Gruhalakshmi September 16th: తులసి ఇంట కృష్ణాష్టమి సంబరాలు- దివ్య కోసం జానూ మీద ఫైర్ అయిన విక్రమ్
దివ్య జీవితంలోకి జాహ్నవి ఎంట్రీ ఇవ్వడంలో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
![Gruhalakshmi September 16th: తులసి ఇంట కృష్ణాష్టమి సంబరాలు- దివ్య కోసం జానూ మీద ఫైర్ అయిన విక్రమ్ Gruhalakshmi Serial September 16th Episode 1052 Written Update Today Episode Gruhalakshmi September 16th: తులసి ఇంట కృష్ణాష్టమి సంబరాలు- దివ్య కోసం జానూ మీద ఫైర్ అయిన విక్రమ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/16/2820db5949d8c0c6070eda59c94134511694838318373521_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gruhalakshmi Serial September 16th: దివ్యకి జాహ్నవి అడ్డుపడి మాట్లాడుతుంది. తన జీవితం గురించి తను ఆలోచించుకుంటానని పట్టించుకోవద్దని దివ్య హెచ్చరిస్తుంది. ఇద్దరు విక్రమ్ గురించి పోట్లాడుకుంటారు. దివ్య విక్రమ్ కోసం బట్టలు తీసుకెళ్తుంటే అవి బావ కట్టుకోడని జానూ అంటుంది. తులసి హనీకి కృష్ణుడు వేషం వేసి తీసుకొస్తుంది. దివ్య వాళ్ళని పిలిచి ఇంట్లో పండుగ చేసుకుంటున్నామని తులసి చెప్తుంది. నెక్స్ట్ పండగకి నువ్వే కృష్ణుడి గెటప్ వేసుకోవాలి తులసి ఆంటీ నీతో ఉండదని నందు అంటాడు. కానీ హనీ మాత్రం తులసి ఎక్కడికి వెళ్లదని బదులిస్తుంది. విక్రమ్ స్నానం చేసి రాగానే దివ్య వచ్చి కొత్త బట్టలు వేసుకోమని చెప్తుంది. కానీ విక్రమ్ మాత్రం తన మాట వినకుండా తన డ్రెస్ తనే సెలెక్ట్ చేసుకుంటానని అంటాడు. అప్పుడే జానూ కొత్త బట్టలు తీసుకొచ్చి వాటిని వేసుకోమని ఇస్తుంది. దివ్య కోపంగా ఉరిమి చూస్తుంది.
Also Read: తొలగిపోయిన అడ్డుతెరలు- మురారీ మనసులో తనకే స్థానమని తెలుసుకున్న కృష్ణ
జానూ తెచ్చిన డ్రెస్ కాదని తను తెచ్చిన డ్రెస్ వేసుకోమని దివ్య పట్టుబడుతుంది. మళ్ళీ దివ్య, జానూ పోట్లాటకు దిగుతారు. మధ్యలో ఏం మాట్లాడాలో తెలియక విక్రమ్ బిక్కమొహం వేసుకుని నిలబడతాడు. రాజ్యలక్ష్మి వచ్చి ఏంటి ఇంకా రెడీ అవలేదా అని విక్రమ్ ని అంటుంది. తనని ఏం చేయమంటావో చెప్పమని విక్రమ్ అంటే నీ మనసులో ఏముందో చెప్పమని కావాలని రాజ్యలక్ష్మి ఇరికిస్తుంది. దీంతో తల్లి ఎలా చెప్తే అలా అని అంటాడు. జానూ కాయిన్ తీసుకొచ్చి ఆట ఆడదామని అంటుంది. అందులో జానూ గెలుస్తుంది. దీంతో తను తెచ్చిన డ్రెస్ వేసుకోమని గొడవ చేస్తుంది. రాజ్యలక్ష్మి జానూకి సపోర్ట్ చేసి ఆ డ్రెస్ వేసుకోమని చెప్పేసరికి విక్రమ్ సరే అంటాడు. నిజంగానే ఇది సవతిలాగా తయారయ్యేలా ఉంది ఈ విషయం తల్లికి తెలియకుండా చూసుకోవాలని దివ్య మనసులోనే బాధపడుతుంది. ఇక అందరూ తులసి ఇంటికి వస్తారు.
తులసి బయటకి వచ్చి అందరికీ ఆహ్వానం పలుకుతుంది. జానూ ఎవరని తులసి అంటే మా కోడలు అని రాజ్యలక్ష్మి అనేసరికి షాక్ అవుతారు. మేనకోడలని, బసవయ్య కూతురని చెప్తుంది. కృష్ణుడు విగ్రహాన్ని చక్కగా రెడీ చేశారని చెప్పి జానూ తులసి వాళ్ళని మెచ్చుకుంటుంది.
జానూ: నా మనసులో చాలా అసలు ఉన్నాయి అవి తీరాలి అంటుంది. అప్పుడే తులసి హనీని తీసుకొచ్చి దివ్యకి చూపిస్తుంది. తనని చూసి దివ్య చాలా సంతోషిస్తుంది. ఎవరు ఆ అమ్మాయి అని రాజ్యలక్ష్మి అడిగితే తన కజిన్ అని చెప్తుంది.
జానూ: మేకప్ వేసుకుంటే ఎవరైనా కృష్ణుడిలాగే కనిపిస్తారు. కానీ మా బావ గెటప్ వేయకపోయినా కృష్ణుడే
బసవయ్య: ఏం చెప్పావ్ అంతా మేము అనుకున్నట్టు జరిగి ఉంటే రుక్మిణీ స్థానంలో నువ్వు ఉండేదానివి
Also Read: రాజ్ ప్రవర్తనకి తల్లడిల్లిన తల్లి హృదయం- స్వప్న ఏమైంది - ఆందోళనలో కనకం
జానూ: అదే జరిగి ఉంటే మిగతా వాళ్ళకి కథలో చోటు ఉండేది కాదు
తులసి: మీరు ఏం మాట్లాడుతున్నారు
దివ్య: ఇప్పుడు అవన్నీ ఎందుకు
బసవయ్య: మేము దివ్యకి ముందు జాహ్నవిని అనుకున్నాం
తులసి: మనం ఎన్ని అనుకున్నా చివరికి దేవుడు అనుకున్నది జరుగుతుంది
జానూ: దేవుడు అనుకోవాలే కానీ ఏదైనా జరగవచ్చు. దగ్గర వాళ్ళు దూరం అవ్వచ్చు దూరం వాళ్ళు దగ్గర అవ్వచ్చు
దివ్య జానూని పక్కకి లాక్కెళ్లి నోరు అదుపులో పెట్టుకోమని హెచ్చరిస్తుంది. విక్రమ్ కి దూరంగా ఉండమని అంటుంది. కానీ జానూ మాత్రం దానికి రివర్స్ లో ఉంటానని అంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)