Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today February 4th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఒక్కటైపోయిన లక్ష్మీ, మిత్ర.. గదిలో రొమాన్స్.. మనీషా ప్లాన్స్ అట్టర్ ఫ్లాప్స్!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ, మిత్రలను పెద్దావిడ ఒకే గదిలో ఉండమని చెప్పడం మనీషా తన ప్లాన్స్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయని ఫీల్ అవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ జయదేవ్ మాట్లాడుకుంటారు. మనీషా వెళ్లిపోవడం వల్ల నువ్వు, మిత్ర హ్యాపీగా ఉండొచ్చని చెప్తారు. దానికి లక్ష్మీ మనీషా అంత ఈజీగా వెళ్లదని ఏదో ఒక గొడవ పెట్టే వెళ్తుందని అంటుంది. దాంతో జయదేవ్ అందుకే మిత్రతో పాటే నువ్వు పార్టీకి వెళ్లని లక్ష్మీతో చెప్తాడు.
లక్ష్మీ రాకతో తన ప్లాన్ వేస్ట్ అయిపోతుందని మనీషా చిరాకు పడుతుంది. దేవయాని మనీషాతో లక్ష్మీ వస్తే నువ్వు అనుకున్న పని అవ్వదు కదా అంటుంది. దానిక మనీషా లక్ష్మీని ఎలా అవాయిడ్ చేయాలా అని ఆలోచిస్తున్నానని అంటుంది. లక్ష్మీ ఫంక్షన్‌కి రాకుండా ఆపడానికి ఏమైనా ప్లాన్ చేయాలని మనీషా అంటుంది. దాంతో దేవయాని మిత్ర, లక్ష్మీలతో పాటు జాను, వివేక్ కూడా వస్తున్నారు ఎలా ఆపుతావని అంటుంది. ఇంతలో మనీషాకి ఓ ఐడియా వచ్చి అలా చేస్తానని అంటుంది. రాజేశ్వరి లక్ష్మీని లాక్కెళ్లి మిత్ర గదిలోకి తోసేస్తుంది.
లక్ష్మీ మిత్రతో కావాలని నేను పడలేదని పెద్దమ్మ పంపారని నేను వెళ్తానని అంటుంది. దాంతో మిత్ర ఇక్కడ పడుకుంటా అని వచ్చి వెళ్లిపోతావేంటి ఇక్కడే పడుకో అని చెప్తాడు. మిత్ర లక్ష్మీ చేయి పట్టుకొని నా చేయి పట్టుకోవడం ఇష్టం లేకపోతే చెప్పు ఇప్పుడే వదిలేస్తా అని అంటే లక్ష్మీ వద్దని మీరు వదిలినా మీ చేయి నేను వదలను మనం ఎప్పటికీ కలిసే ఉంటాం కదా విడిపోం కదా అని లక్ష్మీ ఎమోషనల్ అవుతుంది. ఎప్పటికీ కలిసే ఉంటామని మిత్ర అంటాడు. ఇద్దరూ ఒకర్ని ఒకరు హగ్ చేసుకుంటారు.
ఇక మనీషా, దేవయాని హాల్‌లో కూర్చొంటారు. ఎదురుగా కూర్చొన్న రాజేశ్వరి దేవిని మనీషా చూపించి ఆమె కింద పడిపోతే ఆమెను చూసుకోవడానికి లక్ష్మీ ఇంట్లో ఉండిపోతుంది కదా అని అంటుంది. పెద్దావిడ నడిచే దారికి మధ్యలో ఆయిల్ పడేస్తుంది. బామ్మ లేచి నడిచివస్తుంది. ఆయిల్ మట్టి కింద పడిపోతుంది అనే టైంకి లక్ష్మీ వచ్చి పట్టుకుంటుంది. దాంతో రాజేశ్వరి దేవికి ప్రమాదం తప్పుతుంది. ఆయిల్ ఇక్కడ ఎందుకు పడిందని అని అనుకుంటారు. రాజేశ్వరి దేవి దేవయానిని పిలుస్తుంది. నువ్వే కదా పడేశావ్ అని దేవయాని మీద అరుస్తుంది. పొరపాటున పడుంటుందని జయదేవ్ సర్దిచెప్తాడు. మళ్లీ మనీషా ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. వివేక్ భార్య దగ్గరకు వెళ్లి మనం కూడా వెళ్దాం రెడీ అవ్వు అంటే జాను వద్దని వాళ్ల మధ్యలో ఎందుకు అని అంటుంది. అక్కా బావల ప్రైవసీ కోసం బాగానే ఆలోచించావని అంటాడు.
ఇక రామని చెప్పడానికి ఏదో ఒకటి చెప్దామని అనుకుంటారు. లక్ష్మీ రెడీ అవుతుంటే మిత్ర వెళ్లి సాయం చేస్తాడు. మిత్ర లక్ష్మీతో నువ్వు పార్టీకి రాకపోవడమే బెటర్ అనిపిస్తుందని అంటాడు. ఎందుకని లక్ష్మీ అడిగితే ఇంత అందం నాతో వస్తే అందరూ దిష్టి పెడతారని అంటాడు. చాలా అందంగా ఉన్నావని లక్ష్మీని ముద్దు పెట్టడానికి వెళ్లినట్లు వెళ్లి కాటుక తీసి లక్ష్మీకి పెడతాడు. తర్వాత లక్ష్మీని తీసుకొని కిందకి వెళ్తాడు. జాను, వివేక్‌లు రావడం లేదని చెప్తారు. షాపింగ్‌కి వెళ్తాం అని చెప్తుంది. రాజేశ్వరి దేవి లక్ష్మీ, జానులను పొగిడేస్తుంది. ఇంతలో మిత్ర, మనీషాల ఫ్రెండ్స్ ఇద్దరు వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: తల్లిదండ్రుల్ని దారుణంగా అవమానించిన సంధ్య.. సంజయ్, బిగ్‌డాడీల కొత్త ఆట షురూ!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

