Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర, అరవిందలను కాపాడిన లక్ష్మీ.. నిజం చెప్పకుండా దీక్షితులును ఆపేసిందిగా!
chiranjeevi lakshmi sowbhagyavathi today episode దీక్షితులు గారిని కలిసిన లక్ష్మీ మిత్ర, అరవిందకు తన గురించి చెప్పొద్దని దీక్షితులు గారిని వేడుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: లక్ష్మీ పొగ రావడం చూసి దీక్షితులు గారు ఉండి ఉంటారని పరుగులు తీస్తుంది. దీక్షితులు గారు అమ్మవారికి పూజ చేసి నైవేద్యం పెట్టి మిత్రకు, తనని వెతుక్కుంటూ వచ్చిన అమ్మాయికి ఏం కాకూడదని అనుకుంటారు. ఇంతలో లక్ష్మీ దీక్షితులు గారి దగ్గరకు వస్తుంది. దీక్షితులు గారు లక్ష్మీని గుర్తు పడతారు.
దీక్షితులు: అమ్మా లక్ష్మీ నువ్వు బతికే ఉన్నావా. నువ్వు చనిపోయావు అని ప్రపంచం అంతా నమ్మింది. కానీ నేను నమ్మలేదు. నా నమ్మకమే నిజం అయింది. లక్ష్మీ అసలు ఇన్ని రోజులు ఏమైపోయావు ఎక్కడికి వెళ్లిపోయావ్. లక్ష్మీ గతం మొత్తం చెప్తుంది. అమ్మా లక్ష్మీ ఇన్నాళ్లు నువ్వు ఎదుర్కొన్న సమస్యలు అనుభవించిన కష్టాలు ఈరోజుతో శాశ్వతంగా తొలగిపోతాయి. ఇక నువ్వు ఒంటరిగా బతకాల్సిన అవసరం లేదు. వెంటనే మిత్రకు, అరవిందకు నీ గురించి చెప్పాలి.
లక్ష్మీ: వద్దు దీక్షితులు గారు. నన్ను ఇలా అజ్ఞాతంలోనే ఉండనివ్వండి. నా గురించి నిజం బయట పడితే నేను చేసిన త్యాగానికి అర్థం ఉండదు. నా అజ్ఞాత వాసానికి ఫలితం దక్కదు. మనీషా వేసే ఎత్తుల వల్ల నందన కుంటుంబానికి భవిష్యత్ ఉండదు. నేను బతికే ఉన్నాను అన్న నిజం దాచండి. నేను నందన కుటుంబం సంతోషం కోసమే త్యాగం చేసింది.
దీక్షితులు: నువ్వు నందన కుంటుంబం కోసం త్యాగం చేశావు కానీ ఇప్పుడు మిత్ర ప్రాణం గాలిలో దీపంలా రెపరెపలాడుతుంది. ఎప్పుడు ఎలాంటి గండం వస్తుందో తెలియడం లేదు. నా కోసం వచ్చిన మిత్ర, అరవింద ఇప్పుడు అడవి మొత్తం వెతుకున్నారు. తన భార్య కోసం వెతుకుతున్నాను అని మిత్రకు, తన కోడలి కోసం వస్తున్నా అని అరవిందకు తెలీదు. మిత్ర చుట్టూ మృత్యు దేవత మరణ మృదంగం మోగిస్తుంది.
ఇంతలో పులి గాండ్రింపు వినిపిస్తుంది. అది విన్న దీక్షితులు గారు అది పెద్ద పులి గాండ్రింపు కాదు మిత్ర మీదకు వస్తున్న మృత్యువు. మిత్ర చావుకి ఎదురెళ్తున్నాడు ఏ క్షణం ఏమైనా జరగొచ్చని దీక్షితులు గారు చెప్తారు. లక్ష్మీ తెగ కంగారు పడుతుంది. ఇక అరవింద మిత్ర మిత్ర అంటూ వస్తుంది. అరవిందకు పెద్ద పులి ఎదురు పడుతుంది. అరవింద షాక్ అయిపోయి నిలబడిపోతుంది. అప్పుడే మిత్ర తల్లి ప్రమాదాన్ని గుర్తిస్తాడు. తల్లి దగ్గరకు మెల్లగా వస్తాడు. మిత్రని రావొద్దని అరవింద చెప్పినా వినకుండా తల్లి దగ్గరకు వెళ్తాడు. పులి గాండ్రింపులకు ఇద్దరూ భయపడతారు. మిత్ర తల్లిని మెల్లగా తన దగ్గరకు తెచ్చుకుంటాడు. ఇంతలో లక్ష్మీ పోలీస్ అదికారి దగ్గర గన్ తీసుకొని పైకి కాల్చుతుంది. దీంతో సమీపంలో ఉన్న మిత్ర, అరవిందల దగ్గర ఉన్న పులి పారిపోతుంది. పోలీస్ అధికారి మిత్ర వాళ్ల దగ్గరకు వచ్చి ఏం జరగలేదు కదా అని అడుగుతాడు. మిత్ర, అరవింద, పోలీస్ అధికారి దీక్షితులు గారి దగ్గరకు వస్తారు. లక్ష్మీ ముఖం చాటేసుకుంటుంది.
లక్ష్మీ: దీక్షితులు గారు నేను బతికే ఉన్నాను అన్న విషయం మీ వల్ల ఎవరికి తెలిసినా నా మీద ఒట్టు. మిత్ర, వాళ్లు వచ్చే సరికి లక్ష్మీ ముసుగు వేసుకుంటుంది. ఇక దీక్షితులు గారు లక్ష్మీని మిత్ర, అరవిందల దగ్గర పొగుడుతారు. దీక్షితులు గారి మాటలకు లక్ష్మీ ఏడుస్తుంది. ఇక అరవింద కూడా ఈ అమ్మాయి చేసిని పనికి తన కుటుంబం చాలా అదృష్టం చేసుకొని ఉంటుందని అంటుంది. ఇక అరవింద లక్ష్మీ దగ్గరకు వెళ్తుంది. కృతజ్ఞతలు చెప్తుంది. లక్ష్మీ ఎమోషనల్ అవుతుంది. ఇక లక్ష్మీని అరవింద ముఖం చూపించమని అడుగుతుంది. దీక్షితులు గారు అడ్డుకుంటారు. ఇక అరవిందను ఎందుకు వచ్చావని దీక్షితులు గారు అడిగితే అరవింది మిత్ర పక్కన ఉండగానే కోడలి గురించి మాట్లాడలేను అని అనుకుంటుంది. ఇంతలో మిత్ర మా అమ్మ తన కోడలి గురించి మాట్లాడాలి అనుకుంటుందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.