Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today February 27th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మనీషాని పెళ్లి చేసుకోనున్న మిత్ర... రెండో పెళ్లి ఖాయమన్న దీక్షితులు
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మనీషాని పెళ్లి చేసుకుంటానని మిత్ర చెప్పడం లక్ష్మీ జీవితంలో పెనుమార్పు రాబోతుందని దీక్షితులు గారు హెచ్చరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషా అబార్షన్ చేయమని అదే తన ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అని మిత్ర ముందు హడావుడి చేస్తుంది. దానికి మిత్ర సొల్యూషన్ నేను చెప్తానని అంటాడు. పిల్లలు స్కూల్‌లో ఆటల పోటీల్లో పాల్గొంటారు. మ్యూజికల్ ఛైర్‌లో గెలుస్తుంది. జాను డాక్టర్ దగ్గరకు వెళ్లి తనదైన స్టైల్‌లో తన భర్త తనకు అంతా చెప్పేశాడు మీరు ఎందుకు దాస్తున్నారు అని డాక్టర్‌ని నిలదీస్తుంది. సరిగ్గా డాక్టర్ చెప్పే టైంకి వివేక్ వచ్చి ప్రాబ్లమ్ నాకే అని అంటాడు డాక్టర్ కూడా ప్రాబ్లమ్ వివేక్‌కే అని చెప్పి ముందు కోర్సు వాడండి తర్వాత చూద్దాం అని చెప్పి వెళ్లిపోతాడు. జాను లక్ష్మీ వాళ్ల దగ్గరకు వెళ్తుంది. మిత్ర ఎక్కడికి వెళ్లాడు.. మనీషా దగ్గరకు వెళ్లాడా అని ఆలోచిస్తుంది. మిత్ర మనీషా ప్రాబ్లమ్‌కి న్యాయం చేస్తానని అంటాడు.
మనీషా చాలా హ్యాపీగా ఫీలవుతుంది. పైకి మాత్రం ఏడుస్తూ మీ నాన్న ఒప్పుకోరు. లక్ష్మీ ఒప్పుకోదు అంటుంది. మిత్ర అంకుల్‌తో మనీషా నాతోనే ఉంటుంది. తను నా ప్రియురాలు అంటుంది. మనీషా ఏం వద్దని నేను ఒక్కదాన్నే బాధ పడతాను అంటుంది. దానికి నా వల్ల నువ్వు ఇబ్బంది పడొద్దని నేను చూసుకుంటా అంటాడు. ఫ్యామిలీ అంతా నీకు ఎదురు తిరిగితే ఏం చేస్తావు అంటే ఏం అడ్డు వచ్చినా నేను కేర్ చేయను నిర్ణయం తీసుకున్నానని అంటాడు. తప్పు జరిగినప్పుడే మన పెళ్లి జరగాల్సింది ఇప్పుడు అందరి సమక్షంలోనే ఓ నిర్ణయం తీసుకుంటాను పద మన ఇంటికి వెళ్దామని మనీషా చేయి పట్టుకొని వెళ్తాడు.
దీక్షితులు గారు జయదేవ్‌ని పిలిచి మిత్ర జీవితంలో అతి పెద్ద మార్పు జరుగుతుందని అంటాడు. మిత్ర జీవితంలో మరో పెళ్లి రాసిపెట్టి ఉందని దీక్షితులు గారు చెప్పడంతో జయదేవ్ బిత్తరపోతారు. తప్పించలేమని దీక్షితులు గారు అంటారు. జయదేవ్ లక్ష్మీ జీవితం నాశనం అయిపోతుందని పిల్లలు అన్యాయం అయిపోతారని జయదేవ్ బాధ పడతాడు. ఈ సారి ఎవరూ ఈ పెళ్లిని ఆపలేరని చెప్తాడు. జాను జీవితంలో కూడా విపత్తు రాబోతుందని దీక్షితులు గారు చెప్తారు. లక్ష్మీ రాజేశ్వరిదేవికి వడ్డిస్తుంది. లక్ష్మీ జయదేవ్‌ని భోజనానికి పిలుస్తుంది. తినను అని జయదేవ్ అంటే పాపం లక్ష్మీ నీ కోసం ఎదురు చూస్తుందని తినమని అంటుంది. దాంతో జయదేవ్ వస్తాడు. రాబోతున్న విపత్తు గురించి జయదేవ్ టెన్షన్ పడతాడు. ఇంతలో లక్ష్మీ ఉదయం తనకు మిత్ర, మనీషా పెళ్లి చేసుకున్నట్లు కల వచ్చిందని చెప్తుంది. జయదేవ్ చెమటలు పట్టేస్తాడు. వేకువ జామున వచ్చిన కలలు నిజం అవుతాయి కదా అని లక్ష్మీ టెన్షన్ పడుతుంది. ఇంతలో మిత్ర మనీషా చేయి పట్టుకొని ఇంటికి వస్తాడు.
మిత్ర మనీషా చేయి పట్టుకోవడాన్ని జయదేవ్ కోపంగా చూడటంతో మిత్ర చేయి వదిలేస్తాడు. లక్ష్మీ భోజనానికి పిలిస్తే మేం తినేశామని మిత్ర చెప్తాడు. మిత్ర పడుకొని ఉంటే ఉదయం మనీషా అంకుల్ ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్పావా అని అడుగుతారు. లక్ష్మీ రావడంతో మిత్ర టెన్షన్ పడి కాల్ కట్ చేసేస్తాడు. మరోవైపు జాను తనని పట్టించుకోవడం లేదని వివేక్ దగ్గర బుంగ మూతి పెడుతుంది. వివేక్ కాఫీ పంచుకుందామని తీసుకోగానే దేవాయాని వివేక్‌ని పిలుస్తుంది. వివేక్ వాళ్ల మామయ్య, వాళ్ల కూతురు అని ఇద్దరిని పరిచయం చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: గౌతమ్‌ని కుర్చీకి కట్టి కొరడాతో చితక్కొట్టిన సీత.. మహాలక్ష్మీ అధికారం పాయే!





















