Ennallo Vechina Hrudayam Serial Today March 12th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: త్రిపుర సూసైడ్ చేసుకుంటుందని బాల సీరియస్.. అనంత్ కంపెనీలో గాయత్రీ!
Ennallo Vechina Hrudayam Today Episode త్రిపురకు తన స్టూడెంట్ తల్లి ఇళ్లు చూడటం అక్కాచెళ్లెళ్లు ఉద్యోగాల వేటలో పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode బాల తన తాతయ్యని పొడిచి చంపిన రౌడీలను కారులో ఫాలో అవుతాడు. ఇంతలో సమీపంలో క్రికెట్ ఆడుతున్న కొంత మంది చెట్టు మీదకు బాల్ కొట్టడంతో అక్కడున్న చాలా సీతాకోక చిలుకలు బాల కారు వైపు వస్తాయి. అవి రావడంతో వాటి వల్ల ఇరిటేట్ అయి అటుగా వస్తున్న త్రిపుర తండ్రిని బాల ఢీ కొడతాడు. దాంతో త్రిపుర తండ్రి చనిపోతాడు. బాల ఆ యాక్సిడెంట్ వల్లే చిన్న పిల్లాడిలా మారిపోతాడు.
త్రిపుర తన ఫ్యామిలీతో కలిసి సిటీకి వస్తుంది. ఏం చేయాలి చేతిలో డబ్బు కూడా లేదని అందరూ అనుకుంటారు. రమాదేవి ఈ పరిస్థితి మొత్తం త్రిపుర వల్ల వచ్చింది త్రిపుర గిరికి పెళ్లి చేసుకుంటే సరిపోతుందని అంటుంది. దాంతో అందరూ నీకు ఇష్టం లేకపోతే నువ్వు నీ కూతురు వెళ్లిపోండి అని అంటారు. దాంతో మేం మీతోనే ఉంటామని రమాప్రభ చెప్తుంది. రెంట్ ఎలా కట్టాలా అని ఊర్వశి అంటే నీ చేతి రింగులు ఇచ్చేయ్ అని గాయత్రీ అంటుంది. దాంతో తల్లీకూతుళ్లు నాటకం ఆడుతారు. ఇక త్రిపుర గతంలో కాపాడిన ప్రియ తన తల్లితో వస్తుంది. భర్తకి యాక్సిడెంట్ తర్వాత సిటీకి వచ్చేశాం అని చెప్తుంది. త్రిపుర వాళ్ల పరిస్థితి చూసి ఓ ఇళ్లు ఉందని కానీ అక్కడ నాటకాలు వాళ్లు ఉంటారు వాళ్లతో కాస్త ఇబ్బంది అని అంటుంది. మేం సర్దుకుంటామని త్రిపుర చెప్తుంది. వాళ్లని తీసుకొని ప్రియ తల్లి అద్దె ఇంటికి తీసుకెళ్తుంది.
జైలులో ఉన్న గిరి త్రిపుర ఎక్కడికి వెళ్లినా వదలను అనుకొని రౌడీలను త్రిపుర వాళ్లని ఫాలో అవ్వమంటారు. త్రిపుర వాళ్లు అద్దె ఇంటికి వస్తారు. నాటకాలు వేసే వాళ్లు హనుమంతుడు, కృష్ణ ఇలా రకరకాల గెటప్‌లు వేస్తారు. బాల కృష్ణుడి కోసం రుక్మిణి, ఆమె వెంట సత్య భామ, తోడుగా సూర్పణక కూడా వచ్చిందని అనుకుంటారు. త్రిపుర వాళ్లు నాటకాలు వాళ్లతో మాట్లాడుతారు. రెంట్ ఎంత అంతే మీరు ఎంత ఇస్తే అంత అని అడ్వాన్స్ ఏం అవసరం లేదని కానీ తాము నాటకాలు వేస్తూ అరిస్తే అరవొద్దని చెప్పొద్దని.. మా ఏకాగ్రతకు భంగం కలిగించొద్దని చెప్తారు. త్రిపుర వాళ్లు ఇంట్లోకి చేరుతారు. రమాదేవి, ఊర్వశి తప్ప మిగతా అందరూ ఇళ్లు సర్దుతారు. నాటకాలు వేసే వాళ్లు సౌండ్‌కి ఇళ్లు దద్దరిల్లుపోతుంది. ఏంటి ఈ తలనొప్పి అని రమాదేవి అంటే అయితే చెట్టు కిందకి వెళ్లిపోదామా అంటుంది.
త్రిపుర, గాయత్రీ, ప్రసాద్‌లు ఉద్యోగాలు చూసుకుంటామని అంటే తాతయ్య కూడా పని చేస్తామంటే త్రిపుర వాళ్లు వద్దని అంటారు. మీరు వెళ్లగానే ఉద్యోగాలు ఇచ్చేస్తారా అని సెటైర్లు వేస్తారు. కోడలు అత్తతో అత్తయ్య ఇక్కడ పెద్ద పెద్ద ఇళ్లలో నీకు ఏమైనా పని చూడమంటావా అంటుంది. దాంతో రమాదేవి కోడలి నోరు అదుపులో పెట్టురా అని కొడుకుకి కంప్లైంట్ ఇస్తుంది. నీ నోరు బాగుంటే దాని నోరు బాగుంటుందని అంటుంది. ఇక త్రిపుర ఓ స్కూల్‌కి వెళ్లి ఉద్యోగం అడిగితే పళ్లెటూరి టీచర్ ఇక్కడ చెప్పలేవని పంపేస్తారు. త్రిపుర బాధగా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే ఓ లారీ త్రిపురని గుద్దేయబోతుంది. అక్కడే ఫోన్ మాట్లాడుతున్న బాల చూసి త్రిపురని కాపాడుతాడు. త్రిపుర బాలని చూసి గతంలో తాను బాలతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటుంది. బతుకు కోసం పోరాడకుండా చావు కోసం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారేంటి అని త్రిపుర ఆత్మ హత్య చేసుకుంటుందని అనుకొని బాల త్రిపురని కోప్పడతాడు. త్రిపుర తాను సూసైడ్ చేసుకోవడం లేదని చెప్పబోయినా బాల వినడు. ఆటోని పిలిచి త్రిపురని ఎక్కించి డ్రైవర్‌కి డబ్బులు ఇచ్చి మేడం చెప్పిన అడ్రస్‌లో దించమని అంటాడు. త్రిపుర బాలనే చూస్తూ ఉంటుంది. అనంత్ ఆఫీస్‌కి వెళ్తాడు. ఆఫీస్‌లో ఇంటర్యూలు ఉండటంలో అనంత్ ఇంటర్యూలు మొదలు పెడతాడు. గాయత్రీ కూడా అదే ఆఫీస్‌కి వస్తుంది. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: ఏసీపీ విజయ్ ఎంట్రీ అదుర్స్.. ఆపరేషన్ కావేరి 'గేమ్ స్టార్ట్స్ నౌ'..!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

