Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today October 9th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జరుగుతున్నది పెళ్లే అని తెలుసుకున్న మనీషా, దేవయాని, లక్ష్మీలు.. ముగ్గురిలో ఎవరు పెళ్లి ఆపుతారో?
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode పంతులు చేస్తుంది పూజ కాదు పెళ్లి అని మనీషా దేవయానికి చెప్పడం మిత్ర వాళ్ల మాటల లక్ష్మీ వినేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode వివేక్, సంజనల ప్లాన్ ప్రకారం పంతులు పెళ్లి తంతు ప్రారంభిస్తారు. ముందుగా వివేక్‌తో గణపతి పూజ చేయించిన పంతులు జానుతో గౌరీ పూజ చేయించడానికి ఎవరికీ అర్థం కాకుండా పెళ్లి కాని అమ్మాయితో గౌరీ పూజ చేయించాలి మీలో ఎవరైనా ఉంటే రండి అని పిలుస్తాడు. మనీషా వస్తే నువ్వు సంజనకు ఏమవుతావు తనకు స్వయానా బంధం ఉన్న వాళ్లే ఈ పూజ చేయాలి అంటాడు.
జాను తమకు బంధువని జయదేవ్ చెప్పడం మిత్ర కూడా సపోర్ట్ చేయడంతో పంతులు జానుని కూర్చొమని చెప్తాడు. సంజన దగ్గరుండి జానుని కూర్చొబెడుతుంది. లక్ష్మీ, మనీషాలకు అనుమానంగా ఉంటుంది.
పంతులు: అమ్మా మీ అమ్మనాన్నలు ఎక్కడ.
దేవయాని: తనకు తల్లీదండ్రులు లేరు.
జయదేవ్: అక్కా బావలు ఉన్నారు కదా దేవయాని.
పంతులు: శుభం వాళ్లు వచ్చి కూర్చొండి. మిత్ర, లక్ష్మీలు కూర్చొంటే పంతులు పూజ చేస్తారు.
లక్ష్మీ: వీళ్లు ఏదో చేస్తున్నారు అర్థం కావడం లేదు. అడుగుదామంటే ఈయన ఆఖరి వారకు ఏం అడగొద్దు.
అరవింద: మనసులో ఇందాక వివేక్‌తో గణపతి పూజ ఇప్పుడు జానుతో గౌరీ పూజ ఇదేదో పెళ్లిలా ఉంది.
మనీషా: ఇక్కడేం జరుగుతుంది ఆంటీ. ఇది సంజనకు సంబంధించిన పూజ లేక వివేక్ జానుల పెళ్లా.
దేవయాని: పెళ్లి అయితే కాదులే ఇప్పటికే సంజనకు చాలా సార్లు అడిగా పదే పదే అడిగితే అది ఏడుస్తుంది.
అరవింద: కొంప తీసి ఇది వివేక్ జానుల పెళ్లి కాదు కదా ఏవండీ ఒకసారి ఇటు రండి. ఇది శాంతి పూజ అన్నారు ఇలా ఉందేంటి ఒకసారి మనం దీక్షితులు గారిని అడుగుదాం.
జయదేవ్: జరుగుతున్నది వివేక్, జానుల పెళ్లే.
అరవింద: ఏమంటున్నారండీ ఈ విషయం మీకు ముందే తెలుసా.
జయదేవ్: ముందే తెలిసింది మనం చెప్పిన మాటలు వివేక్ మీద బాగా పని చేశాయి. అందుకే ఇలా సొంత నిర్ణయం తీసుకున్నాడు.
అరవింద: మంచి పనే కానీ తల్లికి తెలీకుండా పెళ్లి చేసుకోవడం తప్పు కదా.
జయదేవ్: మరి దేవయాని ఒప్పుకోవడం లేదు కదా. అందుకే తప్పని సరిగా వివేక్ ఇలా చేస్తున్నాడు.
అరవింద: అయినా సరే ఇలా చేయడం సరి కాదు అనిపిస్తుంది. విషయం లక్ష్మీకి తెలుసా
జయదేవ్: లక్ష్మీకి తెలిస్తే అస్సలు ఒప్పుకోదు. జాను పెళ్లి చేయాలి అని లక్ష్మీ చాలా ఆశ పడింది అందుకే ఈ పెళ్లి అయిన వరకు లక్ష్మీకి ఏం చెప్పొద్దు. నీకు ఎందుకు చెప్పాను అంటే తర్వాత తంతులకు నువ్వు కవర్ చేయాలి కాబట్టి.
అరవింద: నా చిన్న కొడుకు పెళ్లి కోసం ఆ మాత్రం చేయనా.
వివేక్ క్షమించమని అరవిందకు సైగ చేస్తాడు. అరవిందకు భరోసా ఇస్తుంది. అది దేవయాని చూసి ఏదో జరుగుతుందని అంటుంది. పూజ లా ఉన్నా ఇది పూజ కాదు అని దేవయాని అంటుంది. ఏం చేద్దామని దేవయాని మనీషా అడిగితే కాసేపు చూద్దామని మనీషా అంటుంది. ఇక పంతులు గౌరీ పూజ అయిపోగానే హోమం చేయాలి అంటే మనీషా, దేవయాని ప్రశ్నిస్తారు. పంతులు కవర్ చేస్తారు. పంతులు కన్యాదానం అయిన తర్వాత హోమం చేద్దామని అంటే లక్ష్మీ ప్రశ్నిస్తుంది. దాంతో పంతులు కవర్ చేస్తారు. ఇక హోమంలో వివేక్, జానులను కూర్చొమంటే దానికి దేవయాని వివేక్ చేతికి తాళి ఇవ్వండి జానుకి కట్టేస్తాడు అంటుంది. పూజ చాలా విభిన్నంగా ఉందని లక్ష్మీ అంటే ఎవరి పద్ధతులు వాళ్లకు ఉంటాయని కవర్ చేస్తారు. మొత్తానికి కవర్ చేస్తారు. మిత్ర మనీషాని సైలెంట్‌గా ఉండమని అంటాడు. ఏం చేయాలి అనుకుంటున్నారో అన్నీ చేయమని పంతులుతో మిత్ర చెప్తాడు.
పంతులు వేరే చోట అమ్మవారి దగ్గరున్న తాళిని సంజనకు ఎవరూ చూడకుండా ఇస్తారు. అది మనీషా చూసేస్తుంది. సంజనను ప్రశ్నిస్తుంది. దానికి సంజన అమ్మవారి తాళి హోమంలో పెట్టాలని చెప్పి వెళ్లిపోతుంది. ఏదో అనుమానంగా ఉందని మనీషా అనుకుంటుంది. జానుని ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటే హోటల్‌లో జరిగిన దానికి ఇది రివేంజే రివేంజ్ అంటే ఇది జాను పెళ్లే అని అంటుంది. నిజంగా దేవయాని చెప్పాలని విషయం దేవయానికి చెప్తుంది. మరోవైపు మనీషా, దేవయానిలు మాట్లాడుకోవడం వివేక్ వినేస్తాడు. ఇక మిత్ర తన తల్లిదండ్రులతో మాట్లాడటం లక్ష్మీ వినేస్తుంది. పెళ్లి ఏంటి ఇలా అని అడుగుతుంది. తప్పడం లేదని అరవింద అంటుంది. దానికి లక్ష్మీ జాను వివేక్‌ల పెళ్లి ఇలా జరగాలి అని అనుకోవడం లేదని తాను ఒప్పుకోనని లక్ష్మీ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.