Gruhalakshmi September 9th Episode: జాహ్నవి ఎంట్రీతో దివ్యకి కష్టాలు, తులసిని సైడ్ చేసేందుకు రత్నప్రభ స్కెచ్
విక్రమ్, దివ్యలని విడగొట్టడానికి రాజ్యలక్ష్మి మేనకోడలిని రంగంలోకి దింపుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Gruhalakshmi September 9th Episode: దివ్యతో దూరం పెంచుకోవద్దని సర్దుకుపోవాలని అదే జీవితమంటే అని ప్రకాశం కొడుక్కి నచ్చజెప్పడానికి చూస్తాడు. మనసు విరిగిపోయిందని, దివ్యకి ప్రేమ అనే మాటకి అర్థం తెలియదని విక్రమ్ బాధగా చెప్తాడు.
ప్రకాశం: మనసు మార్చుకుని తిరిగి వచ్చిందని, కుటుంబం కోసం ఎంతగా ఆరాటపడుతుందో కనిపించడం లేదా? ఎవరు ఏమన్నా మౌనంగా భరిస్తుంది. నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఇంక ఏం చేయాలి. తన ప్రేమని ఎలా నిరూపించుకోవాలి. నీ మనసులో దివ్య అంటే ఇష్టం ఉంది పైకి చెప్పకుండా దాచుకుంటున్నావ్. ప్రేమ ఉంది కాబట్టే తను చెప్పినట్టు వింటున్నావ్ సలహాలు పాటిస్తున్నావ్. నీ మనసు విరిగిపోవడం కాదు అది ఎవరికీ కనిపించకుండా ముసుగువేసుకుంటున్నావ్ ఒప్పుకో అనేసరికి విక్రమ్ అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతాడు.
హనీ బాధగా కూర్చుని ఉంటే రత్నప్రభ కూతురు స్వీటీ వచ్చి ఆడించేందుకు చూస్తుంది. సామ్రాట్ గురించి నిజం చెప్పేయాలని రత్నప్రభ ప్రయత్నిస్తుంది. పెద్దాయన ముందు హనీ మీద కపట ప్రేమ చూపిస్తుంది. ఇక నుంచి మమ్మీ, డాడీ అన్నీ మేమే అంటుంది.
Also Read: తల్లికి నిజం చెప్పేసిన రాజ్, కనకానికి దొరికిపోయిన రాహుల్ - స్వప్నను చంపించే కుట్రలో రుద్రాణి!
ధనుంజయ్: సామ్రాట్ కి కనిపించే ఆస్తి మాత్రమే కాదు కనిపించని ఆస్తి చాలా ఉంది
రత్నప్రభ: అవును ఆ ఆస్తి మొత్తం హనీకి. తనకి ఇప్పుడు రక్త సంబంధీకులం మనం తప్ప ఎవరూ లేరు. జాగ్రత్తగా డీల్ చేస్తే ఈ ఆస్తి మనది అవుతుంది
ధనుంజయ్: జరిగే పనేనా ఇది
రత్నప్రభ: జరిగి తీరాలి. చేతకాని బిజినెస్ పెట్టి అప్పుల పాలు చేశావు. నీకు బిజినెస్ చేయడం చేతకాదు. సామ్రాట్ ని పైకి పిలిపించుకుని దేవుడు మనకి ఒక అవకాశం ఇచ్చాడు. దీన్ని వాడుకోకపోతే మనం బాగుపడం. ఫస్ట్ స్టెప్ హనీని మనం గ్రిప్ లో పెట్టుకుని మన మాట వినేలా చేసుకోవాలి. ముసలాయనకి హనీని మనం కళ్ళలో పెట్టుకుని చూసుకుంటున్నట్టు నటించాలి
ధనుంజయ్: హనీ ప్రవర్తన చూస్తుంటే అది జరిగేలా లేదు
రత్నప్రభ: అయితే లేపేద్దామా? ఆలోచిస్తూ కూర్చుంటే పరిస్థితులు చేజారిపోయి తులసి అడ్డుపడొచ్చు. సామ్రాట్ కి బిజినెస్ లో ఇంట్లో తులసికి ఉన్న విలువ వేరు. తను ఉన్నా లేకపోయినా తులసి విలువ మారదు. నెమ్మదిగా విలువ తగ్గించాలి. సైలెంట్ గా తులసిని ఈ ఇంటిని దూరం చేయాలి. హనీ తులసి నీడలో ఉన్నంత వరకు మనం ఏం చేయలేము.
హనీ దగ్గర కాసేపు ఉండొచ్చు కదా అని నందు తులసితో అంటాడు. టిఫిన్ పెట్టేసి వచ్చానని అంటుంది. యూఎస్ నుంచి సామ్రాట్ కజిన్ బ్రదర్ ఆయన భార్య వచ్చారు. ఇక నుంచి హనీ బాధ్యతలు, ఇంటి బాధ్యతలు చూసుకుంటారు ఇక నా అవసరం అక్కడ లేకపోవచ్చని చెప్తుంది.
నందు: బిజినెస్, ఇంటి వ్యవహారాల్లో మనం జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు. ఏదైనా అయితే మధ్యతరగతి వాళ్ళం మన మీద నింద వేస్తారు
తులసి: నా బాధ అంతా హనీ గురించి. తనని సామ్రాట్ కంటికి రెప్పలా చూసుకున్నారు. ఇప్పుడు ఆయన దూరమై హనీని బాధపెడుతున్నారు
ఎప్పటిలాగే వైరాగ్యంతో బాధపడుతూ మాట్లాడుతుంది. తన మనసు మార్చి ప్రేమ గురించి చెప్పాలని నందు డిసైడ్ అవుతాడు. తమ కూతురు రాబోతుందని బసవయ్య దంపతులు తెగ సంతోషపడుతూ ఉంటారు. రాజ్యలక్ష్మితో వియ్యం అందుకోబోతున్నామని బసవయ్య మురిసిపోతాడు. అప్పుడే కూతురు జాహ్నవి ఎంట్రీ ఇస్తుంది. ప్రసన్న దిష్టి తీసి కూతుర్ని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. రాగానే అత్తయ్య అంటూ రాజ్యలక్ష్మి దగ్గరకి వెళ్ళి కౌగలించుకుంటుంది.
Also Read: 'గృహలక్ష్మి'లోకి కొత్త క్యారెక్టర్లు- సామ్రాట్ ఆస్తి కాజేసేందుకు ధనుంజయ్ కుట్ర!
రాగానే రాజ్యలక్ష్మికి బిస్కెట్స్ వేస్తుంది. తను వచ్చానని గట్టిగా అరిచి ఇంట్లో అందరినీ బయటకి పిలుస్తుంది. ఇంట్లో అందరినీ పెద్ద కోడలు మార్చేసిందని చెప్పడంతో జాహ్నవి మొహం మాడ్చుకుంటుంది. విక్రమ్ రాగానే తనని పట్టుకుని అటూ ఇటూ తిప్పుతూ కౌగలించుకుంటుంది. విక్రమ్ బుగ్గలు పట్టుకుని క్యూట్ గా ఉన్నావ్ ముద్దు వచ్చేస్తున్నావ్ అంటుంది. అది కూడా పెద్ద కోడలు మహత్యమేనని ప్రకాశం అనేసరికి జాహ్నవికి కోపం వస్తుంది. దివ్యని పరిచయం చేసుకుంటుంది.
జాహ్నవి: మీ పెయిర్ సూపర్ గా ఉంది
దివ్య: ఆ మాట నాకు కాదు మీ బావకి చెప్పు
వెంటనే జాహ్నవి కోపంగా విక్రమ్ కాలర్ పట్టుకోవడంతో అందరూ షాక్ అవుతారు. జాహ్నవి ఏంటి జాను అని కదా పిలిచేది అంటుంది. విక్రమ్ హాస్పిటల్ కి వెళ్తానంటే కుదరదని అనేసరికి దివ్య సరేనని ఒక్కతే వెళ్ళిపోతుంది. వచ్చిన మొదటి రోజే కూతురు విక్రమ్, దివ్యని విడదీసిందని సంబరపడిపోతారు.
తరువాయి భాగంలో..
విక్రమ్, జాహ్నవి నవ్వుకుంటూ ఒకరి మీద ఒకరు పడుతుంటే దివ్య చూస్తుంది. పక్కనే రాజ్యలక్ష్మి కూడా ఉంటుంది. చూడముచ్చటగా ఉన్నారు కదా. తను చుట్టపు చూపుగా ఈ ఇంటికి రాలేదు నీకు సవతిగా తీసుకొచ్చాను. ఇక శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళడానికి రెడీగా ఉండమని అత్త వార్నింగ్ ఇస్తుంది.