Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today October 20th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర మీద ఎటాక్.. బిజినెస్‌లో ఓడించడానికి రంగంలోకి దిగిన సరయు!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్ర మీద అటాక్ చేసిన రౌడీని లక్ష్మీ చితక్కొట్టి సరయు ఇదంతా చేయించిందని తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జాను మూడో గాజు వేస్తుంటే అది పడకూడదు అని దేవయాని వెంటనే వెళ్లి జానుని తోసేస్తుంది. దాంతో జాను ముందుకు తూలి ఆ గాజు అమ్మవారి త్రిశూలంలో పడిపోతుంది. జాను చాలా సంతోషిస్తే దేవయాని రగిలిపోతుంది. అమ్మవారిని జాను దండం పెట్టుకొని పడకూడదని నాకు తిగిలారు కదా అత్తయ్య కానీ మీ కోరిక అమ్మవారు తిరస్కరించి నా కోరిక తీర్చారని అంటుంది.
దేవయాని: మీరు కలవకూడదు అనేది నా శాసనం.
జాను: మీరు అలా అంటే నేను మరోలా అనుకోవాల్సి వస్తుంది. మిమల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అని నేను మా అక్క అనుకున్నాం. మేం కలవకపోవడమే మీ ఆఖరి మాట అయితే ఇప్పటి వరకు నన్ను లక్ష్మీ చెల్లిగానే చూశారు. ఇప్పుడు వివేక్ భార్యగా చూస్తారు.
దేవయాని: నాకే సవాలు విసురుతున్నావా.
జాను: అవును ఇది మన అత్తాకోడళ్ల సవాలు ఇవాళ వివేక్ భార్యను అయ్యాను తర్వాత మిమల్ని ఒప్పించి ఏడాదిలో మీ ఒడిలో మీ వారసుడిని పెడతా.
దేవయాని: అదే ఏడాదిలో మిమల్ని విడగొడతా ఇదే నా సవాలు.
అందరూ అమ్మవారి పూజలో ఉంటారు. రౌడీలు కూడా అక్కడే అందరిలో కలిసి పోయి ఉంటారు. లక్ష్మీ చుట్టూ పరీక్షించి చూస్తుంటుంది. ఇక లక్ష్మీ కత్తిని అమ్మవారి ముందు గుమ్మడి కాయకు గుచ్చుతుంది. ఇంతలో నలుగు వైపులా బాంబులు పేలుతాయి. అందరూ చెల్లా చెదురు అయి పరుగులు తీస్తారు. పులి వేషంలో ఉన్న ఇద్దరు రౌడీలు మిత్రని పట్టుకొని తీసుకెళ్లిపోవడానికి ప్రయత్నిస్తారు. జాను వివేక్‌ని పిలుస్తుంది. లక్ష్మీ అందరూ ఎక్కడ ఉన్నారా అని చూస్తుంది. దేవయాని మనీషాతో నువ్వే ప్లాన్ చేశావా అని అడిగితే తానేం చేయలేదు అని మనీషా చెప్తుంది. ఇక వివేక్ కోసం దేవయాని వెళ్లిపోతుంది. ఓ వైపు అరవింద, మరోవైపు మనీషా మిత్రల్ని పిలుస్తారు. మిత్రని పులి వేషంలో ఉన్న రౌడీలు కొడుతుంటే లక్ష్మీ వెళ్లి అడ్డుకుంటుంది. ఇక జానుని చూసిన దేవయాని ఒంటరిగా దొరికింది అనుకొని జాను దగ్గరకు మెల్లగా వెళ్తుంటుంది. ఇంకో రౌడీ అమ్మవారి ముందు ఉన్న కత్తి దొంగిలించబోతే లక్ష్మీ చూసి త్రిశూలంతో వాడిని చితక్కొడుతుంది.
మరోవైపు దేవయాని జానుని త్రిశూలం మీదకు తోసేస్తే కరెక్ట్ టైంకి వివేక్ వచ్చి ఆపుతాడు. ఇక లక్ష్మీ రౌడీ గుండెల మీద కాలు వేసి త్రిశూలంతో పొడిచేస్తా నిన్ను ఎవరు పంపారో చెప్పు అని అడుగుతాడు. దాంతో ఆ రౌడీ ఓ మేడం పంపారని చెప్తారని ఆమెను నేను ఎప్పుడూ చూడలేదని ఆమె పీఏ మిత్ర సార్‌ని చంపమని సుపారీ ఇచ్చారని చెప్తాడు. ఇక జేఎమ్మార్ ప్రాజెక్ట్ కోసం మిత్ర ఆ ప్రాజెక్ట్‌లో ఉండకూడదని చంపమన్నారని అందుకే ఓ సారి మిత్రని కిడ్నాప్ చేశామని చెప్తాడు. అప్పుడు మీరు వచ్చి కాపాడారు అని రౌడీ చెప్పడంతో మిత్ర తనని కాపాడింది మనీషా కాదా మిత్ర అని మొత్తం గుర్తు చేసుకుంటాడు. ఇక ఆ రౌడీకి లక్ష్మీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుంది. మనీషా దేవయానితో నేను అనుకున్నవేవీ జరగలేదు లక్ష్మీ విశ్వరూపం చూశామని అంటుంది. ఇక తర్వాత లక్ష్మీ అమ్మవారికి హారతి ఇచ్చి పూజ ముగిస్తుంది.
ఇక మిత్రని చంపాలి అనుకున్న బిజినెస్ ఉమెన్ సరయుని చూపిస్తారు. ఆఫీస్‌లో అందరూ తనకి బొకేలు ఇచ్చి వెల్ కమ్ చెప్తారు. సరయు రావడం రావడంతోనే తన యాటిట్యూడ్ చూపిస్తుంది. ఓ పెద్దాయన్ని కొట్టి మిత్రని పంపాలని రెండు సార్లు ప్లాన్ చేస్తే రెండు పోగొట్టావ్ అంటుంది. మిత్రని ఓడించడానికి అన్ని ప్లాన్లు వేస్తుంటుంది. మిత్ర షేర్ హోల్డర్స్ అందర్ని తన వైపునకు తిప్పుకుంటుంది. ఈ విషయం మిత్ర ఫ్యామిలీకి తెలుస్తుంది. షేర్ హోల్డర్స్ అందరూ తనకు ఓటు వేస్తే మిత్ర సార్ ఛైర్మన్ పదవి నుంచి తొలిగిపోవాల్సి వస్తుందని అంటారు. దానికి మిత్ర నేను అలాంటి పరిస్థితి రానివ్వనని ఎవరు వచ్చినా ఎదురు వెళ్తానని అంటాడు. దానికి దేవయాని ఈ లక్ష్మీ వల్లే మిత్ర పేరు ఆస్తులు అన్నీ పోతున్నాయి అని అంటుంది. దానికి జాను ఏం నష్టపోయారు అత్తయ్య గారు మిత్ర బావగారు గండాల్లో ఉన్న ప్రతీ సారి కాపాడింది ఈ లక్ష్మీనే. కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది ఈ లక్ష్మీనే అని అంటుంది. లక్ష్మీ జానుని మాట్లాడొద్దు అని అంటే జాను నేను నీ చెల్లి గా మాట్లాడటం లేదు తోటి కోడలిగా మాట్లాడుతున్నా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: ‘మేఘసందేశం’ సీరియల్: భూమితో గొడవ పెట్టుకున్న నక్షత్ర – నక్షత్రను గగన్‌తో తిట్టించిన భూమి