అన్వేషించండి

Brahmamudi September 9 Episode: తల్లికి నిజం చెప్పేసిన రాజ్, కనకానికి దొరికిపోయిన రాహుల్ - స్వప్నను చంపించే కుట్రలో రుద్రాణి!

సీతారామయ్య ఆరోగ్యం కోసం రాజ్ కావ్య మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

Brahmamudi September 9 Episode: కావ్య తలలో మల్లెపూలు పెట్టుకుని పాల గ్లాసు పట్టుకుని రాజ్ గదిలోకి అడుగుపెడుతుంది. వచ్చి కాసేపు పాలు, పూల గురించి క్లాస్ తీసుకుంటుంది. మూడు నెలలు టైమ్ అడిగాను కదా మళ్ళీ ఏంటి ఇదని అంటాడు. అమ్మమ్మ పూలు పెట్టారు, చిన్నత్తయ్య పాలు ఇచ్చారని చెప్తుంది. దీంతో రాజ్ సైలెంట్ అయిపోతాడు. కళ్యాణ్ అనామిక ఫోటో పట్టుకుని చూసుకుంటూ మాట్లాడుకుంటాడు. ‘నేను నిన్ను ఇష్టపడుతునట్టే నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావా లేదా? నీకు ఆ విషయం చెప్తే ఏమనుకుంటావ్’ అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విషయం గురించి అప్పుని అడగాలని తనకి కాల్ చేస్తాడు. కానీ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తుంది. మళ్ళీ చేసేసరికి చిరాకుగా ఫోన్ లిఫ్ట్ చేసి పనిలో ఉన్నానని అరుస్తుంది. ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడమని బతిమలాడతాడు. సరే అని మాట్లాడుతుంటే అనామిక కాల్ చేస్తుంది. దీంతో అప్పు కాల్ కట్ చేసేస్తాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పు కోపంగా కళ్యాణ్ కి కాల్ చేస్తే ఫోన్ కట్ చేస్తాడు. అప్పుకి మండిపోతుంది.

కనకం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా కారులో రాహుల్ వెళ్తూ కనిపిస్తాడు. ఇదేంటి హనీ మూన్ కి వెళ్లారని అన్నారు కదా రాహుల్ ఇక్కడ ఉన్నాడు ఏంటని అనుకుని వెంటనే రుద్రాణికి ఫోన్ చేస్తుంది.

Also Read: 'గృహలక్ష్మి'లోకి కొత్త క్యారెక్టర్లు- సామ్రాట్ ఆస్తి కాజేసేందుకు ధనుంజయ్ కుట్ర!

కనకం: మీ అబ్బాయి నాకు రోడ్డు మీద కనిపించాడు

రుద్రాణి: ఏంటి మీరు అనేది

కనకం: అవును మీ అబ్బాయి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ నాకు కనిపించాడు

రుద్రాణి: ఎలా చూస్తారు నిన్న రాత్రి వాళ్ళు నాకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. వాళ్ళు ఊటీలో ఉన్నారు. అంటే మీరు మీ కూతురితో రోజు మాట్లాడటం లేదా? పెళ్లి అయిన తర్వాత తల్లిని వదిలేసిందా?

కనకం: ఆహా అదేం లేదు రోజు మాట్లాడుతుంది. ఊటీలో ఉన్నానని చెప్పింది

రుద్రాణి వెంటనే రాహుల్ కి కాల్ చేసి ఎక్కడ ఉన్నావని అడుగుతుంది.

రుద్రాణి: మీ అత్త నిన్ను చూసింది. పని పూర్తయ్యే వరకు ఎవరికీ కనిపించొద్దని చెప్పాను కదా ఎందుకు ఇలా చేస్తున్నావ్. మనం ఇప్పుడు చేస్తున్న పని చాలా రిస్క్ తో కూడుకున్నది. నువ్వు ఇలా తప్పులు చేసి దొరికిపోతే జీవితాంతం వీళ్ళ కాళ్ళ కింద పడి బతకాల్సి వస్తుంది

రాహుల్: ఒకే మామ్ ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకుంటాను

కొంచెం ఉంటే కనకానికి దొరికిపోయి విషయం తెలుసుకుని ఇంట్లో రచ్చ రచ్చ చేసేదని రుద్రాణి టెన్షన్ పడుతుంది. కావ్య కృష్ణయ్యకి పాట పాడి పూజ చేసి అందరికీ హారతి ఇస్తుంది. బాల కృష్ణుడిని పిలిస్తే నీ బాల గోపాలుడు వచ్చాడని ఇంద్రాదేవి అంటుంది. ప్రతి పండగ గొప్పగా చేయాలా? ఇంటిని భజన మందిరం చేస్తున్నారని రుద్రాణి దెప్పి పొడుస్తుంది.

Also Read: రాజ్ మీద డౌట్ పడిన పెద్దాయన, కావ్యకి ఊహించని బహుమతి, రగిలిపోతున్న అపర్ణ

రాజ్: తను పూజ కదా చేసింది అందులో తప్పేముంది. ఇల్లు భజన మందిరంలా అనిపిస్తే మీరు మీ గదిలోనే కూర్చోండి ఎవరు వద్దన్నారు

పూజలు చేయడానికి ఉన్న విశిష్టత గురించి ఇంద్రాదేవి చక్కగా చెప్తుంది. నీకు రావడం ఇష్టం లేకపోతే నీ గదిలోనే ఉండు. బయటకి వస్తే నోరు అదుపులో పెట్టుకో. అందరూ జంటలుగా వచ్చి కృష్ణయ్యని ఆశీర్వదించి దణ్ణం పెట్టుకుంటారు. ముందుగా సీతారామయ్య వాళ్ళు తర్వాత శుభాష్, ప్రకాశం వాళ్ళు దేవుడికి దణ్ణం పెట్టుకుంటారు. అందరూ అయిపోయిన తర్వాత రాజ్, కావ్యని వెళ్ళమని అమ్మమ్మ చెప్తుంది. భర్తతో కలిసి పూజ చేసినందుకు కావ్య చాలా సంతోషిస్తుంది. భర్త మనసు మారుతుంది, అత్త మనసు కూడ మారి కోడలిగా స్వీకరించేలా చూడమని కావ్య కృష్ణయ్యని వేడుకుంటుంది. అప్పు ఆడుకోవడానికి బయటకి వెళ్లబోతుంటే కనకం కోపంగా తనని గదిలో పెట్టి బంధించేస్తుంది.

తరువాయి భాగంలో..

రాజ్ కావ్య మెడలో హారం వేస్తాడు. దీంతో తను చాలా ఎమోషనల్ అవుతుంది. ఇదే విషయాన్ని ఇంద్రాదేవి వాళ్ళతో పంచుకుంటుంది. ఈ బ్రహ్మముడి ఎందుకు వేశావు దేవుడా అని ఎంతో బాధపడేదాన్ని.. కానీ నాకు నమ్మకం వచ్చింది నేను ఈ ఇంటి కోడలినే అని కావ్య సంతోషంగా మాట్లాడటం అపర్ణ విని షాక్ అవుతుంది. కోపంగా రాజ్ ని గదికి లాక్కెళ్లి ప్రశ్నిస్తుంది. వరలక్ష్మీ వ్రతం జరిగిన రోజు రాత్రి నుంచి నీలో మార్పు వచ్చింది. కావ్య అంటే ఇష్టం ఉన్నట్టు ప్రేమ చూపిస్తున్నావ్. ఎందుకు ఇలా మారిపోయావ్ అని నిలదీస్తుంది. తాతయ్య కోసమని జరిగింది మొత్తం చెప్పడంతో అపర్ణ షాక్ అవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 22th:ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
నువ్వులేక నేను లేను: ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
Nindu Manasulu Serial Today August 22nd: నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
Illu Illalu Pillalu Serial Today August 22nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget