అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today October 8th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ప్రీతి, ఉషల్ని చంపేస్తా అని మహాని బెదిరించిన సీత.. పిన్ని, తండ్రిని కొట్టమని రామ్‌తో చెప్పిన సీత!

Seethe Ramudi Katnam Today Episode రేవతి, కిరణ్‌లను రిజిస్టర్ ఆఫీస్ దగ్గరకు తీసుకురాకపోతే ప్రీతి, ఉషలను చంపేస్తా అని సీత మహాలక్ష్మీని బెదిరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీత చెప్పడంతో శివ ప్రీతి, ఉషల్ని కిడ్నాప్ చేస్తుంది. శివ ప్రీతి, ఉషల్ని తన బావ ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో వీడియో కాల్ చేసి సీతకు చూపిస్తుంది. కిడ్రాప్ చేసిన వాడు ప్రేమతో చంపేస్తున్నాడని అంటుంది సీత. ఇక సీత తన ప్లాన్ శివతో చెప్తుంది. 

సీత: మై డియర్ అత్తయ్యలు మామయ్యలు ఇప్పుడు మీకు మొదలవుతుందో అసలైన టెన్షన్.
శివ: మహాలక్ష్మీతో నేనే మేడం కిడ్నాపర్లం. మాకు రేవతి, కిరణ్‌లు కావాలి. వాళ్ల పెళ్లి జరగాలి. ఒక గంటలో వాళ్లిద్దరూ రిజిస్టర్ ఆఫీస్‌లో ఉండాలి.
మహాలక్ష్మీ: ఎవరు మీరు మీకు రేవతి, కిరణ్‌లకు సంబంధం ఏంటి.
గంగాధర్: అదంతా మీకు అనవసరం మేం చెప్పినట్లు చేయకపోతే మీ పిల్లల పని అయిపోతుంది.  
ప్రీతి: త్వరగా వీళ్లు చెప్పింది చేయ్ పిన్ని లేదంటే మమల్ని ఏదో ఒకటి చేసేలా ఉన్నారు.
మహాలక్ష్మీ: వాళ్లేం చేయరు మీరు టెన్షన్ పడకండి.
ఉష: వాళ్లేం చేయకపోయినా పర్లేదు కానీ రేపు మేం పరీక్ష రాయకపోతే మా లైఫ్ పోతుంది పెద్దమ్మ.

ఇదంతా కిరణే  చేయించుంటాడని మహాలక్ష్మీ అంటుంది. పిల్లలకు ఏడాది వేస్ట్ అయిపోతుందని అర్చన, గిరిధర్‌లు చెప్తారు. మహాలక్ష్మీ  ఏం కాదు అంటే ప్రీతి నీ కూతురు కాదు కాబట్టే ఇలా మాట్లాడుతున్నావని అంటుంది. దానికి మహాలక్ష్మీ ప్రీతి నా కన్న కూతురు కాకపోయినా ఉష మీ కన్న కూతురు అయినా వాళ్లిద్దరూ నా పిల్లలే అని అంటుంది. ఇక గిరిధర్ రేవతిని కిడ్నాప్ చేసినట్లు పిల్లల్ని కూడా నువ్వే కిడ్నాప్ చేశావా పిన్ని అని అడుగుతాడు. 

మహాలక్ష్మీ: ఏం మాట్లాడుతున్నావ్ గిరి రేవతిని కిడ్నాప్ చేయడం అవసరం పిల్లల్ని చేయడం నాకు ఏం అవసరం.
జనార్థన్: ఇప్పుడు ఎలా అయినా పిల్లల్ని విడిపించడం అవసరం. 
మహాలక్ష్మీ: ముహూర్తం వరకు అయినా ఆగండి జనా ఈ పెళ్లి ఎలా అయినా ఆగాలి. 
అర్చన: కిడ్నాపర్లు పెళ్లి జరగాలి అంటున్నారు నువ్వు వద్దు అంటున్నావ్. మధ్యలో పిల్లల గతి ఏం కావాలి మహా వాళ్లని చంపేయాలి అనుకుంటున్నావా.
మహాలక్ష్మీ: ఈ ఇయర్ కాకపోతే నెస్ట్ ఇయర్ పరీక్ష రాస్తారు. సరే ఒక పని చేస్తా కిడ్నాపర్ల ఫోన్ నెంబర్ల ఆధారంగా లొకేషన్ రౌడీలకు చెప్పి పిల్లల్ని కాపాడిస్తా.

సీన్ కట్ చేస్తే ప్రీతి, ఉషలు ఉన్న చోటుకు రౌడీలు వస్తారు. రౌడీలు గంగాధర్‌ని కొట్టడానికి వస్తే గంగాధర్ వాళ్లని చితక్కొడతాడు. ఇక ఓ రౌడీ శివ గొంతు మీద కత్తి పెట్టి పిల్లల్ని వదలమంటాడు. దానికి గంగాధర్ నేను మామూలుగా కొట్టా తను పోలీస్ చితక్కొడుతుందని అంటే శివ రంగంలోకి దిగుతుంది. ఇద్దరూ కలిసి రౌడీలను కొడతారు. దాంతో రౌడీలు పారిపోతారు. రౌడీలు మహాలక్ష్మీకి ఫోన్ చేసి విషయం చెప్తారు. ఇద్దరూ చితక్కొట్టేశారని చెప్తారు. ఇంతలో మహాలక్ష్మీకి సీత కాల్ చేస్తుంది. 

మహాలక్ష్మీ: మధ్యలో దీని గోల ఏంటి?
సీత: హలో అత్తయ్యా ఏంటి టెన్షన్‌లో ఉన్నారు కొంప తీసి ప్రీతి, ఉషలు కిడ్నాప్ అయ్యారా. గంటలో రేవతి పిన్ని, కిరణ్ గారిని తీసుకురాకపోతే ప్రీతి, ఉషల్ని చంపేస్తామని కిడ్నాపర్లు బెదిరిస్తున్నారా. ప్రీతి, ఉషల్ని కిడ్నాప్ చేయించింది నేనే మామయ్య. 
మహాలక్ష్మీ: ఏంటి వాళ్లని నువ్వు కిడ్నాప్ చేయించావా.
సీత: ఏంటి అత్తయ్య మీరు రేవతి పిన్నిని కిడ్నాప్ చేయించలేదా. మీరు ఒకర్ని కిడ్నాప్ చేస్తే నేను ఇద్దరిని చేశాను ఎంతైనా మనం అత్తా కోడళ్లం కదా. గంటలో రేవతి పిన్ని, కిరణ్ గారు రిజిస్టర్ ఆఫీస్‌కి రాకపోతే పిల్లలు ప్రాణాలతో ఉండరు.
మహాలక్ష్మీ: నన్నే బెదిరిస్తావా. చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్ సీత. 
సీత: మీరు పిన్ని వాళ్లని రిజిస్టర్ ఆఫీస్‌కి తీసుకురాకపోతే పిల్లల్ని చంపేయ్ మని కిడ్నాపర్లకు చెప్పా. 

రేవతి పిల్లల కోసం ఏడుస్తుంది. సీత చెప్పింది చేయమని మహాలక్ష్మీతో చెప్తారు. రామ్ సీత ఫోన్‌లో మాట్లాడిన మాటలు విని సీత దగ్గరకు వస్తాడు. ఏదో చేస్తావ్ అనుకుంటే ఇలా చేస్తావా మా చెల్లిల్నే కిడ్నాప్ చేయిస్తావా అని కొట్టడానికి సీత మీద చేయి ఎత్తుతాడు. దానికి సీత అడ్డు కొని నువ్వు కొట్టాల్సింది నన్ను కాదు మీ పిన్నిని, నాన్న వాళ్లందరినీ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ కోసం జ్యోత్స్న పోరాటం.. తాత నిర్ణయం విన్న జ్యోత్స్న నిజంగానే చనిపోతుందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాకింగ్ న్యూస్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాకింగ్ న్యూస్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Hydra Commissioner: కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ram Charan Kadapa Durga Temple | కడప కనకదుర్గ గుడిలో రామ్ చరణ్, బుచ్చిబాబు | ABP DesamRam Charan in Kadapa Ameen Peer Dargah | అయ్యప్పమాలలో దర్గాలోపలికి రామ్ చరణ్ | ABP DesamPM Modi Meets Joe Biden in G20 Summit | పదవి దిగే ముందు మోదీ-బైడెన్‌ భేటీNizamabad Mayor Husband | మేయర్ భర్త ఉంటాడో పోతాడో తెలీదంటూ దాడి చేసిన వ్యక్తి సంచలన వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాకింగ్ న్యూస్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాకింగ్ న్యూస్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Hydra Commissioner: కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Viral News : గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
Investment Tips: ఆర్థిక సంక్షోభంలో ఆపద్బాంధవి 'గోల్డ్ లోన్‌' - ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా?
ఆర్థిక సంక్షోభంలో ఆపద్బాంధవి 'గోల్డ్ లోన్‌' - ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా?
BRS News: తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
Embed widget