Gruhalakshmi October 15th: రెండు జంటల రొమాంటిక్ మూమెంట్- ఫుల్ ఖుషీలో తులసి, అనసూయకి ఎక్కించిన లాస్య
ప్రేమ్ చేసిన తప్పు తెలుసుకుని శ్రుతిని క్షమించమని అడుగుతాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ఆడదాన్ని గౌరవించే సంస్కారం ఉన్న వాడివి భార్యని కళ్ళలో పెట్టి చూసుకుంటావు అని మురిసిపోయేదాన్ని. కానీ నువ్వు నా కొడుకువి కాదు ఆ నందగోపాల్ కొడుకువి అని తులసి కోపంగా అరుస్తుంది. మీ నాన్నలాగే భార్యని ఒంటరి దాన్ని చేసి గాలికి వదిలేద్దామని అనుకున్నావా, నాకు పట్టిన గతే శ్రుతికి వచ్చేలా చేద్దామని అనుకున్నావా అని అంటుంది. ఒంటరి ఆడదాన్ని నన్ను సమాజం ఎలా చూస్తుందో చూస్తూనే ఉంటున్నారు, నేను పవిత్రురాలిని అని గొంతు చించుకుని అరుస్తున్నా నన్ను ఎవరు నమ్మడం లేదు దోషిలానే చూస్తుంది. శ్రుతికి కూడా అదే గతి పట్టాలని అనుకుంటున్నావా అని తులసి ఎమోషనల్ అవుతుంది. మీ అహంకారాన్ని తగ్గించుకోండి లేదంటే మాకు ఇంత విషం తీసుకొచ్చి ఇవ్వండి అనేసరికి ప్రేమ్ తల్లి కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాడు. క్షమించాల్సింది నేను కాదు శ్రుతి వెళ్ళి తన కాళ్ళు పట్టుకో అని అంటుంది.
ప్రేమ్ శ్రుతి కాళ్ళు పట్టుకోడానికి వంగబోతుంటే ఆపి హగ్ చేసుకుంటుంది. తప్పు చేశాను సోరి అని ఇద్దరూ ఒకరికొకరు చెప్పుకుంటారు. గుళ్ళో ముడుపులు కట్టగానే సరిపోదు ఇంట్లో ఉయ్యాల కూడా కట్టాలి అని అనసూయ అనేసరికి రెండు జంటలు సిగ్గుపడిపోతారు. దివ్య, తులసి ఇద్దఋ కోడళ్లని శోభనం కోసం అందంగా ముస్తాబు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఏర్పాట్లు ఎందుకు అని అంకిత, శ్రుతి ఇబ్బంది పడుతూ ఉంటారు. అటు పరంధామయ్య ప్రేమ్, అభిలని ఆట పట్టిస్తూ ఉంటాడు. మామ్ వద్దన్నా ఇప్పుడు ఈ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసింది, నువ్వేమో ఇలా మాతో బస్కీలు తీయిస్తున్నావ్ అని అభి, ప్రేమ్ అంటారు. దివ్య.. అంకిత, శ్రుతిలని ఫుల్ గా ఆట పట్టిస్తుంది.
రెండు జంటల్ని గదిలోకి పంపిస్తారు. శ్రుతి ప్రేమ్ కోసం పాలు తీసుకొస్తే అటు వెరైటీగా అభి అంకిత కోసం పాలు తీసుకొస్తాడు. చిన్న ఛేంజ్ కావాలని అనిపించింది అందుకే ఇలా ప్లాన్ చేశాను అని అంకిత అభితో అంటుంది. శ్రుతి పాలు తీసుకొచ్చి మొత్తం తాగేస్తుంది. అదేంటి మొత్తం నువ్వే తాగేసావ్ అని బిక్కమొహం వేస్తాడు ప్రేమ్. మనకి మూడో మొదటి రాత్రి కదా నేనే మొత్తం పాలు తాగాలని మా నాన్నమ్మ చెప్పింది అని శ్రుతి ప్రేమ్ ని ఆట పట్టిస్తుంది. పెళ్ళైన ఇన్నాళ్ళకి ఫస్ట్ నైట్ ఏంటి అని అనుకున్నా కానీ వాళ్ళు ఎంత మంచి పని చేశారో ఇప్పుడు అర్థం అయ్యింది. మెకానిక్ లైఫ్ కి అలవాటు పడిపోయామని అటు అంకిత తన భర్తతో అంటుంది.
చిన్న చిన్న కోపాలు మనసులో పెట్టుకుని బంధాలు మర్చిపోయాము అని శ్రుతి అంటుంది. మన మధ్య ఈ ఏకాంతం ఒకరినొకరు మనసు విప్పి మాట్లాడుకుని ఒకరి గురించి మరొకరు తెలుసుకునే అవకాశం ఇచ్చిందని అభి హ్యాపీగా ఫీల్ అవుతాడు. రెండు జంటలు హ్యాపీగా ఏకాంతంగా గడుపుతారు.
Also Read: తులసి నీకు బాస్ నందుకి వార్నింగ్ ఇచ్చిన సామ్రాట్- ప్రేమ్ చెంప చెళ్లుమనిపించిన తులసి
తరువాయి భాగంలో..
లాస్య అనసూయకి ఫోన్ చేసి మీ అబ్బాయి జాబ్ వదిలేశాడు సామ్రాట్ ని రెచ్చగొట్టి నందుని అవమానించేలా చేసింది, పస్తులు ఉండేలా చేస్తే కాళ్ళ బేరానికి వస్తామని తులసి ఐడియా అనుకుంటా అని ఏడుస్తున్నట్టు నటిస్తుంది. ఇంత జరిగినా నాకు చెప్పలేదని అనసూయ ఆగ్రహంతో ఊగిపోతుంది. ఇప్పుడు మేమంతా తన శత్రువులం అయ్యాము సామ్రాట్ అండ చూసుకుని రెచ్చిపోతుందని లాస్య బాగా ఎక్కిస్తుంది.