Gruhalakshmi May 19th: దివ్య ప్లాన్ ఫెయిల్, అత్త తిక్క వదిలిస్తున్న కోడలు- కేఫ్ తనదంటూ రచ్చ చేసిన లాస్య
రాజ్యలక్ష్మి నిజస్వరూపం దివ్యకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
నందు, తులసి బయటకి వెళ్తుంటే లాస్య ఎదురుపడి కావాలని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. నీ మీద కసి, ద్వేషం తప్ప ఏమి లేవు ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని నందు ఆవేశపడుతూ లాస్య గొంతు పట్టుకోబోతుంటే తులసి అడ్డుపడుతుంది. గొడవ పెంచుకోవద్దని బతిమలాడుతుంది. నీమొహం చూడాలని మాట్లాడాలని అనిపించడం లేదు గెటవుట్ అని అరుస్తాడు. కేఫ్ తాళాలు ఇస్తే వెళ్లిపోతానని అంటుంది. ఆ కేఫ్ నాది నా సొంతం ఇచ్చేది లేదని తెగేసి చెప్తాడు. దాని ఎలా సొంతం చేసుకోవాలో తనకి తెలుసని లాస్య కోపంగా వెళ్ళిపోతుంది. ఇక ఇద్దరూ కలిసి దివ్య దగ్గరకి బయల్దేరతారు.
విక్రమ్ వచ్చి దివ్యని హగ్ చేసుకుంటాడు. తలుపులు వేసి వస్తానంటే విక్రమ్ మాత్రం వద్దు మొదటి రాత్రి ముహూర్తం పెట్టకుండా బాగోదని అంటాడు. నా కొంగు లాగడం కాదు ముహూర్తం సంగతి చూడమని చెప్తుంది. అమ్మ ముహూర్తం లేదు వద్దంటే వద్దని అనేసరికి దివ్య కోపంతో అలుగుతుంది. ఎలాగైనా విక్రమ్ ని దారిలోకి తెచ్చుకుని వాళ్ళ అమ్మకి ఎదురుతిరిగేలా చేయాలని దివ్య అనుకుంటుంది. వెంటనే భర్తకి ముద్దు పెట్టబోతుంటే రాజ్యలక్ష్మి పిలుస్తుంది. వెంటనే విక్రమ్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అర్జంట్ గా బయటకి వెళ్ళాలి చూస్తే చెప్పు తెగిపోయిందని నటిస్తుంది. క్షణాల్లో చెప్పులు కుట్టించుకుని వస్తానని వాటిని తీసుకుంటాడు. నువ్వు చెప్పు కుట్టించుకురావడం ఏంటని నటిస్తుంది. చూడు దివ్య అమ్మ ఎలా అంటుందో అనేసరికి అమ్మ చెప్పిన మాట వినకుండా చేస్తున్నావని అంటుంది. సందు దొరికింది కదా బసవయ్య అదేంటి తల్లీ కొడుకుల మధ్య గొడవ పెడుతున్నావా అని నానామాటలు అంటారు.
Also Read: ఢీ అంటే ఢీ అంటున్న ముకుంద, మురారీ- రోజురోజుకీ భర్తకి మరింత దగ్గరవుతున్న కృష్ణ
అప్పుడే సంజయ్ బయటకి వెళ్తుంటే మీ అమ్మ చెప్పు తెగిపోయింది వెళ్ళి కుట్టించుకుని రా అని దివ్య అడుగుతుంది. పనివాళ్ళు చేయాల్సిన పని నాతో చేయిస్తారా అని సంజయ్ అంటాడు. విన్నారుగా అత్తయ్య మాట్లాడరు ఏంటి తప్పు సంజయ్ అలా అనకూడదని అడగరు ఏంటని దెప్పి పొడుస్తుంది. విక్రమ్ బాధ్యత తెలిసిన కొడుకు అన్నారు కదా మరి సంజయ్ బాధ్యత లేని కొడుకా? ఏంటి ఇద్దరికీ తేడా అని లాజిక్ మాట్లాడుతుంది. చిన్న విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నావ్అని విక్రమ్ అడుగుతాడు. వాడు చదువుకున్న వాడు ఇలాంటి పనులు చేయడానికి చిన్నతనంగా అనిపిస్తుందని విక్రమ్ వెనకేసుకొస్తుంటే అయితే అందుకేనా మీరు చదువు మానేసిందని అంటుంది. ఇప్పటి వరకు నాకు ఏ పని చేయాలన్నా నాకు నా పెద్ద కొడుకు పేరే వస్తుంది ఎందుకు నా ప్రేమ విషయంలో తప్పు పడుతున్నారని ఏడుస్తున్నట్టు నటిస్తుంది.
Also Read: అభిమన్యుని పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిన చిత్ర- వేద చెల్లి జీవితాన్ని కాపాడగలుగుతుందా?
తెగేదాక లాగితే విక్రమ్, దివ్యకి మధ్య మనస్పర్థలు వస్తాయని తాతయ్య సైగ చేస్తాడు. ఆ దేవుడు దిగి వచ్చి అమ్మ గురించి చెడుగా చెప్పినా నమ్మనని వెళ్ళిపోతాడు. లాస్య కేఫ్ కి వెళ్ళిందని మేనేజర్ ఫోన్ చేసి చెప్తాడు. తులసి వెంటనే వెళ్ళమని అంటుంది కానీ నందు మాత్రం వెళ్ళను ఏం చేసుకుంటుందో చేసుకొనివ్వమని అంటాడు. తులసి వాళ్ళు రావడం చూసి నిజం తెలిసిన తర్వాత మొదటి సారి ఇంటికి వస్తున్నారని దివ్యని కలవనీయకుండా చేయాలని రాజ్యలక్ష్మి అనుకుంటుంది. ఏమి తెలియనట్టు రాజ్యలక్ష్మి నందుని వెటకారంగా మాట్లాడుతుంది. వాళ్ళని అవమానించేలా మాట్లాడుతుంది. నేను బిజీగా ఉన్నాను మీరు వచ్చే ముందు ఫోన్ చేసి వస్తే బాగుండేదని అంటుంది. అప్పుడే దివ్య వాళ్ళు నాకోసం వచ్చారని వచ్చి తల్లిని కౌగలించుకుంటుంది.