఆర్టిస్టును దింపుతారా? నిజం బయటపెట్టి అత్త చేతిలో బలవుతుందా? ఈ వారం ఎపిసోడ్స్ లో ఇవే హైలెట్ కాబోతున్నాయ్.






















