అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీని కలిసిన జాను, వివేక్.. మిత్ర కోసం ఇంటికి వెళ్లిన లక్ష్మీని అందరూ చూసేస్తారా!

chiranjeevi lakshmi sowbhagyavathi today episode జాను వివేక్‌లు లక్ష్మీని కలిసి మిత్రకు బొట్టు పెట్టి కంకణం కట్టడానికి మిత్ర ఇంటికి తీసుకెళ్లడానికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: వివేక్, జానులు లక్ష్మిని కలవడానికి గుడికి బయల్దేరుతారు. దీక్షితులు గారు లక్ష్మీతో మిత్ర నీతో అడుగడుగునా చేయి కలిపి దీక్షని పరిపూర్ణం చేశాడని మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో జాను వచ్చి అక్కా అని పిలుస్తుంది. లక్ష్మీ వెనక్కి తిరిగి చూస్తుంది. లక్ష్మీని జాను హగ్ చేసుకొని ఏడుస్తుంది. లక్ష్మీ కూడా ఎమోషనల్ అయిపోతుంది.

జాను: నువ్వు చనిపోయావు అనుకొని నేను ఇన్నాళ్లు ఎంత విలవిల్లాడిపోయానో తెలుసా అక్క.
లక్ష్మీ: నాకు తెలుసు జాను. నేను వెళ్లిపోయాక నువ్వు ఎంత విలవిల్లాడిపోయావో నాకు తెలుసు. ఎందుకంటే ప్రతీక్షణం నేను గమనిస్తూనే ఉన్నాను. నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూనే ఉన్నాను జాను. 
జాను: నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కాలేదు అక్క.
లక్ష్మీ: నేను ఇంటికి వచ్చాను జాను అంటూ గతంలో జరిగింది చెప్తుంది. 
వివేక్: వదిన నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లిపోయావ్. ఏమైపోయావ్. అసలు నువ్వు ఎందుకు మమల్ని వదిలి వెళ్లిపోయావ్.
లక్ష్మీ: దానికి ఓ కారణం ఉంది. 
జాను: ఏంటి అక్క అది.
లక్ష్మీ: మనీషా. అంటూ మనీషా గతంలో చేసిన కుట్ర చెప్తుంది. అత్తయ్యని రక్షించడానికి నాకు మరోదారి లేక మనీషా మాట వినాల్సి వచ్చింది. అందరికీ దూరం అవ్వాల్సి వచ్చింది.
జాను: ఆ మనీషా ఇంత చేసిందా. 
వివేక్: అవును జాను మనీషా కుట్ర ప్రవీణ్ మిట్టల్ ద్వారా పెద్దమ్మకు తెలిస్తే పెద్దమ్మ నాకు చెప్పింది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనీషా వాళ్ల అమ్మ చనిపోయిందని పెద్దమ్మ నమ్ముతుంది. అదీ కాక మనీషా, మిత్రలు గతంలో ప్రేమించుకున్నారు. కదా అందుకే మిత్ర మనీషాని పెళ్లి చేసుకుంటాను అంటే ఆ పెళ్లి చేసి పెద్దమ్మ కాస్త ప్రయశ్చిత్తం చేయాలని చూస్తుంది. 
లక్ష్మీ: మిత్ర జున్ను గారి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. 
జాను: ఇప్పుడు నువ్వు బతికున్నావ్ అని కానీ జున్ను నీ బిడ్డ అని కానీ తెలిస్తే చాలా సంతోషిస్తారు. వెంటనే వెళ్దాం పద అక్క.
లక్ష్మీ: వద్దు జాను. మీ అందరికీ నేను ఎదురు పడాలి అంతే ఇంత కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నేను బతికున్నాను అని తెలిస్తే మనీషా కుట్ర చేస్తుంది. అత్తయ్య గారి వల్లే మనీషా అమ్మ చనిపోయిందని పోలీస్‌లకు చెప్పి అరెస్ట్ చేయిస్తుంది. అప్పుడు నేను చేసింది వృథా అయిపోతుంది. నా గురించి ఎవరికీ తెలీకూడదు. మీరు ఈ విషయం ఎవరికైనా చెప్తే నా మీద ఒట్టే. 
దీక్షితులు: అమ్మా లక్ష్మీ.. ఈ హోమంలోని విబూది నువ్వు మిత్ర నుదిటిన బొట్టు పెట్టాలి. కంకణం కట్టాలి. అప్పుడే దీక్ష పరిపూర్ణం అవుతుంది. 

మనీషా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. దేవయాని వచ్చి ఏమైందని అడుగుతుంది. మిత్ర ఎవరో అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు కానీ తన గురించి ఆలోచించడం లేదని బాధ పడుతుంది. తాను ఓ నిర్ణయానికి వచ్చానని దేవయానికి చెప్తుంది. ఏంటని అడిగితే అర్జెంట్‌గా వివేక్ పెళ్లి ఏర్పాట్లు చేయమని అంటుంది. మిత్రకు వివేక్‌కి పెళ్లి జరిగే టైంలోనే మిత్ర కూడా తనని తాళి కట్టేలా చేస్తానని అంటుంది. అందుకు దేవయాని మనీషాకు సపోర్ట్ చేస్తానని అంటుంది. లక్ష్మీని తీసుకొని జాను, వివేక్‌లు మిత్ర ఇంటికి వస్తారు. అందరూ పడుకొని ఉంటారు కాబట్టి మిత్రకు బొట్టు పెట్టి కంకణం కట్టాలని అనుకుంటుంది. దొంగ చాటుగా వెళ్లాలని అనుకుంటుంది. ఇక జాను ఈ టైంలో ఇక్కడుంటడం మంచిది కాదు అని జానుని పంపేయ్‌ మని చెప్తుంది. ఇక వివేక్ లక్ష్మీని బయటే ఉండమని ఎవరూ లేకపోతే చెప్తానని అంటాడు. ఎవరూ లేరని వివేక్ అనుకుంటే దేవయాని వచ్చేస్తుంది.  వివేక్‌కి తిట్టి భోజనం తెస్తానని అంటుంది. ఇంతలో వివేక్ పవర్ కట్ చేస్తానని ఈలోపు తన పని పూర్తి చేయమని లక్ష్మీతో వివేక్ చెప్తాడు. లక్ష్మీ పరుగులు తీస్తుంది. అది దేవయాని చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.   

Also Read: సత్యభామ సీరియల్: సత్య చేసిన తింగరి పనికి కడుపు పట్టుకొని పరుగులు తీసిన క్రిష్.. భార్య అనుకొని పనిమనిషితో..!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Embed widget