Ennallo Vechina Hrudayam Serial Today April 5th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: అనంత్ గాయత్రీ మెడలో తాళి కట్టేస్తాడా.. తల్లీకూతుళ్లకు దొరికిన సాక్ష్యం ఏంటి?
Ennallo Vechina Hrudayam Today Episode బాల త్రిపుర బొమ్మ గీయడం వాసుకి వాళ్లు వచ్చి త్రిపురని గాయత్రీని అవమానించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode గాయత్రీని మాత్రమే పెళ్లి చేసుకుంటానని అనంత్ ఇంట్లో చెప్తాడు. దాంతో రమాప్రభ చెప్పినట్లు వాసుకి వాళ్లు అందరినీ ఆపి గాయత్రీ క్యారెక్టర్ మంచిది కాదు అని మరో అబ్బాయితో చనువుగా ఉన్నట్లు క్రియేట్ చేసిన ఫొటోలు అందరికీ చూపిస్తుంది. దాంతో బామ్మ త్రిపుర వాళ్లు ఎంత చెప్పినా వినకుండా ఇలాంటి అమ్మాయి మాకు వద్దు అని ఊర్వశితో అనంత్ పెళ్లి ఫిక్స్ చేస్తుంది. అనంత్ బాగా ఆలోచించి ఇంట్లో వాళ్లకు తెలీకుండా గాయత్రీని పెళ్లి చేసుకోవాలని గుడికి వెళ్తాడు.
అనంత్ తాళి కట్టేస్తాడా..
బాల అనంత్‌ని ఫాలో అవుతూ త్రిపుర గాయత్రీ కోసం వెతుకుతూ ఉండగా బాలని కలిసి ఇద్దరూ గుడికి పరుగులు తీస్తారు. అక్కకి పెళ్లి అవ్వకుండా నాకు పెళ్లి వద్దు అని గాయత్రీ చెప్పినా అనంత్ వినడు. నువ్వు నిజంగా ప్రేమిస్తే ఏం మాట్లాడకు అని చెప్తాడు. అనంత్ గాయత్రీకి తాళి కట్టే టైంకి త్రిపుర వచ్చి తాళి లాగేస్తుంది. గాయత్రీ మీద పడిన నింద నేను నమ్మడం లేదు మా పెళ్లి ఆపొద్దని అనంత్ అంటాడు. దానికి త్రిపుర మీరు ఇలా తాళి కడితే ఆ చెల్లి మీద పడిన నింద తొలగిపోతుందా. తనని మీరు ఇంటికి తీసుకెళ్తే తన పరిస్థితి ఏంటి అని నిలదీస్తుంది.
మీ పెళ్లి నేను చేస్తా..
బాల అనంత్‌తో సుందరి చెప్పింది కరెక్టేరా నిన్నే అందరూ గాయత్రీని తిట్టారు ఇప్పుడు ఇంకా తిడతారు అని అంటాడు. త్రిపుర వాళ్లతో పారిపోయి పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాలు ఇబ్బంది పడతాయి అని చెప్తుంది. ఇలా పెళ్లి చేసుకొని మా చెల్లిని మీ ఇంటికి తీసుకెళ్తే మా చెల్లి మీ ఇంట్లో సంతోషంగా ఆనందంగా ఉండగలదా మీ కుటుంబంలో ఒకరిగా తనని చూస్తారా. ఇంటి కోడలిగా తనని అంగీకరిస్తారా సూటి పోటి మాటలతో నా చెల్లిని చిత్రవధ చేస్తారని చెప్పి త్రిపుర ఏడుస్తుంది. గాయత్రీ అక్కని హత్తుకొని ఏడుస్తుంది. త్రిపుర గాయత్రీ కన్నీరు తుడిచి ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయకు. నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు అని తెలిసిన తర్వాతే మీ పెళ్లి నేనే దగ్గరుండి అందరి అంగీకారంతో మీ పెళ్లి చేస్తానని అంటుంది. ఊర్వశితో పెళ్లి అయిపోతే అని గాయత్రీ అంటే ఈ లోపే ఈ సమస్య పరిష్కరిస్తాను అని అంటుంది.
అలాంటి పరిస్థితి వస్తే చనిపోతా..
అనంత్ గాయత్రీని తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోనని అలాంటి పరిస్థితి వస్తే ఈ ఊపిరి ఆగిపోతుందని అనంత్ అంటాడు. బాల త్రిపుర చేయి తీసుకొని ఇంకెప్పుడూ ఇలాంటి పని చేయమని సుందరి చేతిలో చేయి వేసి ఇద్దరికీ చెప్పమని అంటాడు. అనంత్, గాయత్రీ ఇద్దరూ త్రిపుర చేతిలో చేయి వేసి ప్రామిస్ చేస్తారు.
కంప్లైంట్ ఇచ్చిన అక్కాచెల్లెళ్లు..
త్రిపుర గాయత్రీని తీసుకొని వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. కంప్లైంట్ ఇస్తే మార్ఫింగ్ ఫొటోల గురించి తెలుస్తుందని అప్పుడు నిన్ను బామ్మ దగ్గరకు తీసుకెళ్లి మీ పెళ్లి జరిగేలా చేస్తానని త్రిపుర అంటుంది. ఇద్దరూ ఫొటోలతో పాటు కంప్లైంట్ ఇస్తారు. ఫొటోలు మాత్రమే ఉంటే ఇదంతా ఎవరు చేశారో కనిపెట్టడం కష్టమని పోలీసులు అంటారు. అలా అనొద్దని తన చెల్లికి జరగాల్సిన పెళ్లి ఆగిపోయిందని త్రిపుర బతిమాలుతుంది. మా ప్రయత్నం మేం చేస్తామని పోలీసులు అంటాడు.
వీడియోకి తల్లీకూతుళ్లు షాక్..
ఊర్వశి, రమాప్రభలు ఇద్దరూ ఫేస్ ప్యాక్ పెట్టుకుంటారు. కోటీశ్వరుల వియ్యపురాలని అని రమాప్రభ గొప్పలకుపోతుంది. ఇంతలో వాళ్ల ఫోన్‌కి అనంత్, గాయత్రీల పెళ్లి చేసుకోబోయిన వీడియో పంపిస్తారు అక్కడి రమాప్రభ మనిషి అయిన ఓ పంతులు. దేవుడు మనవైపే ఉన్నాడని రమాప్రభ అంటుంది. త్రిపుర నింద నిరూపిస్తాను అంటే నేను చూస్తూ ఊరుకోను అని అంటుంది. ఈ సాక్ష్యంతో ఆటని తిప్పేస్తానని రమాప్రభ అంటుంది. ఇద్దరూ కంప్లైంట్ ఇచ్చారని ఊర్వశి చెప్తుంది.
సుందరి బొమ్మ గీసిన బాల..
త్రిపుర బాలకి కషాయం తాగమని అంటుంది. దాంతో బాలు నేను కషాయం తాగాలి అంటే నువ్వు కదలకుండా నిల్చొంటే నీ బొమ్మ గీస్తానని అంటాడు.. దాంతో త్రిపుర సరే అంటుంది. బాల బొమ్మ గీసి త్రిపుర కళ్లు మూసుకొని తీసుకెళ్లి చూపిస్తాడు. త్రిపురకు రెక్కలు వచ్చినట్లు కిరీటం పెట్టుకొని ఏంజెల్‌లా గీస్తాడు. అది చూసి త్రిపుర చాలా బాగుందని చెప్తుంది. నువ్వు నాకు ఏంజెల్‌లా కనిపిస్తావని అందుకే ఏంజెల్‌లా గీశానని చెప్తాడు. కషాయం తాగమని త్రిపుర చెప్తే బాల తాగను అంటాడు. అయితే ఏంజెల్ ఇచ్చినా తాగరా అని అంటే బాల తాగేస్తాడు.
అది వాడికి ఏంజెల్ మనకు డెవిల్..
వాసుకి, తన భర్త త్రిపురని చూసి ఇది వాడికి ఏంజెల్ మనకు డెవిల్ అనుకుంటారు. త్రిపుర బాలని మార్చేలా ఉందని త్రిపురని అవమానించి పంపేయాలని అనుకుంటారు. త్రిపుర దగ్గరకు వెళ్లి బొమ్మలో తనతో పాటు తన చెల్లి ఫొటో గీయాలి అంటారు. చెల్లి పక్కన ఎవరో ఒకరు లేకపోతే గీయలేరని డబ్బు కోసం అలాంటి పనులు చేస్తారని డబ్బు కోసం కోటీశ్వరుల పిల్లల్ని ఎర వేస్తున్నారని అవమానిస్తారు. తన పర్సనల్ విషయాలు మనకు ఎందుకు అని బామ్మ, యశోద ఆపుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: అసలైన వారసురాలు ఎవరు నాన్న? కాశీ, స్వప్నల ఎంక్వైరీ





















