Gruhalakshmi August 12th: తులసి తలకి గన్ పెట్టిన మాణిక్యం- లక్కీతో తెగదెంపులు చేసుకున్న లాస్య మాజీ మొగుడు
రాజ్యలక్ష్మి హాస్పిటల్ క్యాంటీన్ కాంట్రాక్ట్ తులసికి రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
విక్రమ్ ఫోన్లో దివ్య ఫోటో చూసుకుంటూ తనతో పరిచయం, ప్రేమ, పెళ్లి, విడాకులు అన్నింటినీ గుర్తు చేసుకుంటాడు. చూడాలని అనుకుంటే పిలిస్తే నేనే ఎదురుగా వచ్చి నిలబడతాను కదా అని దివ్య ఎంట్రీ ఇస్తుంది.
దివ్య: దివ్య అంటే అంత ఇష్టమా.. ప్రేమ దాచుకోకూడదు ఇస్తే తిరిగి ఇస్తారు
విక్రమ్: ఇక ఆపుతావా.. అని కోపంగా దిండు మీదకి విసిరేస్తాడు
దివ్య: ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుందని మీద పడబోతుంటే పక్కకి తోసేస్తాడు
విక్రమ్: నువ్వు భార్యవి కాదు అతిథివి. ఉన్నావా తిన్నావా విడాకులు తీసుకుని వెళ్లిపోయావా అన్నట్టు ఉండు
దివ్య: మనసు చంపుకుని మాట్లాడకు.. నాకొక అవకాశం ఇవ్వు
Also Read: దుగ్గిరాల ఇంట్లో మొదలైన రణరంగం- రాజ్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించాడని తెలుసుకున్న కావ్య
విక్రమ్: ఇది జీవితం పగిలిన మనసు అతికించడం కుదరదని కన్నీళ్ళు పెట్టుకుంటాడు
దివ్య: నీ మనసులో నా మీద ప్రేమ ఉంది కదా ఒప్పుకో
విక్రమ్: అవును నేను దివ్యని ప్రేమిస్తున్నా ఇప్పటికీ ఆరాధిస్తున్నా.. కానీ ఈ దివ్యని కాదు ఒకప్పటి దివ్యని. జీవితం పంచుకుంటానని నాతో ఏడడుగులు నడిచిన దివ్యని
దివ్య: ఆ దివ్య ఈ దివ్య రెండూ నేనే
విక్రమ్: బంధాల గురించి తెలిస్తే నోటీసుల దాకా ఎందుకు వెళ్తావ్
దివ్య: నన్ను నేను నిరూపించుకునేంత వరకు తల దించుకునే ఉంటాను. కానీ నీ చెయ్యి మాత్రం వదిలిపెట్టను. ఐలవ్యూ విక్రమ్
తులసి కేఫ్ లో కూర్చుని హాస్పిటల్ లో క్యాంటీన్ స్టార్ట్ చేయడానికి ఏం కావాలో లిస్ట్ రాసుకుంటుండగా మాణిక్యం రౌడీలని తీసుకుని వస్తాడు. క్యాంటీన్ నడుపుకోవడానికి ఇచ్చిన ఆర్డర్ తిరిగి ఇవ్వమని తులసిని బెదిరిస్తాడు.
తులసి: అది అంత తేలిక కాదు
మాణిక్యం: నువ్వేమైన కర్తవ్యం సినిమాలో విజయశాంతి అనుకున్నావా మొగుడు వదిలేసిన ఆడదానివి. క్యాంటీన్ జోలికి వెళ్లకు
తులసి: ఏదైనా చేయాలని డిసైడ్ అయితే ఎవరి మాట వినదు. ఎలాగో వచ్చావ్ కదా నాకొక హెల్ప్ చేసి పెట్టు
మాణిక్యం: ఎలా కనిపిస్తున్నా నీకు.. నన్ను చూస్తే భయం వేయడం లేదా? నీతో గొడవ ఎందుకంటే నన్ను రెచ్చగొడుతున్నావ్. సరే ఒక పని చేద్దాం క్యాంటీన్ నీ పేరు మీద ఉంచుకో కానీ ఫుడ్ నేను సర్వ్ చేస్తాను
తులసి: నీ కక్కుర్తి తెలిసి ఎలా చెయ్యి కలుపుతాను
Also Read: తులసికి గిఫ్ట్ ఇచ్చి కాకాపడుతున్న నందు- దివ్య దెబ్బకి అల్లాడిపోతున్న రాజ్యలక్ష్మి, లాస్య
అప్పుడే నందు వస్తాడు. మొగుడు కానీ మొగుడు వచ్చాడుగా అంటాడు. నేను ఎంత నీచుడినో తెలిసేలా చేస్తానని మాణిక్యం గన్ తీసి తులసి తలకి గురి పెడతాడు. వెంటనే నందు దాన్ని లాక్కుని మాణిక్యంకి గురి పెడతాడు.
నందు: పద్ధతిగా ఉన్నామని బెదిరించి నీ దారిలో పెట్టుకుందామని అనుకున్నావ్. ఇంకొకసారి మా జోలికి రాకు అనేసి బయటకి తోసేస్తాడు
లాస్యకి శేఖర్ ఫోన్ చేస్తాడు. లక్కీని తీసుకుని హాస్టల్ దగ్గరకి రమ్మని చెప్తాడు.తులసి వాళ్ళు క్యాంటీన్ లో మంచి ఫుడ్ అందిస్తున్నందుకు మెచ్చుకుంటారు. అదంతా విక్రమ్, దివ్య చూస్తూ ఉంటారు. పేషెంట్ వాళ్ళ తాలూకు తృప్తి చూస్తుంటే బాగుందని విక్రమ్ అనుకుంటాడు. దూరం నుంచి వాళ్ళని రాజ్యలక్ష్మి, సంజయ్ కూడా గమనిస్తారు. హాస్పిటల్ గురించి చుట్టం చూపుగా పట్టించుకుంటున్నావ్ అలా కాకుండా నేరుగా చూసుకోమని దివ్య సలహా ఇస్తుంది.
దివ్య: నువ్వు హాస్పిటల్ ఛైర్మన్ వి ఇక్కడ జరిగే తప్పులకి నీ బాధ్యత కూడా ఉంటుంది
విక్రమ్: క్యాంటీన్ లో ఏదైనా తేడా వస్తే ఒప్పుకోను నిలదీస్తాను
రాజ్యలక్ష్మి అదంతా చూస్తూ రగిలిపోతుంది. విక్రమ్ ని అదుపులో పెట్టుకుంటుందని దివ్యని తిట్టుకుంటుంది. కొత్త క్యాంటీన్ బాగుందని హాస్పిటల్ లో అందరూ మెచ్చుకుంటున్నారని దివ్య తులసితో చెప్పుకుని సంతోషపడుతుంది. లాస్య లక్కీ దగ్గరకి వస్తుంది. అప్పుడే శేఖర్ లావణ్య అనే అమ్మాయిని తీసుకొచ్చి తనకి కాబోయే భార్య అని చెప్పి లాస్యకి పరిచయం చేస్తాడు.
శేఖర్: మన మధ్య సంబంధాన్ని తెగదెంపులు చేసుకోవడానికి వచ్చాను
లాస్య: మనకి బంధం తెగిపోయినప్పుడే వాడికి నీకు కూడా సంబంధం తెగిపోయింది
శేఖర్: లాస్యని పెళ్లి చేసుకుని నేను నష్టపోయాను. నువ్వు లాస్య కడుపున పుట్టి జీవితాన్ని నష్టపోయావు. నీ చేతికి పది లక్షలు బాండ్ పేపర్స్ ఇవ్వడం తప్ప ఏమి చేయలేకపోతున్నా
లక్కీ: అదేంటి మరి నాకు డాడీ ఎవరు
శేఖర్: ఈ ప్రశ్న నన్ను కాదు మీ అమ్మని అడుగు.. తనకి మొగుడు లేకుండా చేసుకుని నీకు డాడీ లేకుండా చేసింది
లక్కీ: నన్ను వదలొద్దు డాడీ ప్లీజ్
లాస్య: డాడీ లేకుండా ఉండలేవా ఏంటి? నీకిక డాడీ లేడు తన లోటు లేకుండా నిన్ను చూసుకుంటాను
లక్కీ తండ్రిని పట్టుకుని ఏడుస్తుంటే విదిలించుకుని లావణ్య శేఖర్ ని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతుంది. నందు తులసి కోసం మరొక గిఫ్ట్ సిద్ధం చేస్తాడు. ఇంట్లో అందరూ వచ్చిన పార్సిల్ చూసి ఏముందని అడుగుతారు. బాక్స్ ఏదో ఓపెన్ చేయవచ్చు కదా అంటారు.