Gruhalakshmi November 14th Today Episode: తులసి జోలికి వస్తే ఊరుకునేది లేదు.. నందూకి దీపక్ వార్నింగ్!
Gruhalakshmi Serial Today Episode : తులసి జీవితంలోకి మళ్లీ రావాలని ప్రయత్నిస్తే బాగోదు అంటూ నందూకి తులసి తల్లి, తమ్ముడు హెచ్చరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Intinti Gruhalakshmi Serial November 14th Episode : నందు తులసి అమ్మ, తమ్ముడితో ఒంటరిగా మాట్లాడుతూ తన మనసులో మాట చెప్పేయాలి అనుకుంటాడు. అందుకు సరైన టైం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో దీపక్ ఒంటరిగా కనిపిస్తే అక్కడికి వెళ్లి నీతో మీ అమ్మతో మాట్లాడాలి మీ అమ్మను ఇక్కడికి తీసుకురా అని చెప్తాడు. ఇక దీపక్, వాళ్ల అమ్మని తీసుకెళ్తాడు.
నందు: తులసి విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు ఆ తప్పు సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను.
అత్తయ్య: దిద్దుకోలేని తప్పులు చాలా ఉంటాయి. ఇప్పుడు నువ్వు చేసింది అలాంటిదే.
నందు: మరీ అలా మాట్లాడకండి అత్తయ్య, నేను మళ్లీ తులసితో జీవితం పంచుకోవాలి అనుకుంటున్నాను. తులసితో ఈ మాట చెప్పాలి అనుకున్నా కాని భయం వేసింది.
అత్తయ్య: ఒక విషయం తెలుసుకోండి నందగోపాల్ గారు. విడాకులు ఇచ్చి ఇన్నేళ్లు అయినా తులసి మీ తప్పు క్షమించలేదు అంటే ఇక జీవితంలో క్షమించదనే అర్థం. మళ్లీ దగ్గర అవ్వాలని ప్రయత్నించకండి. దాన్ని అలా సంతోషంగా ఉండనివ్వండి.
నందు: మళ్లీ అలా జరగనివ్వకుండా చూసుకుంటా. తులసిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా.
దీపక్: నిజానికి మా అక్క మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం మీ అదృష్టం కానీ మీరు ఆ అదృష్టాన్ని దూరం చేసుకున్నారు.
అత్తయ్య: దేవుడు ఒక్కసారే వరం ఇస్తాడు. మీరు దాన్ని నేలపాలు చేసుకున్నారు. తులసి ఇక ఎట్టిపరిస్థితుల్లోనూ మీతో జీవితం పంచుకోదు. తులసిని మిమ్మల్ని మళ్లీ ఒకటి చేయడం జరగదు. ఒకసారి అలాంటి తప్పే చేసి ఇప్పటికీ బాధ పడుతున్నా. ఇంకోసారి మళ్లీ ఆ తప్పు చేయను. అసలు తులసి నిన్ను నమ్ముతుందని ఎలా అనుకుంటున్నావు.
నందు: అది కాదు అత్తయ్య తులసి నన్ను నమ్ముతుంది. ఆఫీస్‌లో నేనే తనకు కుడి భుజంగా ఉంటున్నాను. నమ్మకం అంటే నమ్మకమేగా ఏ విషయంలోనూ అది ఒక్కటేగా. అత్తయ్య గారు మీ మీదే ఆశలు పెట్టుకున్నాను. తులసిని నన్ను మీరే కలుపుతారు అనుకున్నాను.
అత్తయ్య: ఒకటి కాదు రెండు కాదు తులసి మీతో 25 ఏళ్లు నరకం అనుభవించింది. మిమ్మల్ని వదిలేశాక అది ప్రశాంతంగా ఉంది. మీ కారణంగా దానికి పెళ్లి అంటే భయం పట్టుకుంది.
దీపక్: మా అక్క జోలికి వెళ్లొద్దు.
నందు: మీకు ఇష్టం లేకపోతే లేదు అని చెప్పండి అంతే కానీ తన జోలికి వెళ్లొద్దు అని మాత్రం చెప్పొద్దు అని నందు అక్కడి నుంచి వెళ్లి పోతాడు.
దివ్య తన భర్త చెప్పినట్లు పసుపు రంగు చీర కట్టుకుంటుంది. తర్వాత దివ్య రిషెప్షన్ దగ్గరకు వెళ్లి గుడి ఎక్కడ ఉంది అని అడుగుతుంది. అయితే దివ్య 5 నిమిషాల్లో వస్తానని ఇంకా రాకపోవడంతో తన భర్త విక్రమ్ వెతుక్కుంటూ బయటకు వస్తాడు. ఇక ప్లాన్ ప్రకారం విక్రమ్ మరదలు దివ్య కట్టుకున్న లాంటి చీర కట్టుకొని అఖిల్‌తో చనువుగా మాట్లాడుతుంది. దీంతో విక్రమ్ అది దివ్య అనుకొని దివ్యపై అనుమానం పెంచుకుంటాడు. దివ్యతో ఆ విషయంలో గొడవ పడతాడు. దీంతో దివ్య కోపంతో వెళ్లిపోతుంది.
తులసి, హనీ సందడిగా ఇళ్లంతా దీపాలు పెడతారు. మరోవైపు నందు డల్‌గా ఉంటాడు. అది చూసి వాళ్ల నాన్న వచ్చి ఏమైందని అడుగుతాడు. ఇక తులసి పైన దీపం పెట్టాలని ట్రై చేస్తుంది అందకపోవడంతో నందు వచ్చి పెడతాడు. నందు తులసితో చనువుగా ఉంటాడు. అది చూసి తులసి వాళ్ల అమ్మ నందు తల్లిదండ్రులతో మీ నందు తులసి జీవితంలోకి మళ్లీ రావాలని చూస్తూ పెద్ద తప్పు చేస్తున్నాడని చెప్తుంది. దీంతో వాళ్లు షాక్ అవుతారు. తులసిని బాధ పెట్టాలని చూస్తే మాత్రం మేము ఊరుకోము. పుట్టింటికి తీసుకెళ్తామని చెప్తుంది.
దివ్య: ఇదేనా నీకు నా మీద ఉన్న నమ్మకం.
విక్రమ్: నాకళ్లతో చూసింది చెప్పా అది తప్పా.
దివ్య: కళ్లతో చూసేదంతా నిజం కాదు మిస్టర్. మాట అనే ముందు ఆలోచించి మాట్లాడాలి. కట్టుకున్న భార్యనే అనుమానిస్తావా. కట్టుకున్న భర్త అనుమానించాడు అంటే ఇక ఆ భార్య బతుకు అనవసరం.
విక్రమ్: అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు దివ్య. ఇక ఈ విషయం వదిలేద్దాం.
దివ్య: అంతా నీ ఇష్టమేనా నువ్వు మీ ఇంటికి వెళ్లు. నేను మా ఇంటికి వెళ్తా. తొందరపడి మాట అనొచ్చు అది తప్పుకాదా. నా గుండె కోత విలువ ఇంతేనా. నాకు నీ మీద నమ్మకం పోయింది. అంటూ దివ్య ఏడుస్తుంది. మరోవైపు నందు హాల్‌లో డల్‌గా కూర్చొని ఉంటే వాళ్ల అమ్మ వచ్చి టీ ఇస్తుంది. దీంతో నందు వద్దని నా మనసు చెప్పినట్లు నేను వినకూడదు. నడుచుకోవద్దు. ఎవరు ఏం చెప్పినా వినాలి. తలవంచుకోవాలి అంటాడు దీంతో అనసూయ షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.