Gruhalakshmi December 1st Episode : ‘గృహలక్ష్మీ’ సీరియల్: సంజయ్ కోసం ఇంటికొచ్చిన పోలీసులు - షాకింగ్ నిర్ణయం తీసుకున్న తులసి
Gruhalakshmi Serial Today Episode: సంజయ్ అబార్షన్ కేసులో అరెస్టు చేయడానికి పోలీసులు రావడంతో ఇవాళ్టి ఏపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.
Gruhalakshmi Telugu Serial Today Episode: నందగోపాల్ ఇంటికి వచ్చి ఇంట్లోనే మందు తాగుతుంటే హని వచ్చి ఎందుకు మందు తాగుతున్నారు అని అడుగుతే హనిని తిడతాడు నందగోపాల్. దీంతో అనసూయ ఆమె భర్త ఇద్దరూ నందను తిడతారు. ఇంట్లో మందు తాగడం తులసి చూస్తే బాగోదని హెచ్చరిస్తారు. అయితే తులసి వల్లే తాను మందు తాగాల్సిన పరిస్థితి వచ్చిందని నందగోపాల్ బాధగా చెప్తాడు. ఇంతలో తులసి వస్తుంది. నందగోపాల్ మందు తాగడం చూసి సీరియస్ అవుతుంది. ఇంట్లో ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకునేది లేదని హెచ్చిరించి హనీని తీసుకుని వెళ్తుంది తులసి.
విక్రమ్ వాళ్ల ఇంట్లో అందరూ హాల్లో కూర్చుని ఉంటారు ప్రియ ఏడుస్తూ ఉంటుంది.
విక్రమ్: చేసేదంతా చేసాక ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం. వాడు నిన్ను ఫోర్స్ చేసినప్పుడే నువ్వు మాకు చెప్పి ఉండాల్సింది. ఎందుకు దాచావ్..
ప్రియ: ఈ విషయం ఎవరికైనా చెబితే నన్ను వదిలేస్తానన్నాడు.
దివ్య: ఇలాంటి పశువుతో కాపురం చేసేకన్నా వదిలేయడమే మంచిది. ఎంతకాలం నరకం అనుభవిస్తావ్
అత్తగారు: సర్ధి చెప్పేది పోయి నువ్వే రెచ్చగొడతావేంటి? ప్రియ నువ్వు లోపలికి వెళ్లు.
దివ్య: ఎందుకెళ్లాలి అత్తయ్య. ఏడవని అందరి ముందు తనివితీరా ఏడవనివ్వండి. ఆయనగారి గొప్పతనం అందరికీ తెలియాలిగా..
అంటూ దివ్య కోపంగా చెప్తుండగానే అక్కడికి పోలీసులు వస్తారు. సంజయ్ మీద దివ్య కంప్లైంట్ ఇంచిందని అందుకే వచ్చినట్లు ఎస్పై చెప్పగానే అందరూ షాక్ అవుతారు. అంతా సర్ధుకున్నాక ఇంకా గొడవలెందుకని దివ్య వాళ్ల అత్తయ్య చెప్తుంది. లేదని సంజయ్ శిక్ష అనుభవించాల్సిందేనని దివ్య అనడంతో.. వాళ్ల అత్తయ్య విక్రమ్ ను పక్కకు తీసుకెళ్లి దివ్యకు నువ్వె చెప్పి.. సంజయ్‌ను ఎలాగైనా ఈ కేసులోంచి కాపాడమని అడుగుతుంది. అయితే నీతో పాటు నేను బాధపడటం తప్పా నేనేమి చేయలేనని తనను క్షమించమని చెప్తాడు విక్రమ్.
దివ్య: విక్రమ్ అవతల ఎస్సై గారు వెయిట్ చేస్తున్నారు. సంజయ్ ని తీసుకెళ్లడానికి రెడీగా ఉన్నారు.
విక్రమ్: సంజయ్ చేసింది తప్పే ఎవ్వరూ సమర్థించరు? నేను సమర్థించను
దివ్య: మరేంటి ఆలోచిస్తున్నారు. ఎస్సై గారిని ఆయన డ్యూటీ ఆయన్ను చేయనివ్వండి. ఎందుకు ఆగమన్నారు.
విక్రమ్: సంజయ్ పక్షాతాప పడుతున్నాడు. ఇలాంటి తప్పు మరోసారి చేయనంటున్నాడు కదా.. వాణ్ని క్షమించి వదిలేయమని అడుగుతుంది.
దివ్య: క్షమించేస్తున్నారా? వదిలేస్తున్నారా? నరకయాతన అనుభవించిన ప్రియ బాధ పట్టించుకోరా? ఆడదాని కన్నీటికి విలువ లేదా? తన కష్టానికి ఆ కడుపుకోతకు బాధ్యులైన వారిని కాలర్ ఎగరేసుకుంటూ తిరగమని వదిలేస్తారా? అలా అని అత్తయ్యగారికి మాటిచ్చారా?
విక్రమ్: లేదు దివ్య నిర్ణయం తీసుకునే హక్కు నాకు లేదని చెప్పాను.
అని ఈ విషయంలో నిర్ణయం తీసుకునేది ప్రియ. నష్టం జరిగింది ప్రియకు అంటూ ప్రియను తన నిర్ణయం చెప్పమని అడుగుతాడు విక్రమ్. అరేయ్ నువ్వు మారావని ప్రియకు ఎలా తెలుస్తుంది. వెళ్లి ప్రియ కాళ్ల మీద పడి క్షమాపణ కోరమని బసవయ్య సంజయ్‌కు చెప్పడంతో సంజయ్, ప్రియ కాళ్లపై పడి క్షమించమని ప్రాదేయపడతాడు. దీంతో కన్విన్స్ అయిన ప్రియ, సంజయ్‌ని క్షమిస్తున్నానని చెప్పి ఏడుస్తూ లోపలికి వెళ్తుంది.
విక్రమ్: ఎస్సైగారు బాధితురాలి నిర్ణయం విన్నారు కదా!
ఎస్సై: విన్నాం. కానీ క్షమించినంత మాత్రాన అతని తప్పు ఒప్పై పోదు కదా! మీ తమ్ముడు నేరస్తుడు కాకుండా పోడు కదా?
విక్రమ్: ఒప్పుకుంటాను కానీ ప్రియ మీకు డైరెక్టుగా కంప్లైంట్ ఇవ్వలేదు. పైగా అంత తన ఇష్టపూర్వకంగానే జరిగిందని హాస్పిటల్‌లో సైన్ కూడా చేసింది. ఇప్పుడు ఏ ఆధారంతో సంజయ్‌ను అరెస్ట్ చేస్తారు. ఇష్యూ మామధ్యనే సెటిల్ అయింది కాబట్టి దయచేసి మీరు వెళ్ళండి.
అని విక్రమ్ చెప్పగానే పోలీసులు వెళ్లిపోతారు. సంజయ్ ఇకనుంచి హాస్పిటల్‌కు వెళ్లొద్దని మామయ్యతో పాటు ఇంటి పనులు చూసుకోవాలని విక్రమ్ ఆర్డర్ పాస్ చేస్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. తులసి హారతి తీసుకుని వస్తుంటే కాళ్లకు తాగిపడేసిన మందు సీసాలు తగులుతాయి. బెడ్‌రూంలోకి చూస్తే లోపల నందగోపాల్ తాగిపడిపోయి కనిపిస్తారు. ఇంతలో అనసూయ ఆమె భర్త అక్కడకు వచ్చి ఖాళీ సీసాలు తీస్తుంటే..
తులసి: ఆగండి మామయ్య.. ఆ బాటిల్‌ను ముట్టుకోకండి వదిలేయండి. ఈ ఇంటికి దౌర్బాగ్యం పట్టుకుంది. భరించాల్సిందే.. అరిష్టాలు అనుభవించాల్సిందే..
అంటూ తులసి బాధపడుతూ లోపలికి వెళ్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply