Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today February 24th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: డాక్టర్‌ని బెదిరించి ప్రెగ్నెన్సీ సక్సెస్ చేసిన మనీషా.. బెడిసికొట్టిన లాంగ్ డ్రైవ్ ప్రోగ్రాం!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్రను ఒంటరిగా తనతో పాటు తీసుకెళ్లాలని మనీషా ప్లాన్ చేయడం ఇంతలో ఓ ఫోన్ కాల్ వల్ల తన ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ, మిత్రలు బయటకు వెళ్లగానే మనీషా డాక్టర్‌తో తాను ప్రెగ్నెంట్ అని చెప్పమని అంటుంది. డాక్టర్ చెప్పను అంటే ఆపరేషన్ కత్తితో డాక్టర్ గొంతు దగ్గర పెట్టి బెదిరిస్తుంది. డబ్బు కూడా అకౌంట్‌లో వేస్తానని చెప్తుంది. దాంతో డాక్టర్ సరే అంటుంది. మనీషా బయటకు వెళ్లి బేబీ హెల్దీగా ఉందని జాగ్రత్తలు చెప్పారని అంటుంది.
లక్ష్మీ డాక్టర్ దగ్గరకు వెళ్లి మీ వృత్తి ధర్మానికి మీరు ద్రోహం చేయడం కరెక్ట్ కాదని అంటుంది. మనీషా డాక్టర్‌ని బెదిరించి మిత్రని మోసం చేసిందని లక్ష్మీ మామయ్య, పిన్నిలతో చెప్తుంది. మనీషా మిత్రతో ఎలా అయినా తాళి కట్టించుకోవాలని అనుకుంటుంది. వివేక్, మిత్రలు జాగింగ్‌కి వెళ్తారు. ఇద్దరూ నవ్వుకుంటూ రావడం చూసిన లక్ష్మీ, జానులు హ్యాపీగా ఫీలవుతారు. ఇక మిత్ర తండ్రి కళ్లజోడు కనిపించకపోవడంతో పేపర్ చదివి వినిపిస్తాడు. మిత్రలో గిల్టీ పోయి నవ్వుడం చూసి అందరూ సంతోష పడతారు. అదంతా చూసిన మనీషా దేవయానితో మిత్ర నవ్వు ఎలా మాయం చేయాలో నాకు తెలుసు అని అంటుంది. మిత్రని ఆఫీస్‌కి వెళ్లమని అంటుంది.
మనీషా కూడా వచ్చి వెళ్లు మిత్ర అని చెప్పి తాను వస్తానని అంటుంది. మనీషా దేవయానితో మిత్రని బయటకు తీసుకెళ్తానని అంటుంది. మనీషా ప్లాన్ ప్రకారం డాక్టర్ మిత్రకు కాల్ చేసి మనీషా సిక్ అయిపోయింది మనీషాని బయటకు తీసుకెళ్లండి అప్పుడే తను తన కడుపులో బేబీ ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్‌తో చెప్పిస్తుంది. మిత్ర సరే అని డాక్టర్‌తో చెప్తాడు. ఇక మిత్ర ఇంట్లో వాళ్లతో ఆఫీస్‌కి రావడం లేదని మనీషాని తీసుకొని బయటకు వెళ్లాలని చెప్తాడు. మనీషా వచ్చి ఆఫీస్‌కి వెళ్దామంటే మనం ఆఫీస్‌కి వెళ్లొద్దు మనీషా బయటకు వెళ్దాం అంటాడు. దాంతో మిత్ర, మనీషా ఇద్దరూ బయటకు వెళ్తారు. లక్ష్మీ చాలా బాధపడుతుంది. మనీషా ప్లాన్ ప్రకారమే ఇలా బయటకు తీసుకెళ్తొందని లక్ష్మీ ఇంట్లో చెప్తుంది.
మనీషా మిత్రతో లాంగ్ డ్రైవ్‌కి వెళ్దామని అరకు వరకు వెళ్లి రిసార్ట్ వరకు వెళ్లి నైట్ స్టే చేద్దామని అంటుంది. మిత్ర వద్దని అంటాడు. దాంతో మనీషా అలిగి కారు దిగిపోతుంది. దాంతో మిత్ర సరే అని మనీషాని తీసుకెళ్తాడు. ఇక పిల్లలకు టీచర్ యానివల్ డే కి తల్లీదండ్రుల్ని తీసుకురమ్మని చెప్తారు. పిల్లలు ఇద్దరూ రేపు తల్లిదండ్రుల్ని తీసుకెళ్లాలని అనుకుంటారు. జాను కిచెన్‌లో పరధ్యానంలో ఉంటుంది. ప్రెషర్‌లో మూత తీసేస్తుంది దాంతో కుక్కర్ వేడికి జాను అరుస్తుంది. ఆడవాళ్లు అక్కడికి చేరుకుంటారు. పిల్లల్ని కనడం రాదు వంట రాదు అని దేవయాని జానుని హర్ట్ చేస్తుంది. ఇక రాజేశ్వరి దేవీ దేవయానిని తిట్టి కిచెన్ క్లీన్ చేయమని అంటుంది. జానుని లక్ష్మీ సర్ది చెప్పి పంపిస్తుంది. వివేక్ ఏదో దాస్తున్నాడని పెద్దావిడ లక్ష్మీతో చెప్తుంది. దాంతో లక్ష్మీ విషయం తాను తెలుసుకుంటానని అంటుంది.
స్కూల్ ప్రిన్సిపల్ వెంటనే మిత్రని స్కూల్‌కి రమ్మని చెప్తుంది. దాంతో మిత్ర సరే అని కారు వెనక్కి తిప్పేస్తాడు. మనీషా హర్ట్ అయిపోతుంది. ఇక లక్ష్మీకి కూడా ప్రిన్సిపల్ మేడం లక్ష్మీని కూడా రమ్మంటుంది. జున్ను మరో స్టూడెంట్‌ని కొట్టాడని దాని గురించి మాట్లాడాలని అంటారు దాంతో లక్ష్మీ బయల్దేరుతుంది. జానుకి డౌట్ వచ్చి ట్యాబ్లెట్ కవరు చూసి తన ఫ్రెండ్‌కి కాల్ చేసి మెడిసిన్ ఫొటో పెట్టి వేటి కోసం వాడుతారని అడుగుతుంది. దాంతో లేడీస్‌కి వాడుతారని ఆడవాళ్లు మాత్రమే వాడాలని ప్రెగ్నెన్సీ కోసం అని చెప్తుంది.
జాను చాలా ఏడుస్తుంది. తన కోసం భర్త నింద వేసుకున్నాడని ఎంత పని చేశారండీ అని ఏడుస్తుంది. లక్ష్మీ, మిత్రలు స్కూల్‌కి వెళ్తారు. పిల్లలు గొడవలు గురించి చెప్తారు. పిల్లలిద్దరినీ మిగతా ఫ్రెండ్స్‌తో మిత్ర కలిపిస్తాడు. ఇంకెప్పుడూ గొడవ పడకూడదని చెప్తారు. మనీషా మిత్రతో లాంగ్ డ్రైవ్‌కి వెళ్దామని అంటే రేపు ఫంక్షన్ ఉంది కదా మనం ఇంకోసారి వెళ్దామని మిత్ర అంటాడు. జాను వివేక్ వస్తే నాకు నిజం తెలిసిపోయిందని ఇవి నాకోసం అని నాకు తెలిసి పోయిందని అంటుంది. వివేక్ షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌ని తన్ని నిజం బయట పెట్టేసిన 'రౌడీ'దేవయ్య.. గుండె బాధుకొని ఏడ్చి కాళ్లవేళ్లా పడిన క్రిష్!





















