Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today October 22nd: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: వామ్మో మనీషా ఇంత నడిపించావా.. లక్ష్మీని నోటికొచ్చినట్లు తిట్టిన మిత్ర!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్రని ఛైర్మన్ పదవి నుంచి దింపడానికి లక్ష్మీని తప్పుగా మిత్ర అనుకోవడానికి సరయుని రంగంలోకి మనీషా తీసుకురావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode కంపెనీలో ఎవరి వాటా ఎక్కువ ఉంటే వాళ్లే ఛైర్మన్ అవుతారని సరయు అంటుంది. మీ పార్టనర్స్ అందరూ ఇప్పుడు మా పార్టనర్స్ అని వాళ్లు షేర్లు అన్నీ నాకు ఇస్తున్నారని సరయు అంటుంది. దానికి మనీషా అలా ఎలా మారిపోతారు అది తప్పు కదా అంటుంది. సరయు దానికి కంపెనీ నష్టాల్లో ఉంటే మీతో ఎలా ఉంటారని అంటుంది.
సరయు: అలా కాదు మనీషా లాభాలు తెచ్చే వారి వైపే పార్టనర్స్ ఉంటారు.
మిత్ర: నాకు కొంచెం టైం ఇవ్వండి అంతా సెట్ చేస్తా.
పార్టనర్స్: మాకు నమ్మకం లేదు సార్. ఆవిడ ఉన్నంత వరకు మీరేం చేయలేరు. మా ఫ్యామిలీ కొట్లాటలు మాకు అవసరం లేదు. మీ ఇంట్లో గొడవలు జరుగుతుంటే కంపెనీనీ ఎలా పట్టించుకుంటారు. మీరు మిత్రా గారిని ఇబ్బంది పెడుతున్నారు ఆయన ఇబ్బంది పడి కంపెనీని వదిలేస్తున్నారు.
సరయు: సో ఇది విషయం షేర్ హోల్డర్స్ అందరూ ఛైర్మన్ మారమంటున్నారు. మీరు టైం అడుగుతున్నారు టైం ఇస్తా కాకపోతే రేపటి వరకే టైం రేపు ఓటింగ్ పెట్టుకొని ఛైర్మన్ ఎవరో డిసైడ్ చేద్దాం.
మిత్ర లేచి వెళ్లిపోతాడు. మనీషా కూడా మిత్ర వెనక పరుగులు తీస్తుంది. షేర్ హోల్డర్స్‌తో మాట్లాడమని అంటుంది. ఇక లక్ష్మీ మీద మనీషా మరి కొంత ఎక్కిస్తుంది. ఇంతలో సరయు వచ్చి ఈ కంపెనీ మీకు దూరం అయిపోయింది రేపు ఓటమి కేవలం నామమాత్రంగా జరుగుతుందని అంటుంది. మిత్ర ఉండగా ఆ చైర్ నీకు దక్కదు అని మనీషా అంటే దానికి సరయు మీ మిత్ర పక్కన లక్ష్మీ అనే దరిద్రం ఉండగా అది జరగదు అంటుంది. ఇక సరయు మిత్రకు రిజైన్ చేయమంటే నీకు అంత మాట అంటుందా దాన్ని చంపేస్తా అని మనీషా మిత్ర వెనక పరుగులు తీస్తుంది. వివేక్ వచ్చి మనీషా ఎక్కడికి వెళ్తుంది అంటే అంతా తన వల్లే అని లక్ష్మీతో అంటాడు. నన్ను ఇలా నడిరోడ్డు మీద నిలబెట్టేసిందని వెళ్లిపోతాడు.
మనీషా, సరయు ఓ చోట కలుస్తారు. ఇద్దరూ కొట్టుకు చస్తారు అనుకునే బిల్డప్ ఇచ్చి ఒకరి చేయి ఒకరు కలుపుకొని హగ్ ఇచ్చి కలిసిపోతారు. మ్యానేజర్ చూసి ఉప్పు నిప్పులా ఉన్న వాళ్లు ఇలా కలిసిపోయారేంటి అనుకుంటాడు. దానికి సరయు మనీషా కోసమే నేను ఇక్కడికి వచ్చాను మనీషా కోసమే మిత్రకు శత్రువుని అయ్యానని అంటుంది. మిత్రని ఛైర్మన్ చైరు నుంచి తప్పించి లక్ష్మీ వల్లే మిత్ర నాశనం అయ్యాడని చెప్పించానని అంటుంది. అంతా ఓకే కానీ కాకపోతే ఆ లక్ష్మీ డేంజర్‌లా ఉందని అంటుంది.
అందరూ ఇంటికి చేరుకుంటారు. ఏమైందని జయదేవ్ మిత్రని అడిగితే షేర్ హోల్డర్స్ అందరూ ఎదురు తిరిగారని, ఛైర్మన్ పదవికి దూరం అవుతున్నానని, లక్కీ గ్రూఫ్ ఆఫ్ కంపెనీలు కాలగర్భంలో కలిసిపోతాయని అంటాడు. నా నెత్తిన ఈ శనిదేవత కూర్చొన్నంత కాలం నేను ఏం చేయలేను అని అంటాడు. లక్ష్మీతో పాటు అందరూ షాక్ అయిపోతారు. ఇంతలో మనీషా అక్కడికి వస్తుంది. దేవయాని, మనీషాలు నవ్వుకుంటారు. నన్ను మానసికంగా ఆర్థికంగా దెబ్బతీసిందని తన వల్లే తలెత్తుకోలేకుండా అయిపోయాని బాధ పడతాడు. హ్యాపీగా ఉన్న నా లైఫ్ లోకి తనని అనవసరంగా తీసుకొచ్చానని తన రూపంలో కష్టాలు, నష్టాల్లో నెట్టారని, లక్ష్మీ వల్ల పర్సనల్, బిజినెస్ అన్నీ లైఫ్‌లు పోయావని అంటాడు.
లక్ష్మీ కంటే మనీషా వెయ్యి రెట్లు బెటర్ అంటాడు. మనీషా, దేవయాని పొంగిపోతారు. మనీషా తన కోసం ఆ సరయుతో ఫైట్ చేసిందని భార్య అని చెప్పుకుంటున్న లక్ష్మీ మాత్రం హెల్ప్ లెస్‌గా మార్చేసిందని అంటాడు. నీ తప్పు ఏం లేదా అని జయదేవ్ అడిగితే లక్ష్మీని పెళ్లి చేసుకోవడమే నా తప్పు అంటాడు. మిత్ర వెళ్లిపోగానే అందరూ లక్ష్మీతో మిత్ర నిన్ను నిందించలేదు అని నువ్వు తన పక్కన లేవని ఇలా చెప్తాడని అంటారు. నువ్వు దూరం అయ్యావని బాధ పడుతున్నాడు కానీ కంపెనీ కోసం కాదని ఉండాల్సిన టైంలో తోడు లేవని బాధ పడుతున్నాడని చెప్తారు. ఇక జయదేవ్ కంపెనీని కాపాడే బాధ్యత లక్ష్మీకే అప్పగిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.