Ennallo Vechina Hrudayam Serial Today May 5th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: గాయత్రీ, అనంత్‌ల ఫస్ట్‌నైట్.. తల్లీకూతుళ్ల శాడిజం.. అనంత్ నిజం చెప్పేస్తాడా!
Ennallo Vechina Hrudayam Today Episode గాయత్రీ, అనంత్‌ల ఫస్ట్‌నైట్‌కి ముహూర్తం పెట్టడం రమాప్రభ ఫస్ట్‌నైట్ ఆపడానికి ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode అనంత్, గాయత్రీల తొలిరేయి గురించి మాట్లాడటానికి త్రిపుర ఫ్యామిలీ మొత్తం బాల వాళ్ల ఇంటికి వెళ్తారు. రెండు ఫ్యామిలీలు క్షేమ సమాచారం గురించి మాట్లాడుకుంటారు. గాయత్రీ, అనంత్ మధ్య జరిగిన గొడవ గురించి మాట్లాడుతారు. భార్యభర్తల మధ్య ఇలాంటివి సహజమే అనుకుంటారు. అందరిళ్లలో జరిగేవే కదా అని పెద్దాయన అంటారు. దానికి వాసుకి అందరి ఇళ్లలో ఏమో కానీ మా ఇంటిలో కొత్త అని అంటుంది.
బామ్మ: వాసుకి కొంచెం నోరు అదుపులో పెట్టుకో.
బాల: పిన్ని నువ్వు సైలెంట్‌గా ఉండు చుప్.
పెద్దాయన: మా మనవరాలికి సర్ది చెప్పాం. తల్లి లోడు లేనిది లేకపోతే మా కోడలే వివరంగా చెప్పేంది. అది కోపంలో ఏమైనా పొరపాటు చేసినా మీరు దాన్ని క్షమించి కడుపులో పెట్టుకొని చూసుకోండమ్మా.
యశోద: మీరు అంతలా చెప్పక్కర్లేదు బాబాయ్ గారు ఇక వాళ్ల మధ్య ఏం గొడవలు జరగకుండా చూసుకుంటాం.
పెద్దాయన: ఆ గొడవలు మనస్పర్థలు కూడా కార్యం జరగకపోవడం వల్లే అని నాకు అనిపిస్తుందమ్మా.
బామ్మ: తప్పకుండా కార్యం జరిపించాలి మీరు చెప్పింది నూటికి నూరు పాళ్లు కరెక్ట్. పెద్దలుగా ఆ బాధ్యత మన అందరికీ ఉంది.
పెద్దాయన: మీరేం అనుకోకపోతే కార్యం ఈ రోజే జరిపిద్దాం. పంతుల్ని కలిసి వచ్చాం అని చెప్తారు.
బామ్మ సరే అంటుంది. అందరూ సంతోషపడతారు. వాసుకి, నాగభూషణం వాళ్లు కార్యం జరిగితే వారసుడి వస్తే ఆస్తి వాటా పోతుందని అనుకుంటారు. ఇక ఊర్వశి, రమాప్రభ కూడా కార్యం జరగకూడదు అనుకుంటారు. బామ్మ త్రిపుర వాళ్లతో ఈ రోజు కార్యం జరిపించి రేపు అక్షయ తృతీయ పూజ జరిపిద్దాం మీరంతా ఇక్కడే ఉండండి అని చెప్తుంది. పెద్దాయన సరే అంటారు. బాల త్రిపుర దగ్గరకు వెళ్లి సుందరి కార్యం అంటే ఏంటి అని అడుగుతాడు. అదీ అదీ అని త్రిపుర ఇబ్బంది పడుతుంది. తర్వాత బాల అనంత్ దగ్గరకు వెళ్లి అడుగుతాడు. అనంత్ కూడా చెప్పలేకపోతాడు. ఇక బాల బామ్మతో అందరి ముందు కార్యం అంటే ఏంటి అని అడుగుతాడు. దాంతో యశోద నాన్న అది ఇక నుంచి అనంత్ నీ గదిలో పడుకోడు అని చెప్తుంది. దానికి బాల హమ్మయ్యా ఇక నుంచి అనంత్ నా మీద కాలు వేయడు ఇక హ్యాపీ త్వరగా జరిపించేయండి అంటాడు. అనంత్ గాయత్రీ, త్రిపురల తండ్రినే తన అన్నయ్య చంపాడని గుర్తు చేసుకొని బాధగా ఉంటాడు.
నాగభూషణం, వాసుకిలు రమాప్రభతో ఏం చేయలేక నీ తోటికోడలి కూతురికి తొలిరేయి చేయాలి అని వచ్చావా అని రెచ్చగొడతారు. వాళ్లతో వచ్చినా నేను ప్లాన్ వేసే వచ్చానని అంటుంది. ఏం ప్లాన్ వేశావ్ నీ ప్లాన్‌కి తిరుగే ఉండదు అని వాసుకి అంటుంది. దాంతో ఊర్వశి మల్లెపూలు బయటకు తీస్తుంది. ఇద్దరూ మొగుడుపెళ్లాలు నవ్వుతారు ఈ పూలతో ఏం చేస్తారు అంటారు. దానికి ఊర్వశి, రమాప్రభలు పూల మీద మత్తు మందు చల్లామని కాసేపు ఆగి మళ్లీ చల్లుతామని అంటారు. ప్లాన్ విని రమాప్రభ ప్లాన్ సూపర్ అంటారు. నేను ఉండగా వాళ్ల కాపురం ఎలా జరగనిస్తాను.. వాళ్లని ఎలా సంతోషంగా ఉండనిస్తాను అని అంటుంది. వాసుకి వాళ్లు ఇక కార్యం జరగదు అని రిలాక్స్ అయిపోతారు.
త్రిపుర చెల్లిని ఫస్ట్‌నైట్ కోసం రెడీ చేస్తారు. రమాప్రభ, ఊర్వశిలు అక్కడికి వెళ్లి అయిపోయిందా ముస్తాబు అని ఇలాంటప్పుడే మనం కలిసిపోవాలని గాయత్రీ కూడా నా కూతురు లాంటిదే అని గాయత్రీని ముస్తాబు చేస్తానని జాగ్రత్తలు చెప్తానని రమాప్రభ అంటే గాయత్రీ వద్దని అనేస్తుంది. నన్ను ప్రేమతో రెడీ చేస్తావా పిన్ని.. నీది కచ్చితంగా నటనే నాకు తెలుసు ఎవరు ఏంటో నీ కబుర్లు మా అక్క వింటుంది నేను కాదు నాకు మా అక్కే రెడీ చేస్తుంది మా అక్కే అమ్మ స్థానంలో నిలబడి అన్నీ చేస్తుందని అంటుంది. త్రిపుర పిన్నితో పెద్దరికంగా ఇక్కడికి వచ్చావ్ అంతే పెద్దరికంగా ఇక్కడ ఉంటే మంచిది అని అంటుంది. నన్ను మీరు అర్థం చేసుకోకపోయినా పర్లేదు కానీ నా తరుఫున పద్థతి ప్రకారం నేను చేస్తానని మల్లెపూలు అక్కడ పెట్టి వీటిని గదిలోకి వెళ్లినప్పుడు నీ చేతితో గాయత్రీకి పెట్టు అని త్రిపురకు చెప్తుంది. త్రిపుర వాటిని తీసుకోగానే వెళ్లిపోతారు.
అనంత్ ఫస్ట్‌నైట్ గదిలోకి వెళ్లి గాయత్రీ తండ్రి గురించి ఆలోచిస్తాడు. ఈ నిజం తనలో ఉంచుకోవడం తన వల్ల కాదని వాళ్ల నాన్న చనిపోవడానికి వాళ్ల జీవితాలు తలకిందులవ్వడానికి కారణం తన ఫ్యామిలీనే అని చెప్పేయాలి అనుకుంటాడు. మరోవైపు ఊర్వశి గాయత్రీ జీవితం నాశనం చేయాలి అనుకుంటుంది. ఎలా అయినా దాన్ని వదలను అనుకుంటుంది. ఇంతలో త్రిపుర మల్లెపూలు, మత్తుమందు బాటిల్ పట్టుకొని ఊర్వశి దగ్గరకు వచ్చి సీరియస్‌గా నిల్చొంటుంది. ఏంటి ఇవి అని అడుగుతుంది. త్రిపుర ఊర్వశి బ్యాగ్‌లో వాటిని చూసి ఇవేంటి అని అడుగుతుంది. ఊర్వశిని లాగిపెట్టి కొడుతుంది. నా కూతురిని ఎందుకు కొట్టావని రమాప్రభ అడిగితే పెద్దదానివి అని నిన్ను వదిలేస్తున్నా అని అంటుంది. ఇద్దరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.
ఊర్వశి తల్లితో ప్లాన్ ఫెయిల్ అయింది అంటే ఏం పర్లేదే ప్లాన్ బీ ఉందని గాయత్రీ తీసుకెళ్లే పాలలో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కలిపానని చెప్తుంది. ఇద్దరూ పాలు పంచుకొని తాగి చక్కగా నిద్రపోతారని అంటుంది. గాయత్రీ పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. అందరూ సంతోషంగా గాయత్రీని ఆశీర్వదిస్తారు. త్రిపుర పాల గ్లాస్ తీసుకొని వచ్చి గాయత్రీకి ఇస్తుంది. గాయత్రీ పాల గ్లాస్‌తో గదిలోకి వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున జడలో పూలపెట్టిన దేవా.. భాను గుండె ముక్కలైపోయిందా!





















