Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today January 29th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: అదిరిపోయే ప్లాన్ వేసి తాతని తప్పించేసిన లక్ష్మీ.. నర్శింహ బాంబ్ కుట్రని కనిపెట్టేసిందా!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ నర్శింహతో పాటు తన చుట్టూ ఉన్న ఎవరికీ తెలీకుండా మిత్రతో కలిసి తాత గారిని తప్పించేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీని చంపేస్తానని నర్శింహ వీడియో కాల్ చేసి పార్థసారథి గారితో చెప్తాడు. దాంతో పెద్దాయన ఇది మొదలు పెట్టింది లక్ష్మీ.. ముగించేది కూడా లక్ష్మీనే అని అంటుంది. లక్ష్మీ చిన్న తనంలో కొన్ని వందల మంది కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదని.. స్కూల్‌లో అగ్నిప్రమాదం జరిగితే అందరినీ కాపాడి తాను చివరన వచ్చిందని అలాంటి ధైర్యమున్న లక్ష్మీని నువ్వేం చేయలేవని అంటారు.
మరికాసేపట్లో నీకు సినిమా చూపిస్తా ఆ లక్ష్మీ కోసం ఏడ్వడానికి రెడీ ఉండు అని అంటాడు. ఇక నర్శింహ లాయర్‌తో ఈ లక్ష్మీ కోసం వాళ్ల తాత బాగా బిల్డప్ ఇస్తున్నాడు ఈ లక్ష్మీ ఎలా బతుకుతుందో మనం చూద్దామని అంటాడు. లక్ష్మీ, జాను వాళ్లు రెండు కార్లలో బాంబ్ పెట్టిన వైపు వస్తుంటారు. ఇక మనీషా మనసులో లక్ష్మీ అంత సైలెంట్‌గా ఉందేంటి అనుకుంటుంది. ఇక జాను వివేక్ వాళ్లతో మా అక్క సైలెంట్‌గా ఉంది అంటే నమ్మబుద్ధి కావడం లేదని అంటుంది. అక్క ఏదో ఒకటి చేయకుండా ఊరు దాటదని నా నమ్మకం అని జాను అంటుంది.
ఇక మనీషా కూడా లక్ష్మీని నువ్వు ఏదో ప్లాన్ చేశావని అనిపిస్తుందని అంటుంది. అందరూ లక్ష్మీ ఏదో ప్లాన్ చేసిందని మాట్లాడుకుంటారు. దేవయాని మాత్రం లక్ష్మీ ఏం చేయలేక నోరు మూసుకొని ఉందని అంటుంది. ఇక లక్ష్మీ మనీషాతో నువ్వేం చేయమంటావో చెప్పు మనీషా అది చేస్తా అంటుంది. మిత్ర ఇద్దరితో సిటీకి వెళ్లే వరకు కామ్‌గా ఉండండి అని చెప్తాడు. కొంత దూరం వెళ్లాక మిత్ర కారు టైర్ పంక్చర్ అయిపోతుంది. వెనకాలే వచ్చిన ఇద్దరు రౌడీలు కారు ఎందుకు ఆపారని అడిగితే మేం ఆపలేదని టైర్ పంక్చర్ అయిందని అంటుంది లక్ష్మీ. ఇక రెండు కార్లలో స్టెఫినీ లేకపోవడంతో రౌడీలు నర్శింహకి కాల్ చేసి విషయం చెప్తాడు. లక్ష్మీ వాళ్లు బాంబ్ పెట్టిన చోటుకు వెళ్లాలని స్టెఫినీ ఏర్పాటు చేయమని అంటాడు.
మనీషా: ఇదంతా నేచరల్‌గా అనిపించడం లేదు లక్ష్మీ.
నర్శింహ: అంటే సంథింగ్ రాంగ్ అంటావా లాయర్.
లాయర్: అవును సార్.
మిత్ర: లక్ష్మీ కనీసం నువ్వు అయినా ఏం చేయబోతున్నావో చెప్పు.
లక్ష్మీ: గొంతు ఎండిపోతుంది మనీషా కారులో నీరు ఉంటే ఇస్తావా.
మనీషా: లేవు లక్ష్మీ.
వివేక్: మా కారులోనూ లేవు వదిన.
దేవయాని: అదేంటి రెండు కార్లలో వాటర్ లేవు. స్టెఫినీ లేవు. అంత దూరం వెళ్తుంటే ఇంత నిర్లక్ష్యమా.
మనీషా: నాకు ఏదో డౌట్‌గా ఉంది మిత్ర. లక్ష్మీ ఏదో చేయబోతుంది.
లక్ష్మీ: నేను కొంచెం అలా ముందుకు వెళ్లి వస్తాను.
మిత్ర, లక్ష్మీలు కాస్త ముందుకు వెళ్తారు. ఇంతలో రోడ్డు మీదకు లక్ష్మీ మనుషులు కారు తీసుకొని వస్తారు. లక్ష్మీ మిత్రని ఆ కారులో తొందరగా ఎక్కమని చెప్తుంది. ఇక నర్శింహ మనీషాకి లక్ష్మీ ఏమైనా ప్లాన్ చేసిందా అని అడుగుతాడు. మనీషా ఇప్పుడే వాటర్ కోసం వెళ్లిందని చెప్పడంతో నర్శింహ కంగారు పడతాడు. ఇక మిత్ర, లక్ష్మీ ఓ చోటుకి వస్తారు. ఇక్కడ తాతయ్య ఉన్నారని లక్ష్మీ మిత్రతో చెప్తుంది. నీకు ఎలా తెలుసు అని మిత్ర అడిగితే వీడియో కాల్లో చూసినప్పుడు పసిగట్టానని అంటుంది. ఇక కారు ఆగిపోవడం, స్టేఫినీ లేకపోవడం అంతా తన ప్లానే అని అంటుంది. రౌడీలను మిత్ర కొట్టి తాతయ్యని కాపాడుతారు. తర్వాత తాతయ్యని తన మనుషులతో లక్ష్మీ పంపేస్తుంది. తర్వాత ఏం తెలీనట్లు కార్ల దగ్గరకు వస్తుంది.
నర్శింహ లక్ష్మీకి కాల్ చేసి ఎక్కడికి వెళ్లావ్ ఇప్పుడు కనిపించావ్ అంటాడు. లక్ష్మీ నర్శింహ తమని ఊరు దాటించడం వెనక ఏదో చేస్తున్నాడని అనుకుంటుంది. మిత్ర కారు స్టేఫినీ మార్చతానని అంటాడు. దేవయాని తల నొప్పి అని తాము ముందు వెళ్లిపోతామని అంటుంది. మిత్ర మనీషాని కూడా వివేక్ వాళ్లతో పంపేస్తాడు. లక్ష్మీ నర్శింహ మాటల్ని గుర్తు చేసుకొని వివేక్‌కి కాల్ చేసి వెనక్కి రమ్మని పిలుస్తుంది. దాంతో వివేక్ వాళ్లు వచ్చేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కూతురి పరిస్థితికి కుమిలి కుమిలి ఏడుస్తున్న దీప.. జ్యోత్స్న బుద్ధి ఇంత దారుణమా!






















